పేజీలు

30, జూన్ 2018, శనివారం

కిరాణా: Grocery in English, Telugu, Hindi

Grocery:
English Telugu Hindi
Acorus/ Sweet flag వస bach
Alum పటిక phitkiree
Amber/ Styrax Gum సాంబ్రాణి Lobaan
Beaten Rice అటుకులు Poha/ Chiwda
Boiled Rice ఉప్పుడు బియ్యము ఉస్నా చావల్ 
Broken Rice వరి నూక  కనకీ 
Butter వెన్న మఖన్ 
Beestings/colostrum Milk జున్నుపాలు పేవస్ 
Buttermilk మజ్జిగ Chaas/ mattha
Cambodge మలబారు చింత  కోకం 
Camphor bomeo పచ్చకర్పూరము కచ్చా కపూర్ 
Camphor sumatre హరతికర్పూరము కపూర్, ఘనసార్ 
Castor Oil ఆముదము గందర్వ్ తేల్ 
Cheese~Cottage పన్నీరు  paneer
Cheese ~Curd జున్ను cheena
Citric Acid Crystals  నిమ్మ ఉప్పు  నింబూ ఫూల్ 
Clarified Butter  నెయ్యి Ghee
Cream- fresh మీగడ, సంతానిక  మలాయ్ 
Curd, coagulam  పెరుగు దహీ
Cuss Cuss వట్టివేరు Khas/ usheer
Dates with dryskin ఎండు ఖర్జూరాలు Chuhaara
dried Coconut ఎండు కొబ్బరిచిప్పలు  కోప్రా 
Dry-ginger శొంటి సోంట్ 
Dry Red Chilli ఎండు మిరపకాయలు  సూఖీ లాల్ మిర్చి 
Gallnut, Myrobalan కరక్కాయ  మాజూఫల్, నాభక్ 
Groundnuts వేరుశనగకాయలు  మూంగ్ ఫల్లి 
Honey తేనె Shahad
Indian Corn - on the cob మొక్కజొన్న కండెలు  Bhuttaa
Indian Corn - kernel మొక్కజొన్నలు  మక్క, మకఈ 
Jaggery బెల్లము Gud
Lemon Grass నిమ్మ గడ్డి  బూస్టీనియా
Licorice అతిమధురం mulethi
Milk పాలు dhoodh
Milk - dried కోవా  koya
Musk, Civet పునుగు, జవ్వాజి  కస్తూరి
Nigella నల్లగింజలు  కలోంజి 
Olive oil ఆలివ్ నూనె Zetoon ka thel
Onion పెద్ద ఉల్లిపాయ  pyaaz
Opium నల్లమందు అఫిమ్ 
Oregano ఎండు వామాకుపొడి  సత్ర   Sathra
pomegranate seeds ఎండు దానిమ్మ గింజలు  బేదానా
Puffed Rice మరమరాలు, బొరుగులు  ముర్ముర 
Rapeseed Oil ఆవనూనె సరసొంకా తేల్ 
Raisin పెద్ద ఎండు ద్రాక్ష  మునక్కా
Sago, Tapioca Granules సగ్గుబియ్యము saabudhaana
Salt ఉప్పు Namak
Semolina బొంబాయి రవ్వ  sooji
Soapnut కుంకుడుకాయలు  రీటా
Sugar- Brown బ్రౌన్ పంచదార బూరా చీనీ 
Sugar- white తెల్ల పంచదార  చీనీ 
Sugarcane చెరకు  గన్నా,  ఈఖ్
Tamarind చింతపండు ఇమ్లీ 
Turmeric పసుపు హల్ది 
Venigar సీమకాడి  సిర్కా 
wheat broken గోదుమనూక  దాలియా 

29, జూన్ 2018, శుక్రవారం

కూరగాయలు : Vegetables names in English, Telugu, Hindi

Vegetables
English Telugu Hindi
Amaranth తోటకూర Chowlai sag
Amaranth -Red కొయ్య తోటకూర  Lal Chaulai 
Arum/ Colacasia చేమదుంప Aravi/ Kacchoo
Ash gourds /Wax gourds బూడిదగుమ్మడి Petha  పేఠా
Asparagus పిల్లిపీచర, చందమామ గడ్డలు  Sathavari, Musli
Beet Root బీటుదుంప Chukandar
Bitter gourd కాకరకాయ Karela
Bottle (Long)  gourd సొరకాయ/ఆనపకాయ Lauki-Ghiya
Brinjal వంకాయ Baingan,  Bhataa
Broad Beans~Indian పెద్ద చిక్కుడు కాయలు Sem/Bakala/ Papdi
Cabbage కోసుగడ్డ  Pattha Gobi/Bandh Gobi
Capsicum/ Bell Peppar బెంగుళూర్ మిర్చి,  కూర మిరప  Badi/Simla Mirch
Carrot గాజరగడ్డ  Gaajar
Cassava Root కర్ర  పెండలం Rathaalu, sevar kandh
Cauliflower కోసుపువ్వు  Phool Gobi
Celery వామాకు  Ajmud, Ramdhuni
Chenopodium  Album  పప్పుకూర  Bathua
Chinese Spinach బచ్చలి కూర  Poi Saag
Cluster Beans గోరుచిక్కుడు Gowaar-Phalli
Coconut kernel కొబ్బరి  Garee
Coriander Leaves/ Cilantro కొత్తిమెర Dhania pattha
Cranberry/ Natal Plum వాకకాయ Karonda
Cucurbita Gourd/ Yellow Cucumber పచ్చదోసకాయ kakadi
Curry Leaf కరివేపాకు kari Pattha 
Dock Sorrel చుక్కకూర katta palak
Drumsticks మునగకాయలు Sahijan
Egyptian Luffa  నేతి బీరకాయ  Nethuba/ Gilka 
Elephant  apple/ Curd Fruit వెలగకాయ Kaith/ 
Elephant Yam కంద Suran, Jamee Kandh
Fathen Leaves పప్పు కూర  Bhathuwa
Fenugreek Leaves మెంతికూర Methi
Fenugreek Leaves - dried ఎండు మెంతిఆకు  Kasoori methi
Garden Cucumber కీర దోసకాయ kheeraa
Garlic వెల్లుల్లి Lahsun
Gherkins దొండకాయలు Kamarkas/ Kundhroo
Goose berry ఉసిరికాయ Aamla
Green Chillies పచ్చిమిరపకాయలు Hari Mirchi
Green Ginger అల్లం Adhrak
Green Peas పచ్చి బటాణి Hari Matar
Green Plantain కూర అరటి Kaccha Kela
Ivy Gourd హైబ్రీడ్ దొండకాయలు Tindora
Kohlrabi నూల్ కోల్ Ganth Gobhi
Lady's finger/Okra బెండకాయ Bhindee
Leeks  ఉల్లి కాడలు  Lasoon Vilayiti
Malabar Spinach బచ్చలి కూర  Poi Saag
Mint  Leaves పుదిన Pudina Pattha 
Mushroom - Field  మొడిదలు Kumbi
Mushroom - Morel పుట్టగొడుగులు gaganphooli,  Goochi, 
Onion ఉల్లిపాయ, ఎర్రగడ్డ pyaaz
Potato బంగాళదుంప/ ఉర్లగడ్డ Aloo    ఆలూ
Pumpkin గుమ్మడికాయ Sweet Kaddoo
Purslane పెద్ద పాయలకూర  Loonia
Radish తెల్ల ముల్లంగి  mooli
Ridge  gourd/ Angular gourd బీరకాయలు thurai, Tori
Senna సునాముఖి ఆకు senay
Shallots సాంబారు ఉల్లిపాయ  Choti pyaz
Smooth Luffa బుడ్డబీరకాయ Ghosavala
Snake gourd పోట్లకాయ Chachinda
Sorrel  leaves గోంగూర/పుంటికూర  Pitwa
Spinach పాలకూర palak
Spiny (teasel)  Gourd  ఆకాకరకాయ Kantola/ Kakrol
Sweet Potato చిలగడదుంప/ మోరంగడ్డ Shakarkandh
Sword Beans తమ్మ కాయ  Badisem
Tomato రామములగ/ తక్కాళిపండు Tamatar
Turnip ఎర్ర ముల్లంగి  salagam
Water Amaranth పొన్నగంటి కూర  Saranti Saag 
White Radish/ Parsnip ముల్లంగి Mooli

26, జూన్ 2018, మంగళవారం

పండ్లు : Fruit names in English, Telugu, Hindi'


                  English      Telugu Hindi
Apple సీమరేగిపండు సేబ్
Apricot జల్ధరుపండు జర్ధాలూ
Avocado, Butter Fruit వెన్నపండు మఖన్ ఫల్
Banana అరటిపండు కేల
Bel Fruit/Golden  Apple మారేడుపండు,  శ్రీఫలం  బేల్ ఫల్
Bilberry/Whortleberry కోరిందపండు బ్లూ బెర్రీ 
Black Plum/Indian Blackberry నేరేడుపండు జంబూ
Blueberry ఫాల్సా నీల్ బదరి
Brezil Cherry బుడ్డ మిసిరిపండు  గ్లాస్ మేవా
Bullock's Heart రామాఫలము  రాంఫల్
Citron    /Grape Fruit దబ్బపండు, తురంజిపండు  బడానింబూ
Citron (Citrus Medica) మాదీఫలము bijoura, Chakothara
Coconut కొబ్బరికాయ నారియల్ 
Custard apple/ Sweet Sop సీతాఫలము శరీఫా
Date fruit ఖర్జూరపండు కాజుర్
Fig అత్తి పండు అంజీర్ 
Grapes ద్రాక్ష అంగూర్
Guava జామకాయ అమరూద్
Indian Goosberry రాచ ఉసిరికాయ ఆమ్ల
Indian Lime నిమ్మపండు నీంబు
Indian Wild date ఈతపండు సెంధి
Jack fruit పనసపండు కట్ హల్/ కాతల్
Jujube, Plum రేగుపండు బెర్
Kiwi కివి Mor
Mango మామిడిపండు ఆమ్
Mulbery/ Blackberry పూతికపండ/ కంబళిపండు  శహతూత్
Musk-melon కర్బూజా పండు ఖర్బూజ్ 
Palm fruit/ Ice Apple తాటిపండు తర్
Papaya బొప్పాయి పపీత
Peach శప్తాలుపండు  ఆడూ 
Pear- Asian బేరిపండు, పెరిక్కాయ నాశ్ పాతి 
Pine-apple,  Ananas అనాసపండు అనన్నాస్ 
Plantain అరటిపండు బనాన
Plum ఆల్బఖారాపండు  గర్ధాలూ
pomegranate దానిమ్మపండు అనార్
Pumplemoses పంపరపనస బతావి నింబూ
Raspberry మేడిపండు కట్సోల్ Katsol
Rose Apple, Bell Fruit జంబునేరేడు,  అల్లో నేరేడు  Gulab Jamun
Sapodilla సపోటాపండు చిక్కూ
Sour Orange నారింజపండు నారంగి
Star Fruit/ Carambola అంబాణంకాయ/నక్షత్రఫలము  కమరఖ్
Star Gooseberry చిన్న ఉసిరికాయ హర్ఫరౌరి
Strawberry స్ట్రాబెర్రీ హిస్సాల్
Sweet  Lime  బత్తాయిపండు మోసంబి
Sweet/Mandarine Orange కమలాపండు సంతరా
Water melon పుచ్చకాయలు తర్బూజ్, మతీరా
Wild date ఈతపండు సెంధి
Wood Apple/Curd Fruit వెలగపండు కైత్,  కవఠ్

21, జూన్ 2018, గురువారం

జీడిపప్పు


జీడిపప్పు. ఆంగ్లం: Cashew nut. హిందీ: కాజు .
1. గుండెజబ్బులను నివారిస్తుంది: జీడిపప్పులో అధిక మొత్తంలో ఉండే మోనో అన్ శాచ్యురేటేడ్ ఫాట్స్ , రక్తంలోని ట్రై గ్లిజరైడ్స్ ను తగ్గించటం ద్వారా గుండెజబ్బులు రాకుండా చూస్తాయి. వీనిలో సమృద్ధిగా ఉన్న యాంటీ ఆక్షిడెంట్ లు కూడా గుండెజబ్బుల నివారణలో పనిచేస్తాయి అని పరిశోధనలు చెబుతున్నాయి. L arginine అవయవాలకు రక్తప్రసరణను పెంచి, విషాలను బయటకు నెట్టటం ద్వారా జీవక్రియను మెరుగుపరుస్తుంది. 2. మంచి ఆకారాన్ని, అందాన్ని ఇస్తాయి: వీనిలో సమృద్ధిగా ఉన్న కాపర్ ఫ్రీ రాడికల్స్ ను బయటకు నెట్టి ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. మరియు తరళమైన ఎముకల అభివృద్దికి, కీళ్ళలోని మృదులాస్థి అభివృద్దికి, తోడ్పడుతుంది. చర్మము, శిరోజాలకు చెందిన మెలానిన్ తయారీకి, రక్తనాళాల మృదుత్వానికి చక్కగా పనిచేస్తుంది. చర్మానికి సొగసునిచ్చే కొలాజన్, ఎలాస్తిన్ ల తయారీని ఉత్తేజపరుస్తుంది. ఎర్ర రక్తకణాల తయారీని పెంచుతుంది. పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, K విటమిన్లు కూడా ఎముకల ఆరోగ్యాన్ని పెంచుతాయి. 3. మధుమేహం: వీనిలోని మోనో అన్ శాచ్యురేటేడ్ క్రొవ్వులు, చెడ్డ కొలెస్టరాల్ ను తగ్గించి, మంచి కొలెస్టరాల్ ను పెంచుతాయి. వీనిలోని పీచుపదార్డం జీర్ణక్రియను వేగవంతం చేసి షుగర్ నిల్వలను క్రమపరుస్తుంది. ఎనాకార్దిక్ యాసిడ్, గ్లూకోజ్ నియంత్రణలోను, రవాణాలోను, ఉపయోగపడుతుంది. 4. దీనిలోని మెగ్నీషియం ఎముకల దృడ త్వానికి, ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది BPని, కండరాలు ముణగలాగుక పోవటాన్ని, మైగ్రైన్ను, నివారిస్తుంది. గాల్ బ్లాడర్లో రాళ్ళు, గుండెజబ్బులు రాకుండా సహాయపడుతుంది. మెగ్నీషియం, కాల్షియం పనిని నియంత్రించటం ద్వారా రక్తనాళాలు, కండరాలు ప్రశాంత స్థితిలో ఉండేట్లు చేస్తుంది. 5. టాకోపెరాల్స్ అనే యాంటీ ఆక్షిడేంట్ , ఫినోలెక్ కాంపౌండ్స్, DNAలు డామేజి కాకుండాను, కణాల మ్యుటేష న్ జరగకుండాను, కోలన్ ప్రోస్టేట్ కాలేయములకు కాన్సర్ రాకుండాను చేస్తాయి. 6. లుటైన్, జియాక్లాంధిన్ లు, కండ్లకు కేటరాక్టులు, గ్రుడ్డితనం రాకుండా చూస్తాయి. పోలిక్ యాసిడ్ గర్భిణీలకు మేలు చేస్తుంది.

15, జూన్ 2018, శుక్రవారం

బీటుదుంప (Beetroot)


బీట్ దుంప: Eng. Beet Root Hindi: చుకంధర్
01.బోరాన్ : బీట్రూట్ లో అధిక మొత్తంలో ఉండే బోరాన్ సెక్స్ హార్మోన్ల స్రావాన్ని పెంచుతుంది. మర్మాంగాల
క్రియాశీలతను పెంచుతుంది. విటమిన్ D, కాల్షియంలు, శరీరంనుండి నష్టపోకుండా చూస్తుంది.
02.బీటేన్ (Betaine): ఇది వ్యాకులతను (depression)తొలగిస్తుంది. మనసును ప్రశాంతంగా ఉంచుతుంది.
కాలేయము మరియు పిత్తాశయములను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎన్నో వ్యాధులను నిరోధిస్తుంది.
03. పొటాషియం : 325mg/100 g. ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. గుండె
కొట్టుకోవటాన్ని క్రమబద్ధీకరిస్తుంది. నరాలవ్యాధులను, మానసిక వత్తిడిని, గుండెపోటును రాకుండా చేస్తుంది.
04. ట్రిప్టోఫాన్: ఈ అమినొయాసిడ్ మనసును ప్రశాంతంగాను, ఉల్లాసంగాను, ఉంచుతుంది. మంచి నిద్రను
కలిగిస్తుంది. ఆకలి సక్రమంగా ఉండేట్లు చూస్తుంది. 05. ఐరన్ : ఇనుము ఎర్ర రక్తకణాలను ఉత్పత్తి చేసి,
క్రియాశీలంగా ఉంచుతుంది. రక్తకణాలకు కావలసిన ఆక్షిజన్ ను, సరపరా చేస్తుంది. హిమోగ్లోబిన్ తయారీకి
సహాయపడుతుంది. ఇనుము, B విటమిన్ తో కలిసి శరీరకణజాలాన్ని సంఖ్యాపరంగాను, క్రియాపరంగాను,
అభివృద్ధి చేస్తాయి. రక్తహీనతను రానివ్వవు. 06. Nitrates: నైట్రేట్లు రక్తనాళాలను వ్యాకోశింప జేసి, రక్తప్రసరణ
అన్నిఅవయవాలకు నిరాఘాటంగా జరిగేట్లు చేసి, గుండెజబ్బులను రానివ్వదు. మర్మాంగాలకు రక్తప్రసరణను
పెంచుతుంది. ఆటగాళ్ళలో శారీరకశక్తిని, కౌశలాన్ని, ఆక్షిజన్ గ్రహించేశక్తిని పెంచుతుంది. అల్జీమర్ వ్యాధిని రానివ్వదు.
07. ఫోలేట్(B9): పిండం త్వరగా పెరగటానికి, ఆరోగ్యంగా ఉండటానికి, కణాలు సక్రియంగా ఉండటానికి ఉపయోగం.
08. విటమిన్ B6: ఇది రోగనిరోధకశక్తిని, ఆరోగ్యకర జీవక్రియను, హార్మోనుల స్థాయులను పరిరక్షిస్తుంది.
09. బీటాకెరటీన్: కండ్లఆరోగ్యాన్ని, అందాన్ని ,కాపాడుతుంది. వృద్ధాప్యంలో శుక్లాలను, గ్రుడ్డితనాన్ని రానివ్వదు.
10. మెగ్నీషియం : దృడమైన ఆరోగ్యకరమైన, ఎముకలను నిర్మిస్తుంది. గర్భధారణశక్తిని, శారీరకశక్తిని, పెంచుతుంది.
11. విటమిన్ C: రోగనిరోధకశక్తిని పెంచుతుంది. చర్మ సౌందర్యాన్ని, ఆరోగ్యాన్ని, చూస్తుంది. నేత్రముల ఆరోగ్యాన్ని
వ్రుద్ధిచేస్తుంది. వృద్ధాప్యలక్షణాలను రానివ్వదు. 12. Betacyanin: ఇది బీట్రూట్ కు, ఎర్రని రంగును కలిగిస్తుంది.
ఇది శరీరంలోని విషాలను సమర్ధవంతంగా బయటకు నెట్టివేస్తుంది. అనేకరకాల కాన్సర్లను నిరోధిస్తుంది.
13. Fiber: ఈ పీచుపదార్డం మలబద్ధకాన్ని, అధిక కొలెస్టరాల్ ను, మధుమేహాన్ని, క్రమబద్ధీకరిస్తుంది.
14. రాగి: ఇది కళ్ళు మరియు శిరోజాల రంగు ఏర్పడేందుకు, చర్మ సౌందర్యానికి, ఇనుము జీర్ణం అయ్యేందుకు,
మెదడు శక్తివంతంగా పనిచేసేందుకు, ఉపయోగపడుతుంది. 15. మాంగనీస్: ఎముకల పెరుగుదలకు, దృడత్వానికి,
కాల్షియంను, శరీరం గ్రహించేశక్తి పెరగటానికి ఉపయోగం. రక్తంలోని షుగర్ శాతాన్ని, కణాల జీవక్రియను, నియంత్రణలో
ఉంచుతుంది.ధైరాయిడ్ హార్మోన్ పనిని క్రమపరుస్తుంది. 16. ఆల్ఫాలిపోయిక్ యాసిడ్: ఈ యాంటీ ఆక్షిడేంట్ గ్లూకోజ్
నిలవలను తగ్గిచడం, ఇన్సులిన్ ఉత్పత్తి పెంచటం, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను నిరోధించటం ద్వారా మధుమేహాన్ని
నియంత్రిస్తుంది. 17. Choline: కోలైన్ అనే ఈ న్యూట్రియంట్ మంచినిద్ర, కండరాల కదలిక, నేర్చుకునే
జ్ఞాపకశక్తిని పెంచుతుంది. కణకవచాలను రక్షిస్తుంది. నాడీ తంత్రుల మద్య ప్రసారాలను చక్కబరుస్తుంది.
18. ఆగ్జాలిక్ యాసిడ్: ఇది శరీరంలో నిల్వవున్న కాల్షియంను, బయటకు నెట్టివేసి, తద్వారా కిడ్నీలలో రాళ్ళు,
ఆర్ధరైటిస్, కాన్సర్లు, గుండెజబ్బులు రాకుండా పనిచేస్తుంది. 19. Lutein: కంటిచూపును, కంటి ఆరోగ్యాన్ని
కాపాడుతుంది. NB: కిద్నీలలో రాళ్ళు ఉన్నవారు, లోబిపి ఉన్నవారు వాడరాదు.

14, జూన్ 2018, గురువారం

జామపండు (Guava)


జామపండు. ఆంగ్లం: Guava. హిందీ: అమరూద్.
యాంటీ ఆక్సిడెంట్స్ కలిగిన పండ్లలో జామపండుది అగ్రస్థానం. పోషకాలరీత్యాను, ఆరోగ్యంకలిగించే విషయంలోనూ,
యాపిల్ పండు కంటే జామపండు ఎంతో మంచిది. చవకగా దొరికే అధ్బుతఫలంగా దీనిని చెప్పవచ్చు. టొమాటోల
కంటే రెండురెట్ల లైకోపిన్, ఆరంజెస్ కంటే నాలుగు రెట్ల C విటమిన్, పైనాపిల్ కన్నా మూడు రెట్ల ప్రోటీన్, జామ
పండ్లలో వుంటుంది. దీనిలోని లైకోపిన్, క్వెర్సిటిన్, విటమిన్ C, శరీర కణజాలంలోని ఫ్రీరాడికల్స్ ను సమర్ధవంతంగా
తొలగించి, కాన్సర్ కణాలు అభివృద్ధి కాకుండా చూస్తాయి. ఇవి ప్రోస్టేట్, లంగ్స్, పాంక్రియాస్, రెక్టం, కోలన్ లకు
వచ్చే కాన్సర్ వ్యాదులను నిరోధిస్తాయి. ఆరంజ్ కన్నా నాలుగు రెట్లు ఉన్న C విటమిన్, వ్యాధినిరోధక శక్తిని బాగా
పెంచి, వ్యాధులబారిన పడకుండా శరీరాన్ని రక్షిస్తుంది. ఇది ప్లూవ్యాధిలోను, స్కర్వి వ్యాధిలోను, డెంగ్యూ జ్వరంలోను,
బాగా సహాయపడుతుంది. మరియు జలుబు, వైరల్ ఇన్ఫెక్షన్ లను నిరోధించటంలోను, శ్వాస అవయవాలనుండి
శ్లేష్మం తొలగించటం లోను సహాయపడుతుంది. రెటినాల్ అనే A విటమిన్, కంటిచూపు దీర్ఘకాలం ఉండేట్లు గాను,
కాటరాక్ట్, మాక్యులర్ డీజనరేషన్ వ్యాధులు రాకుండాను చేస్తుంది. జామలో త్వరగా కరిగిపోయే రకం పీచు అధికంగా
వుంటుంది. ఈ పీచు రక్తంలోని షుగర్ స్థాయులను చక్కగా నియంత్రిస్తుంది. మధుమేహాన్ని దూరం చెయ్యగల,
మధుమేహ రోగులు తినగల పండు జామ. జీర్ణ అవయవాలను శుధ్ధిచేసి, మలబద్ధకాన్ని నివారిస్తుంది. మరియు
నీళ్ళ విరేచనాలను, ఊబకాయాన్ని, తగ్గిస్తుంది. జామలోని పొటాషియం, సోడియంలు, ఎలక్త్రోలైట్ల నిష్పత్తిని సరిచేసి
రక్తపోటును క్రమబద్దీకరిస్థాయి. ట్రై గ్లిజరైడ్స్ ను, చెడ్డ కొలెస్టరాల్ ను,తగ్గించి, మంచి కొలెస్టరాల్ ను, పెంచటం ద్వారా,
హృదయసంబంధ వ్యాధులను రానివ్వవు. అంతేకాక పొటాషియం కండరాలను వృద్ధిచేసి, అధికంగా వున్నా క్రొవ్వును
కరిగిస్తుంది. దీనీలోని నయసిన్ B3, పెరిడాక్సిన్ B6, మెదడుకు రక్తప్రసరణను పెంచి, తద్వారా నరాల క్రియాశీలతను,
బుద్ధి కేంద్రీకరణ శక్తిని పెంచుతాయి. మెగ్నీషియం కండరాల మరియు నరాల నొప్పులను దూరంచేసి, మంచి శక్తిని,
ప్రశాంతతను కలిగిస్తుంది. ఫోలిక్ యాసిడ్ (B9) జన్మించే పిల్లల్లో నాడీ సంబంధ వ్యాధులు రాకుండా నిరోధించి, మంచి
ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. 100 గ్రాముల జామపండులో 496 మిల్లిగ్రాముల ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరాన్ని నిత్య
యవ్వనంగా ఉంచుతాయి క్రిస్టోజాంతిన్ అనే యాంటీ ఆక్షిడేంట్ కణజాలాన్ని ఫ్రీ రాడికల్స్ దాడినుండి రక్షిస్తుంది.
లుటిన్ అనే యాంటీ ఆక్షిడేంట్ శుక్లాలను, ముసలితనంలో వచ్చే మోక్యులర్ డీజనరేషన్ వ్యాధులను నివారిస్తుంది.
విటమిన్ A, C, కెరటిన్, లైకోపిన్ లు, చర్మం మీద ముడతలు, మచ్చలు, కురుపులు,ఎర్రని దద్దుర్లు, రానివ్వవు.
చర్మంయొక్క స్థితిస్తాపకశక్తిని నిలిపి ఉంచుతాయి. విటమిన్ K కండ్లచుట్టూ నల్లని వలయాలు రాకుండాను, ముఖ
చర్మం బిగుతుగా ఉండేట్లుగాను, చేస్తుంది. శరీరం పోషకాలు అన్నింటిని గ్రహించేట్లు మాంగనీస్ చూస్తుంది. రాగి
థైరాయిడ్ గ్రంధి చక్కగా పనిచేయుటకు సహాయం చేస్తుంది. జామపండు నోటిలోని క్రిములను చంపివేసి,
చిగుళ్ళవాపు, కురుపులు, దుర్వాసన, పంటి నొప్పులను పూర్తిగా నివారిస్తుంది.

8, జూన్ 2018, శుక్రవారం

కీరదోసకాయ


కీర దోసకాయ. ఆంగ్లం: గార్డెన్ కుకుంబర్. హిందీ: ఖీరా .
కీరదోసలో గుండెకు మేలుచేసే పొటాషియం, కండరాలను దృఢపరిచే మెగ్నీషియం, ఎముకలను నిర్మించే మాంగనీస్,
వ్యాధులను నిరోదించే C విటమిన్, యాంటీ ఇంప్లమేటరిగా పనిచేసే విటమిన్ K, శక్తిని ఉద్దీపనచేసే B5 విటమిన్,
కంటిచూపును పెంచే విటమిన్ A, కాన్సర్లను నిరోధించే లిగ్నాన్స్, సమృద్ధిగా ఉన్నాయి. దీనిలోని పొటాషియం
రక్తపోటును (BP) నియంత్రణలో ఉంచుతుంది. మరియు శక్తివంతమైన ప్లవనాయిడ్స్ & టానిన్స్ అధిక సుగర్ ను,
ట్రైగ్లిజరైడ్స్ ను, చెడ్డకొలెస్టరాల్ ను, 80% తొలగించే శక్తి కలిగివుంటాయి. దీనిలోని మెగ్నీషియం రక్త ప్రసరణను
క్రమబద్దీకరించి, కండరాలను శక్తివంతంగా మార్చుతుంది. దీనిలోని బీటాకెరటీన్ ప్లవనాయిడ్లు శరీరంలోని అధిక తాపం,
మంటలను తొలగిస్తాయి. దీనిలోని పిసిటిన్ అనే ప్లవనాయిడ్ నాడీ మూలాలను పరిరక్షించటం ద్వారా అల్జీమర్ లాంటి
వ్యాధులను అరికడుతుంది. దీనిలోని లిగ్నాన్స్, కుకుర్బిటాసియన్, ట్రైటెర్పినాయిడ్స్, అన్నిరకాల కాన్సర్లను చక్కగా
నిరోదిస్తాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. వీనితోపాటు పిసిటిన్ అనే ప్లవనాయిడ్ కూడా కాన్సర్ల నివారణలో
అధ్బుతంగా సహాయపడుతుంది. ఎముకలు దృడంగా, పొడవుగా పెరిగేందుకు విటమిన్ K,కీళ్ళకు చెందిన కండరపేశాల
దృఢత్వానికి సిలికా చక్కగా పనిచేస్తాయి. ఎరిప్సిన్ అనే ఎంజైమ్, ప్రేగులలోని నులిపురుగులను, బద్దీపురుగులను
నాశనం చేస్తుంది. కీరాలోని పీచు పదార్దం జీర్ణశక్తిని వృద్ధి చేసి, విషపదార్దాలను బయటకు నెట్టివేసి, మలబద్ధకాన్ని
రానివ్వదు. కీరాలోని కాపర్ న్యూరోట్రాన్సిమిటర్లను విస్త్రుతపరఛి, వాని మధ్య ప్రసారాలు నిరంతరం కొనసాగేలా చేస్తుంది.
బాధతో కూడిన మూత్రవిసర్జనలోను, మూత్రపిండాలలో రాళ్ళను నివారించటంలోను, కాపర్ బాగా సహాయపడుతుంది.
కీరాలోని పైటోకెమికల్స్, కోలాజేన్ తయారీద్వారా చర్మాన్ని స్థితిస్థాపకతతో ఉంచి, పిరుదుల భాగంలో ఏర్పడే క్రొవ్వును
కరిగిస్తాయి. మరియు ఇవే పైటోకెమికల్స్ కడుపులోని అధిక వేడిని తీసివేసి, నోటి దుర్వాసనను, చిగుళ్ల వ్యాధులను,
అద్భుతంగా నివారిస్తాయి. ఇందలి సిలికా మరియు యాంటీఆక్షిడెంట్ లు, కళ్ళచుట్టూ ఏర్పడే నల్లమచ్చలను,
తగ్గించటమే కాక చర్మానికి మంచి ఛాయను ఇస్తాయి. యాస్కారిక్ యాసిడ్, కఫేయిక్ యాసిడ్ , కండ్ల చుట్టూ
ఏర్పడిన ఉబ్బులను, వానిలోని నీటిని తొలగించటం ద్వారా త్వరితంగా తగ్గిస్తాయి. దీనిలో అమితంగా ఉన్న ఫోలిక్
యాసిడ్, ఇనుములు, ఎర్ర రక్తకణాలను పెంపొందించి, అనీమియాను, రానివ్వవు. కీరాలోని సిలికా, సల్పర్, సోడియం,
పాస్ఫరస్, కాల్షియంలు, శిరోజాలు ఎదగటానికి, మెరవటానికి, ఉపయోగిస్తాయి. చర్మం సాగిపోకుండా, ఎండకు కంద
కుండా, మంచి రంగుతో నిత్య యవ్వనంగా ఉండేట్లు చేస్తాయి. శరీరంలో యూరిక్ యాసిడ్ పేరుకోవడం ద్వారా వచ్చే
కీళ్ళ జబ్బులకు, డయాబెటిస్ కు, కీరదోస మంచి ఆహారం. ఛాతీ, ఊపిరితిత్తులు, ఉదర వ్యాదుల వారికి, ఎగ్జిమా,
గౌట్, మలబద్ధకం వారికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. Tip: అనేక పోషకాలు, విటమిన్లు వీని తోలులోనే ఉంటాయి
కనుక వీనిని తోలు, గింజలుతొనే తినటం మంచిది.

5, జూన్ 2018, మంగళవారం

కరివేపాకు (Curry Leaf)


కరివేపాకు. Eng: Curry Leaf. Hindi: కరి పత్తా
కరివేపాకులోని ఫెనాల్స్, కార్బోజోల్ ఆల్కలాయిడ్స్ కలిసి లుకేమియా, ప్రోస్టేట్ కాన్సర్, పురీషనాళ కాన్సర్లను
నివారిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. వీనిలోని కార్బోజోల్ ఆల్కలాయిడ్స్ నీళ్ళవిరేచనాలను, ముఖ్యంగా
ఆముదము వలన కలిగే విరేచనాలను తగ్గిస్తాయి. మరియు రక్తపుగడ్డలు ఏర్పడకుండా చేస్తాయి. వీనిలోని A, B,
C, E, విటమిన్లు ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గించటంలోను, అంతర్గత అవయవాల మీద ఫ్రీరాడికల్స్ యొక్క దాడిని
నిరోదించటంలోను అమోఘంగా పనిచేస్తాయి. ఈ ఆకులలోని B6, A, C, విటమిన్లు శిరోజాల కుదుళ్ళను దృడంగా
చేస్తాయి. శిరోజాలు వత్తుగాను, పొడవుగాను, నల్లగాను, పెరిగేట్లు పోషణ చేస్తాయి. జుట్టు ఊడకుండా, చుండ్రు
రాకుండా, తెల్లబడకుండా రక్షిస్తాయి. వీనిలోని కెరోటినాయిడ్స్, విటమిన్ A, కంటిపాపను, కంటి పైపొరలను,
దృడపరిచి మెరయునట్లు గాను, కంటిచూపు దీర్ఘకాలం నిలిచేట్లుగాను చేస్తాయి. కరివేపాకులలో ఉన్న అనేక
కాంపౌండ్స్ కేమోతెరపి, రేడియోతెరపి వల్ల ఏర్పడే దుష్పలితాలను నివారిస్తాయి. అల్జీమర్ వ్యాధిని రానివ్వవు.
పురుగుల, పాముల విషలక్షణాలను తీసివేస్తాయి. ఈ ఆకులలోని Linolool అనే కాంపౌండ్, ఫ్రీరాడికల్స్ను,
బాక్టీరియాను, నాశనం చేస్తుంది. స్ట్రెస్ ను తగ్గించి, వ్యాకులతను, మానసిక కుంగుదలను పోగొడుతుంది. చెడు
కొలెస్టరాల్ ను, తగ్గించి మంచికొలెస్టరాల్ ను పెంచి, గుండెజబ్బులను నివారిస్తుంది. వీనిలోని మహానింబిసైడ్
అనే ఆల్కలాయిడ్ పుండ్లను, కోతలను, కురుపులను, కాలిన చిన్నగాయాలను సత్వరమే బాగుపరుస్తుంది.
ఇదే ఆల్కలాయిడ్ ఊబకాయాన్ని తగ్గిస్తుంది. కరివేపాకులో సమృద్ధిగా పోలిక్ యాసిడ్, ఇనుము ఉంటాయి.
ఫోలిక్ యాసిడ్ ఇనుమును వంటికి పట్టునట్లుచేసి రక్తహీనతను రానివ్వదు. కరివేపాకులోని కేమోపెరాల్,
C, A విటమిన్లు ముక్కు, గొంతు, ఛాతీలలో చేరిన మ్యూకస్ ను కరిగించి, బయటకు నేట్టివేస్తాయి. మరియు
కాలేయాన్ని ఎటువంటి వ్యాధుల బారినపడకుండా రక్షిస్థాయి. కరివేపాకులోని క్యాంఫెరాల్ అనే యాంటీ ఆక్సిడెంట్
అజీర్తిని పోగొట్టటమే కాక పొట్టలోని విషాలను, హానికర రసాయనాలను చక్కగా తొలగిస్తుంది. దీనిలోని పీచు
రక్తంలోని చెక్కర నిలవలను తగ్గిస్తుంది. వీనిలోని రసాయనాలు క్లోమంలోని ఇన్సులిన్ తయారుచేసే కణజాలాన్ని
ఉత్తేజపరిచి మధుమేహం రాకుండా చేస్తాయి.

4, జూన్ 2018, సోమవారం

మునగ ఆకు (Drumstick Leaves)


మునగ ఆకు. Eng : Moringa, Drumstick leaves. Hindi : సాహిజెన్ పత్తా
300 పైగా వ్యాదులలో మందుగా వాడబడే మునగాకుది ఆకు కూరలలో ఒక విశిష్టస్థానం. ఒకే పదార్ధంలో 90
శక్తివంతమైన పోషకాలు, లవణాల, ఉండటం చాలా అరుదు. అందువలననే ఇది సూపర్ పుడ్ గా అభివర్ణించ
బడుతుంది. మునగాకులోని క్లోరోజెనిక్ యాసిడ్ సమర్ధవంతంగా చెడుకొలెస్టరాల్ ను తగ్గించి, మంచికొలెస్టరాల్ ను
పెంచి, రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఆవిధంగా గుండెజబ్బులను రానివ్వదు. మునగాకులోని క్వెర్సిటిన్,
క్లోరోజెనిక్ యాసిడ్ అనే శక్తివంతమైన యాంటీఆక్షిడేంట్ లు, విటమిన్ C, బీటాకెరటీన్ లతో కలసి కాన్సర్
కారకాలైన కార్సినోజేన్స్ లను సంపూర్ణంగా నిరోధిస్తాయి. క్యారట్ లో కన్నా10 రెట్లు ఎక్కువగా మునగాకులో
ఉన్న A విటమిన్ గ్రుడ్డితనాన్ని, రేజీకటిని, రానివ్వకుండా చేసి, కంటిచూపును పెంచుతుంది. దీనిలోని బీటా
కెరటీన్ సూర్యకిరణాల నుండి చర్మాన్నిరక్షించి, వృద్ధాప్యలక్షణాలను కనపడకుండా చేస్తుంది. మునగాకులో C
విటమిన్ కమలాపండులో కంటే 7రెట్లు, A విటమిన్ క్యారట్ లో కంటే 10 రెట్లు, కాల్షియం పాలలో కంటే 17
రెట్లు, పొటాషియం అరటిపండులో కంటే 15 రెట్లు, ఇనుము పాలకూరలో కంటే 25 రెట్లు వుంటాయి.
దీనిలోని పైటోస్టెరాల్స్ అనే కాంపౌండ్స్, ఈస్త్రోజేన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచటం ద్వారా బాలింతలలో అధిక
పాల తయారీని ప్రేరేపిస్తుంది. దీనిలోని ఐరన్ ఎర్రకణాల తయారీని వృద్ధిచేసి, ఏనీమియా వ్యాధిని సమూలంగా
నివారిస్తుంది. ఈవ్యాధిలో ఐరన్ టాబ్లెట్స్ బదులు మునగఆకును వాడటం మంచిది. దీనిలోని లినోలెక్ యాసిడ్,
లినోలెనిక్ యాసిడ్, ఒలేయిక్ యాసిడ్లు కొలెస్టరాల్ ను అమోఘంగా కంట్రోల్ చేస్తాయి. దీనిలో ఉండే జింక్
వీర్యకణాల వృద్ధికి, DNA మరియు RNA సంయోగానికి ఉపయోగపడుతుంది. దీనిలోని A, E, B విటమిన్లు,
జింక్ తో కలిసి వెంట్రుకలు రాలటం, చిట్లటం, తెల్లబడటం, చుండ్రు పట్టటంలను నిరోధించి, శిరోజాలు వత్తుగా,
నల్లగా, పొడవుగా,మెరయునట్లుగా చేస్తాయి. Lysine అనే ఏమినోయాసిడ్ శరీరానికి కాల్షియంను గ్రహించే
శక్తిని ఇచ్చి, కొలాజేన్, హార్మోన్లు, ఎంజైమ్స్ తయారీకి సహకరిస్తుంది. Valine అనే ఏమినోయాసిడ్
చురుకైన బుద్ధికుచలతను, మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. Leucine అనే ఏమినోయాసిడ్ శారీరక
శక్తిని, జాకరూకతను పెంచే ఎంజైమ్స్, ప్రోటీన్లను తయారుచేస్తుంది. Threonine అనే ఏమినోయాసిడ్
జీర్ణకోశము, చిన్నప్రేవుల శోషణశక్తిని వృద్ధిచేసి, జీవక్రియ సవ్యంగా నడపటంద్వారా, కాలేయంలో క్రొవ్వును
పేరుకోనివ్వదు. Isoleucine అనే ఏమినోయాసిడ్ శరీరంలో ప్రోటీన్, బయోకెమికల్ కాంపౌండ్ల ఉత్పత్తి
చూస్తుంది. Trytohyan అనే ఏమినోయాసిడ్ వ్యాకులత, డిప్రెషన్, నిద్రలేమి, మైగ్రేన్ లను తొలగిస్తుంది.
కొలెస్టరాల్ ను నియంత్రించి గుండెలోను, ధమనులలోను ఈడ్పులు రాకుండా చూస్తుంది. Metheorine అనే
ఏమినోయాసిడ్ సల్ఫర్ ను వినియోగించి చర్మం, గోళ్ళు, శిరోజాలకు చెందిన అన్నిసమస్యలను దూరం చేస్తుంది.
లివర్ లో లేసితిన్ ఉత్పత్తిద్వారా, కొలెస్టరాల్ స్థాయులను తక్కువగా ఉండేట్లు చేస్తుంది. Phenylalaine
అనే ఏమినోయాసిడ్ మెదడు, నాడీకణాల మద్య సమాచారాన్ని చేరవేసే క్రియకు అవసరంఅయ్యే కెమికల్స్
తయారీని నిర్వహిస్తూ జ్ఞాపకశక్తిని వృద్ధి చేస్తుంది. మునగాకులోని కాల్షియం ఎముకలను దృడంగాను,
ఆరోగ్యంగాను, జీవవంతంగాను తీర్సిదిద్దుతుంది. మెదడును రక్షింఛి, జ్ఞాపకశక్తిని వృద్ధి చేస్తుంది. మునగ
ఆకులు కాలేయంలోను, రక్తంలోనూ చేరిన విషాలను తొలగిస్తాయి. మూత్రాశయంలో రాళ్ళను కరిగిస్తాయి.
థైరాయిడ్ ను, అల్సర్లను, కీల్లజబ్బులను తగ్గిస్తాయి. ఇవి ఎయిడ్స్ వ్యాదిగ్రస్తులకు చాలా మంచిది.
100 గ్రాముల మునగ ఆకులలో విటమిన్ E 448 mg. విటమిన్ C 220 mg. విటమిన్ B3 0.8 mg.
B1 విటమిన్ 0.06 mg. B2 విటమిన్ 0.05 mg. కాల్షియం 440 mg. పొటాషియం 259 mg.
ఫాస్ఫరస్ 70 mg. మెగ్నీషియం 42 mg. ఇనుము 0.85 mg. వుంటాయి. Tip: తాజా లేత ఆకులను
కూరగాను, పప్పుగాను, 70 గ్రాములు రోజుకు వాడటం మంచిది. పూలను ఎండించి టీ వలె కాసుకుని
త్రాగవచ్చు. ఆకులు నీడన ఎండించి పౌడరు రూపంలో వాడవచ్చు.

3, జూన్ 2018, ఆదివారం

రామములగ కాయ (Tomato)


రామములగ కాయ, తక్కాళిపండు.      ఆంగ్లం: టొమాటో ( Tomato).     హింది: టమాటర్
విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా కలిగిన కూరగాయగా దీనిని చెప్పుకోవచ్చు. దీనిలో విటమిన్లు A. K. B1. B3,
B5,B6, B9, B7, C మరియు మినరల్స్ పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, క్రోమియం, జింక్, ఫాస్ఫరస్,
సమృద్ధిగా వున్నాయి. దీనిలో అత్యంత సమృద్ధిగాఉండే లైకోపిన్ (Lycopene) అనే యాంటీఆక్షిడేంట్, కాన్సర్
కారకాలైన ప్రీ రాడికల్స్ ను సమూలంగా ప్రారదోలుతుంది. ఇది మానవులలో సంభవించే చాలా రకాల కాన్సర్ లను
నివారించే శక్తి కలది. రోజువారీ వినియోగం ఉన్నట్లయితే వీనిలోని లైకోపిన్ రక్తంలోని LDL, కొలెస్టరాల్, ట్రైగ్లిజరైడ్
లను, నియమిత స్థాయులలో నిలిపిఉంచి, గుండెజబ్బుల ప్రమాదం కనుచూపుమేరలో లేకుండా చేయగలదు. ఇదే
లైకోపిన్ పోలేట్ తో కలిసి అల్జీమర్ మరియు పార్కిన్సన్ వ్యాధులను నిరోధిస్తుంది. దీనిలోని కౌమారిక్ యాసిడ్
మరియు క్లోరోజేనిక్ యాసిడ్లు దూమపానం చేసేవారిలో లంగ్ కాన్సర్ కు కారణం అయ్యే కార్సినోజెన్స్లను నాశనం
చేస్తాయి. క్లోరోజెనిక్ యాసిడ్ అధిక రక్తపోటును తగ్గించడంలోకూడా ఉపయోగపడుతుంది. దీనిలో అధిక మోతాదులో
ఉన్నపొటాషియం గుండెజబ్బులను నిరోదించడమే కాకుండా, కండరాలు కృశించి పోకుండాను, ఎముకల సాంద్రత
తగ్గకుండాను, కిద్నీలలో రాళ్ళు ఏర్పడకుండాను, చూస్తుంది. పొటాషియం అధిక రక్తపోటును, మానసిక వత్తిడిని
తగ్గించి నరాల ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. లుటైన్, బీటాకెరటీన్, లైకోపిన్లు, వృద్ధాప్యంలో వచ్చే కేటరాక్టులు, మాక్యులర్
డీజనరేషన్ వ్యాదులు రాకుండా కండ్లను రక్షిస్తాయి. దీనిలో సమృద్ధిగా ఉన్న C విటమిన్, collagen తయారీని
సమృద్దిగా చెయ్యటం ద్వారా, చర్మం సాగిపోకుండాను, కురుపులు మచ్చలు రాకుండాను, ముడతలుపడకుండాను,
చేసి చర్మసౌందర్యాన్ని నిలిపి ఉంచుతుంది. శిరోజాలను, గోళ్ళను మెరియునట్లు చేస్తుంది. దీనిలోని A విటమిన్
రేజీకటిని నివారించటమే కాక కంటిచూపును పెంచుతుంది మరియు శిరోజాలను, ఎముకలను, దృడంగా మెరయు
నట్లు చేస్తుంది. దీనిలోని రిబోప్లావిన్ తరచుగా వచ్చే తలనొప్పిని రాకుండా చేస్తుంది. దీనిలోని K విటమిన్
ప్రమాదాలలో రక్తం గద్దకట్టునట్లు చెయ్యటమే కాక ఎముకలను వృద్ధిచేస్తుంది. దీనిలోని పోలేట్ (B9)శరీరకణజాలం
అభివృద్ధికి, కార్యనిర్వహణకు, దోహదపడుతుంది. గర్భిణీలలో వచ్చే న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్ రాకుండా చూస్తుంది.
దీనిలోని ఇనుము రక్తప్రసరణ శరీరమంతట చక్కగా జరిగేట్లు చేస్తుంది.  ఒక వారంలో పది టొమాటోలు పచ్చిగా గాని,సూప్ లేదా రసంలాగాని తీసుకున్న మహిళల్లో గుండె జబ్బుల ప్రమాదం 32 శాతం తగ్గినట్లు ఓ పరిశోధన. కాన్సర్ప్రమాదాన్ని 11 శాతం తగ్గిస్తుంది. జిడ్డు చర్మతత్వం ఉన్నవారికి టమాటో మంచి మందు. టమాటో రసం మర్ధనతోవదులైన చర్మం బిగుతు అవుతుంది. NB: కిడ్నీలలో రాళ్ళు ఉన్నవారు టొమాటోలను గింజలు తీసివేసి తినాలి.గుండెజబ్బులు, కడుపులో మంట కలవారు మితంగా తినాలి.

2, జూన్ 2018, శనివారం

సోయాచిక్కుడు (Soyabean)


సోయా చిక్కుడు.
వృక్ష సంబంధ ప్రోటీన్ లభించే ఆహారపదార్ధాలలో సోయాబీన్ ప్రధమంలో ఉంటుంది. దీని కారణంగానే సోయాబీన్
మటన్ కు ప్రత్యామ్నాయంగా చెప్పబడుతూవుంది. ఈ సోయా ప్రోటీన్ గుండెజబ్బులను నివారించటంలో అందెవేసిన
చెయ్యి. మనం తినగలిగిన ఆహారపదార్ధాలలో ఐసోఫ్లావిన్స్ (Isoflavones) కలిగివున్న ఏకైక పదార్ధం సోయాబీన్.
Genistein, diadzein, glycitein అనే మూడు పైటోఈస్ట్రోజేన్ల కలగలుపు ఇది. Isoflavones కాన్సర్
లను, కొలెస్టరాల్, ఆస్టియోపొరోసిస్, మెనోఫాజ్ బాధలను, సమర్ధవంతంగా తగ్గిస్తుంది. దీనిలోని ఒమేగా-3 మరియు
ఒమేగా-6 ఫ్యాటీయాసిడ్స్ రక్తనాళాల గోడలను దృడంగాను, ప్లెగ్జిబుల్ గాను, ఉంచి రక్తపుగడ్డలు, రక్తస్రావాలు ఏర్పడ
కుండా చేసి గుండెజబ్బుల నుండి పూర్తిగా రక్షిస్తుంది. సోయాబీన్ పాలు నరాల సత్తువకు, కండరాల బలానికి అద్భుత
మైన టానిక్ లా పనిచేస్తుంది. కండరాల దిజార్దర్ను పోగొడుతుంది. మానసికంగా ఉద్రేకపడేవారికి, డిప్రెషన్ కు గురయ్యే
వారికి, మతిమరుపు వచ్చిన వారికి, సోయాలోని లెసితిన్ అద్భుతంగా పనిచేస్తుంది. దీనిలోని పైటోఈస్త్రోజేన్స్, విటమిన్
E వయోబారం వలన వచ్చే ముడతలు, నల్లమచ్చలు, కాంతి విహీనతలను నివారించి యవ్వనాన్ని నిలిపి ఉంచుతాయి.
దీనిలోని ఐరన్, జింక్ లు రక్తనాళాలను పెద్దవిగాచేసి అన్ని అవయవాలకు రక్తప్రసరణ ధారాళంగా జరిగేట్లు చూస్తాయి.
వినికిడి శక్తిని పెంచుతాయి. దీనిలో సమృద్ధిగాఉన్న పోలేట్ సెరిటోనిన్ తయారీని అధికంచేసి డిప్రెషన్ ను తొలగించి,
చలాకితనాన్నివృద్ధి చేస్తుంది. దీనిలో సమృద్ధిగా వున్న పొటాషియం BP నియంత్రణలో బాగా పనిచేస్తుంది
ఆరోగ్యవంతమైన శిరోజాల కుదుళ్ళకు వీనిలోని లైసీన్ ఆమ్లం ఉపకరిస్తుంది దీనిలోని పైటిక్ యాసిడ్ అనే యాంటీ
ఆక్షిడెంట్ కాన్సర్, గడ్డలు,మధుమేహం రాకుండా చూస్తుంది. దీనిలోని ఫైబర్ పొట్ట ఉబ్బరింపును, మలబద్ధకాన్ని
పోగొట్టటంలో సాటిలేనిది. దీనిలో 8 రకాల ఏమినోయాసిడ్స్, విటమిన్ B1, ప్రోటీన్, ఫాట్, కాల్షియం, ఫోలేట్,
విటమిన్ C చాలా ఎక్కువగా ఉంటాయి. NB: సోయాబీన్ పచ్చిగా వాడేప్పుడు అజీర్తిని కలిగిస్తుంది, కనుక
మితంగా వాడాలి. వేడిచేసి గింజల పై పొట్టును తీసివేసి వాడాలి. పిండిని రోజుకు 25 గ్రాములు మించకుండా వాడవచ్చు.