పేజీలు

8, జూన్ 2018, శుక్రవారం

కీరదోసకాయ


కీర దోసకాయ. ఆంగ్లం: గార్డెన్ కుకుంబర్. హిందీ: ఖీరా .
కీరదోసలో గుండెకు మేలుచేసే పొటాషియం, కండరాలను దృఢపరిచే మెగ్నీషియం, ఎముకలను నిర్మించే మాంగనీస్,
వ్యాధులను నిరోదించే C విటమిన్, యాంటీ ఇంప్లమేటరిగా పనిచేసే విటమిన్ K, శక్తిని ఉద్దీపనచేసే B5 విటమిన్,
కంటిచూపును పెంచే విటమిన్ A, కాన్సర్లను నిరోధించే లిగ్నాన్స్, సమృద్ధిగా ఉన్నాయి. దీనిలోని పొటాషియం
రక్తపోటును (BP) నియంత్రణలో ఉంచుతుంది. మరియు శక్తివంతమైన ప్లవనాయిడ్స్ & టానిన్స్ అధిక సుగర్ ను,
ట్రైగ్లిజరైడ్స్ ను, చెడ్డకొలెస్టరాల్ ను, 80% తొలగించే శక్తి కలిగివుంటాయి. దీనిలోని మెగ్నీషియం రక్త ప్రసరణను
క్రమబద్దీకరించి, కండరాలను శక్తివంతంగా మార్చుతుంది. దీనిలోని బీటాకెరటీన్ ప్లవనాయిడ్లు శరీరంలోని అధిక తాపం,
మంటలను తొలగిస్తాయి. దీనిలోని పిసిటిన్ అనే ప్లవనాయిడ్ నాడీ మూలాలను పరిరక్షించటం ద్వారా అల్జీమర్ లాంటి
వ్యాధులను అరికడుతుంది. దీనిలోని లిగ్నాన్స్, కుకుర్బిటాసియన్, ట్రైటెర్పినాయిడ్స్, అన్నిరకాల కాన్సర్లను చక్కగా
నిరోదిస్తాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. వీనితోపాటు పిసిటిన్ అనే ప్లవనాయిడ్ కూడా కాన్సర్ల నివారణలో
అధ్బుతంగా సహాయపడుతుంది. ఎముకలు దృడంగా, పొడవుగా పెరిగేందుకు విటమిన్ K,కీళ్ళకు చెందిన కండరపేశాల
దృఢత్వానికి సిలికా చక్కగా పనిచేస్తాయి. ఎరిప్సిన్ అనే ఎంజైమ్, ప్రేగులలోని నులిపురుగులను, బద్దీపురుగులను
నాశనం చేస్తుంది. కీరాలోని పీచు పదార్దం జీర్ణశక్తిని వృద్ధి చేసి, విషపదార్దాలను బయటకు నెట్టివేసి, మలబద్ధకాన్ని
రానివ్వదు. కీరాలోని కాపర్ న్యూరోట్రాన్సిమిటర్లను విస్త్రుతపరఛి, వాని మధ్య ప్రసారాలు నిరంతరం కొనసాగేలా చేస్తుంది.
బాధతో కూడిన మూత్రవిసర్జనలోను, మూత్రపిండాలలో రాళ్ళను నివారించటంలోను, కాపర్ బాగా సహాయపడుతుంది.
కీరాలోని పైటోకెమికల్స్, కోలాజేన్ తయారీద్వారా చర్మాన్ని స్థితిస్థాపకతతో ఉంచి, పిరుదుల భాగంలో ఏర్పడే క్రొవ్వును
కరిగిస్తాయి. మరియు ఇవే పైటోకెమికల్స్ కడుపులోని అధిక వేడిని తీసివేసి, నోటి దుర్వాసనను, చిగుళ్ల వ్యాధులను,
అద్భుతంగా నివారిస్తాయి. ఇందలి సిలికా మరియు యాంటీఆక్షిడెంట్ లు, కళ్ళచుట్టూ ఏర్పడే నల్లమచ్చలను,
తగ్గించటమే కాక చర్మానికి మంచి ఛాయను ఇస్తాయి. యాస్కారిక్ యాసిడ్, కఫేయిక్ యాసిడ్ , కండ్ల చుట్టూ
ఏర్పడిన ఉబ్బులను, వానిలోని నీటిని తొలగించటం ద్వారా త్వరితంగా తగ్గిస్తాయి. దీనిలో అమితంగా ఉన్న ఫోలిక్
యాసిడ్, ఇనుములు, ఎర్ర రక్తకణాలను పెంపొందించి, అనీమియాను, రానివ్వవు. కీరాలోని సిలికా, సల్పర్, సోడియం,
పాస్ఫరస్, కాల్షియంలు, శిరోజాలు ఎదగటానికి, మెరవటానికి, ఉపయోగిస్తాయి. చర్మం సాగిపోకుండా, ఎండకు కంద
కుండా, మంచి రంగుతో నిత్య యవ్వనంగా ఉండేట్లు చేస్తాయి. శరీరంలో యూరిక్ యాసిడ్ పేరుకోవడం ద్వారా వచ్చే
కీళ్ళ జబ్బులకు, డయాబెటిస్ కు, కీరదోస మంచి ఆహారం. ఛాతీ, ఊపిరితిత్తులు, ఉదర వ్యాదుల వారికి, ఎగ్జిమా,
గౌట్, మలబద్ధకం వారికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. Tip: అనేక పోషకాలు, విటమిన్లు వీని తోలులోనే ఉంటాయి
కనుక వీనిని తోలు, గింజలుతొనే తినటం మంచిది.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి