పేజీలు

3, జూన్ 2018, ఆదివారం

రామములగ కాయ (Tomato)


రామములగ కాయ, తక్కాళిపండు.      ఆంగ్లం: టొమాటో ( Tomato).     హింది: టమాటర్
విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా కలిగిన కూరగాయగా దీనిని చెప్పుకోవచ్చు. దీనిలో విటమిన్లు A. K. B1. B3,
B5,B6, B9, B7, C మరియు మినరల్స్ పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, క్రోమియం, జింక్, ఫాస్ఫరస్,
సమృద్ధిగా వున్నాయి. దీనిలో అత్యంత సమృద్ధిగాఉండే లైకోపిన్ (Lycopene) అనే యాంటీఆక్షిడేంట్, కాన్సర్
కారకాలైన ప్రీ రాడికల్స్ ను సమూలంగా ప్రారదోలుతుంది. ఇది మానవులలో సంభవించే చాలా రకాల కాన్సర్ లను
నివారించే శక్తి కలది. రోజువారీ వినియోగం ఉన్నట్లయితే వీనిలోని లైకోపిన్ రక్తంలోని LDL, కొలెస్టరాల్, ట్రైగ్లిజరైడ్
లను, నియమిత స్థాయులలో నిలిపిఉంచి, గుండెజబ్బుల ప్రమాదం కనుచూపుమేరలో లేకుండా చేయగలదు. ఇదే
లైకోపిన్ పోలేట్ తో కలిసి అల్జీమర్ మరియు పార్కిన్సన్ వ్యాధులను నిరోధిస్తుంది. దీనిలోని కౌమారిక్ యాసిడ్
మరియు క్లోరోజేనిక్ యాసిడ్లు దూమపానం చేసేవారిలో లంగ్ కాన్సర్ కు కారణం అయ్యే కార్సినోజెన్స్లను నాశనం
చేస్తాయి. క్లోరోజెనిక్ యాసిడ్ అధిక రక్తపోటును తగ్గించడంలోకూడా ఉపయోగపడుతుంది. దీనిలో అధిక మోతాదులో
ఉన్నపొటాషియం గుండెజబ్బులను నిరోదించడమే కాకుండా, కండరాలు కృశించి పోకుండాను, ఎముకల సాంద్రత
తగ్గకుండాను, కిద్నీలలో రాళ్ళు ఏర్పడకుండాను, చూస్తుంది. పొటాషియం అధిక రక్తపోటును, మానసిక వత్తిడిని
తగ్గించి నరాల ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. లుటైన్, బీటాకెరటీన్, లైకోపిన్లు, వృద్ధాప్యంలో వచ్చే కేటరాక్టులు, మాక్యులర్
డీజనరేషన్ వ్యాదులు రాకుండా కండ్లను రక్షిస్తాయి. దీనిలో సమృద్ధిగా ఉన్న C విటమిన్, collagen తయారీని
సమృద్దిగా చెయ్యటం ద్వారా, చర్మం సాగిపోకుండాను, కురుపులు మచ్చలు రాకుండాను, ముడతలుపడకుండాను,
చేసి చర్మసౌందర్యాన్ని నిలిపి ఉంచుతుంది. శిరోజాలను, గోళ్ళను మెరియునట్లు చేస్తుంది. దీనిలోని A విటమిన్
రేజీకటిని నివారించటమే కాక కంటిచూపును పెంచుతుంది మరియు శిరోజాలను, ఎముకలను, దృడంగా మెరయు
నట్లు చేస్తుంది. దీనిలోని రిబోప్లావిన్ తరచుగా వచ్చే తలనొప్పిని రాకుండా చేస్తుంది. దీనిలోని K విటమిన్
ప్రమాదాలలో రక్తం గద్దకట్టునట్లు చెయ్యటమే కాక ఎముకలను వృద్ధిచేస్తుంది. దీనిలోని పోలేట్ (B9)శరీరకణజాలం
అభివృద్ధికి, కార్యనిర్వహణకు, దోహదపడుతుంది. గర్భిణీలలో వచ్చే న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్ రాకుండా చూస్తుంది.
దీనిలోని ఇనుము రక్తప్రసరణ శరీరమంతట చక్కగా జరిగేట్లు చేస్తుంది.  ఒక వారంలో పది టొమాటోలు పచ్చిగా గాని,సూప్ లేదా రసంలాగాని తీసుకున్న మహిళల్లో గుండె జబ్బుల ప్రమాదం 32 శాతం తగ్గినట్లు ఓ పరిశోధన. కాన్సర్ప్రమాదాన్ని 11 శాతం తగ్గిస్తుంది. జిడ్డు చర్మతత్వం ఉన్నవారికి టమాటో మంచి మందు. టమాటో రసం మర్ధనతోవదులైన చర్మం బిగుతు అవుతుంది. NB: కిడ్నీలలో రాళ్ళు ఉన్నవారు టొమాటోలను గింజలు తీసివేసి తినాలి.గుండెజబ్బులు, కడుపులో మంట కలవారు మితంగా తినాలి.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి