పేజీలు

25, జులై 2018, బుధవారం

ధనియాలు


ధనియాలు:         ఆంగ్లం:   Coriander seeds          హిందీ:  Dhania
గుండెజబ్బులు:  ధనియాలు చెడ్డ కొలెస్టరాల్ (LDL)ను తగ్గించి, మంచి  కొలెస్టరాల్ (HDL)ను పెంచుతుంది.  దీనిలోని ఒలేయిక్ యాసిడ్, లినోలిక్ యాసిడ్, యాస్కార్బిక్ యాసిడ్, స్టీరిక్ యాసిడ్ లు, చెడ్డ కొలెస్టరాల్ ను తగ్గించటంలో అత్యంత శక్తివంతమైనవి.  గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. 
మధుమేహం:  ధనియాలు క్లోమగ్రందులను ఉత్తేజితం చెయ్యటం ద్వారా ఇన్సులిన్ స్రావాన్ని వృద్దిచేసి, తద్వారా రక్తంలోని చక్కెర నిల్వలను నియంత్రిస్థాయి.  
ఎముకలు,కీళ్ళు:   A, C, K, విటమిన్లు, రిబోఫ్లావిన్, నైసిన్, పోలిక్ యాసిడ్, కాల్షియం, లాంటి యాంటీ ఆక్షిడేంట్లు ఎముకలు పెళుసుబారకుండా దృడంగా ఉండేట్లుగా చేస్తాయి. కీళ్ళను ఆరోగ్యంగా ఉంచుతాయి.  దీనిలోని Linoleic acid, Cineole అనే  యాంటీ ఆక్షిడేంట్లు కీళ్ళవాతంలోని వాపులు, మంటలను సంపూర్తిగ తగ్గిస్తాయి.                                                
జీర్ణాశయ వ్యాదులు:  వీనిలో సమృద్దిగా ఉన్న Borneol, Linalool, జీర్ణక్రియను వృద్దిచేస్తాయి. నీళ్ళ విరేచనాలను నిరోదిస్తాయి. వీనిలోని Cineol, Alpha-Pinene, Limonene లాంటి కాంపౌండ్స్, జీర్ణవాహిక, జీర్ణాశయముల ఆరోగ్యాన్ని చక్కగా రక్షిస్తాయి. Dodecanal అనే కాంపౌండ్  కలుషిత నీరు, ఆహారం ద్వారా వచ్చే అన్నివ్యాదులను ప్రారదోలగలిగిన శక్తిగలిగినవి. కడుపు ఉబ్బరాన్ని, కడుపులో గ్యాస్ ను తొలగిస్తాయి.  తలత్రిప్పు, వికారం, వాంతులను కూడా సమర్దవంతంగా తగ్గిస్తాయి.
కండ్ల ఆరోగ్యం:  వీనిలోని యాంటీ ఆక్షిడేంట్లు కండ్ల పుసులు, కండ్లు అంటుకోవటం, కండ్లు ఎర్రబారటం, కండ్ల కలకలు, రాకుండాచేసి, కండ్లు ఆరోగ్యంగా ఉండేట్లు చేస్తాయి. కంటిచూపును పెంచుతాయి.
చర్మ సౌందర్యం:  మొటిమలు, బ్లాక్ హెడ్స్ రాకుండా చేస్తుంది. వచ్చినవాటిని మలినాలను బయటకునెట్టి త్వరగా మాన్పుతుంది. చర్మం పొడిబారకుండాను, మెరుపు తగ్గకుండాను, ఉంచుతుంది. ఎగ్జిమ, దురదలు, మంటలు, త్వరగా తగ్గునట్లు చేస్తుంది. స్పోటకం లో వచ్చే దురదలు, మంటలను చక్కగా తగ్గిస్తుంది. కొలాజేన్ ను వృద్దిచేసి చర్మం యొక్క సాగే గుణాన్ని నిలిపిఉంచి, చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది.
Anemia:  వీనిలో సమృద్దిగా ఉన్న ఇనుము, హిమోగ్లోబిన్ ను, కొత్త రక్తకణాలను వృద్దిచేసి రక్తహీనత రాకుండా చేస్తాయి. అధిక ఋతు స్రావాన్ని కలగకుండా నిరోదిస్తాయి. ఋతు సమయంలో వచ్చే కడుపునొప్పిని తగ్గిస్తాయి. సమస్త శరీరకణాలలో శక్తిని పెంచుతాయి.
వ్యాధి నిరోధకం:  నోటిలోని పుండ్లను, ఫంగస్ ను, తగ్గిస్తాయి. గొంతు వాపును, మంటను నివారిస్తాయి.  థైరాయిడ్ ను, థైరాయిడ్ లో వచ్చే బాధలను తగ్గిస్తాయి.  శిరోజాల కుదుళ్ళను బలపరిచి, వెంట్రుకలు రాలిపోవటాన్ని నివారిస్తాయి. కాలేయం ఆరోగ్యాన్ని సరిచేసి, మంచి ఆకలిని పుట్టిస్తాయి. శరీరకణాలలోకి, మెదడులోకి చేరిన విషాలను సమర్దవంతముగా బయటికి నెట్టివేస్తాయి.  వీనిలోని Linolool  యాంగ్జైటీ ని సత్వరమే తగ్గిస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. మూత్రనాళవ్యాదులలో మంటలను ఇవి తగ్గిస్తాయి.  కాన్సర్ వ్యాధిలో వచ్చే బాధలను చక్కగా తగ్గిస్తాయి.
ధనియాలలో పొటాషియం, ఇనుము, మాంగనీస్, కాల్షియం, జెరానియల్, విటమిన్లు A, B, C, K లు, కరిగే పీచు, సమృద్దిగా వుంటాయి. Tip: ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ ధనియాలను ముందురోజు రాత్రి నానబెట్టి ఉదయాన్ని వడకట్టి త్రాగవచ్చు.  ఒక స్పూన్ ధనియాలను ఒక గ్లాస్ నీటిలో టీ లాగ కాచి త్రాగవచ్చు.

దాల్చినచెక్క, (Chinnamon)


దాల్చినచెక్క:           ఆంగ్లం:   Cinnamon             హిందీ:  Dhalchini
1.       దాల్సినచెక్క 41 రకాల యాంటీ ఆక్షిడెంట్లు కలిగిన సుగంద ద్రవ్యంగా పేరెన్నికగన్నది.  యాంటీ ఆక్షిడెంట్ల క్రియాశీలతను సరిపోల్చగా 26 సుగంద ద్రవ్యాలలో  దాల్చినచెక్క ప్రదమ స్థానంలో ఉంది. దీనిలోని యాంటీ ఆక్షిడేంట్లు;  ప్రీ రాడికల్స్ మరియు ఆక్షిడేటివ్ స్ట్రెస్ల వలన శరీరంలో సంభవించగల ఎన్నో వ్యాదులను సునాయాసంగా నిరోధిస్తాయి.
2.       తాప నిరోధకశక్తి కలిగిన 7రకాల ప్లవనాయిడ్లు కలిగిన దాల్చినచెక్క గుండెజబ్బులను, కాన్సర్ ను, అల్జీమర్ వ్యాదులను నివారించడంలో అమోఘమైన శక్తి కలది. మరియు కీళ్ళజబ్బులలో, ఋతు సమయపు నొప్పులలో, ఎలార్జీల నొప్పులలో బాగా ఉపయోగపడుతుంది.
3.       దాల్చినచెక్కను  గుండెకు మంచి మిత్రునిగా చెప్పవచ్చు.  ఇది  అధికంగా ఉన్న చెడ్డ కొలెస్టరాల్(LDL)ను, అధికంగా ఉన్న ట్రై గ్లిజరైడ్ ను, అధిక రక్తపోటును తగ్గించటమే కాక, మంచి కొలెస్టరాల్(HDL) స్థాయులను నిలిపి ఉంచుతుంది.  రక్త స్రావాలు జరిగే సమయాలలో  సత్వరమే రక్తం గడ్డకట్టేట్లు చేస్తుంది. రక్తప్రసరణ సక్రమంగా అన్ని కణాలకు జరుగునట్లు చేసి, కణాల పునర్ నిర్మాణశక్తిని పెంచుతుంది.  గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
4.       దాల్చినచెక్క రక్తంలోని చక్కెరస్థాయులను నియమించటమే కాక, ఇన్సులిన్ హార్మోన్ స్రావాన్ని ఉత్తేజపరుస్తుంది. అంతేకాక రక్తంలోకి గ్లూకోజ్ ను అనుమతించే ఎంజైములను కట్టడిచేసి, మధుమేహంలో ఎంతో మేలు చేస్తుంది.
5.        అల్జీమర్, పార్కిన్సన్ వ్యాదులు తగ్గించటంలో దీనిలోని యాంటీ ఆక్సిడెంట్ లు పనిచెయ్యటమే కాక మెదడుయొక్క కణజాలాన్ని శక్తివంతం చేస్తుంది. యంగ్జైటీ, డిప్రెషన్ లను తగ్గిస్తుంది. దాల్చినచెక్క వాసన మరియు దానిలోని పొటాషియం మెదడు యొక్క కేంద్రీకరణ శక్తిని, ఆలోచనాశక్తిని వృద్ది చేస్తాయి.
6.       దీనిలోని Cinnamaldehyde అనే యాంటీ ఆక్షిడెంట్ కాన్సర్ కణాల అభివృద్దిని నిరోదించటమే కాక, ఆ కణాలు స్వయంగా ఆత్మాహుతి చేసుకునేలా వత్తిడి చేస్తుంది.  DNA లకు ఎటువంటి నష్టం కలుగకుండా చూస్తుంది.
7.       ఇది నోటిదుర్వాసనను, దంతవ్యాదులను, పిప్పిపళ్ళను, నోటికురుపులను నివారిస్తుంది. గొంతులోను, జీర్ణవాహికలోను పెరిగే  ఈస్ట్ ఎదుగుదలను నివారిస్తుంది. జీర్ణక్రియను వృద్దిచేసి, కడుపు ఉబ్బరాన్ని తొలగిస్తుంది. ప్రయాణంలో వచ్చే వికారాన్ని, వాంతులను తగ్గిస్తుంది. ఎక్కువగా వ్యాయామం చెయ్యటం వలన వచ్చిన వాపులను, నొప్పులను తగ్గిస్తుంది.
8.       దీనిలోని మెగ్నీషియం, కాల్షియం  ఎముకల దృడత్వాన్ని పెంచుతాయి
NB: లివరువ్యాదులు ఉన్నవారు, గర్భిణీలు  వాడరాదు.   మోతాదు రోజుకు పావు నుండి ఒక టీ స్పూన్ వాడుకోవచ్చు.  నెలమించి వాడకుండా ఉండటం మంచిది.

13, జులై 2018, శుక్రవారం

Health Tips - 1

                గర్భవతుల వాంతులు, వికారం  
> ఉదయాన్నే చిన్న అల్లం ముక్కను నమిలి మింగినా, ఒక కప్పు నీటిలో అల్లం ముక్క వేసి టీలా కాచి వేడిగా త్రాగినా
   వాంతులు నెమ్మదిస్తాయి.
> పది చుక్కలు నిమ్మరసం, అర స్పూన్ పంచదార, ఒక కప్పు నీటిలో కలపాలి. పావు స్పూన్ బేకింగ్ సోడా కలిపి
వెంటనే త్రాగితే వాంతులు,వికారం పోతాయి.
> రెండు యాలకి కాయలను నమిలి రసం మింగుతూ ఉంటే వికారం, వాంతులుతగ్గిపోతాయి. 
> రాత్రిపూట ఎండు ఖర్జూరాలను నీటిలో నానబెట్టి  మరుచటి రోజు  ఉదయాన్నే ఆ నీటిని త్రాగితే వేవిళ్ళు తగ్గుతాయి.
> ఉదయాన్నే మాదీఫలరసాయనం రెండు స్పూన్లు, నీళ్ళు కలిపి త్రాగితే వేవిళ్ళు పూర్తిగా తగ్గుతాయి.
                      బాలింతల క్షీరవృద్ధికి
> తమ ఆహారంలో క్యాబేజీని తరఛుగా తీసుకుంటే పాలిచ్చే తల్లులకు క్షీర వృద్ధి కలుగుతుంది.
> వామును కషాయం కాచి, రోజుకొకసారి  ఒక ఔన్స్ మోతాదు త్రాగితే చనుబాలు పెరుగుతాయి.  
> లవంగ చూర్ణంలో కొద్దిగా ఇంగువ పొడి కలిపి రెండు పూటలు తీసుకుంటే పాలు వృద్ధి అవుతాయి.
> బార్లీ గింజలు 5 గ్రాములు, పావు లీటరు పాలలో మెత్తగా ఉడికించి పంచదార చేర్చి త్రాగిన క్షీరవృద్ది.
> దోరగా ఉన్న బొప్పాయి కాయను కూర వండుకుని తింటే చనుబాలు వృద్ది అవుతాయి.
                     రక్తలేమి 
> ప్రతిరోజు రెండు పూటలా తేనె ఒక స్పూన్ తీసుకుంటే రక్తం వృద్ధి అవుతుంది.
> ప్రతిరోజు రెండు పూటలా పొదిన ఆకుల రసం మూడు స్పూన్లు తీసుకుంటే రక్తం వృద్ధి అవుతుంది.
> మునగాను తరచుగా వాడితే చక్కని రక్తం పడుతుంది. యవ్వనవంతులుగా ఉంచుతుంది.(గర్భిణీలు వాడరాదు)
> పాలకూరను ఆహారంగా తరచు వాడితే హిమోగ్లోబిన్, రక్తము వృద్ది చెందుతాయి.
                     కడుపు ఉబ్బరం, మంట  
> ఒక గ్లాస్ వేడినీటిలో ఒక నిమ్మకాయ రసం, చిటికెడు ఉప్పు వేసి, కలిపి త్రాగితే ఉబ్బరం తగ్గిపోతుంది.
> ఒక గ్లాస్ మజ్జిగలో ఒక స్పూన్ ధనియాలపొడి కలిపి త్రాగితే కడుపులో మంట తగ్గుతుంది.
> ఒక చిన్న అల్లం ముక్కను నమిలి రసం మింగిన కడుపులో మంట తగ్గుతుంది.
> చల్లటి పాలు ఒక గ్లాస్ తాగితే కడుపులో మంట, ఎసిడిటీ తగ్గిపోతాయి.
> ధనియాలు 1పాలు, గసాలు 1పాలు, పంచదార 2పాళ్ళు, కలిపి చూర్ణం చేసుకోవాలి.  ఈ చూర్ణం రెండు పూటలా
ఒక గ్లాస్ వేడినీటిలో కలిపి త్రాగితే, తలనొప్పి,తలతిరగటం పోతాయి.
> చిన్న అల్లము ముక్కను ఉప్పులో అద్ది, ప్రతిరోజు పరగడుపున తింటుంటే తలతిప్పు వ్యాధి తగ్గిపోతుంది.
> ఒక చిటికెడు కరివేపాకు చూర్ణం తేనెతో కలిపి పరగడుపున  తీసుకుంటే పైత్య సంబందమైన
 వికారం,  తలతిప్పు తగ్గుతాయి.
> టొమాటో, బీట్ రూట్, క్యారట్, ఆరెంజ్, జ్యూసులు సమంగా కలిపి ఒక ఔన్స్ మోతాదు ప్రతిరోజు ఉదయం
తీసుకుంటే మీ శరీరఛాయ పెరుగుతుంది. 
> ప్రతిరోజూ అర స్పూన్ మెంతులపోడిని తీసుకుంటే, ప్రసవానంతరం గర్భాశయాన్ని యదాస్థితికి తెస్తుంది.
పొట్టను తగ్గిస్తుంది.
> చిన్న ఇంగువ ముక్కను రోజూ తీసుకున్న గర్భాశయాన్ని, పొట్టను పూర్వస్థితికితెస్తుంది.
> జీలకర్రను నేతిలో వేయించి తగినంత ఉప్పు కలిపి రెండుపూటలా అన్నము  లేదా మజ్జిగతో చిటికెడు తింటే
 జీర్ణాశయ రోగాలు రావు. 
> వాము కషాయాన్ని తేనెతో రోజూ బాలింతలకు ఇస్తే గర్భాశయం కృశించుకుంటుంది. పాలు బాగా పడతాయి.
> స్నానానికి అరగంట ముందు, పసుపు కలిపిన కొబ్బరినూనె రాసినట్లయితే, చీరె కట్టిన చోట నల్లమచ్చలు పోతాయి.
> నీరుల్లిపాయను, క్యారట్ ను, గుండ్రంగా తరిగి, రోజూ తింటుంటే మీ స్వరం మధురంగా మారుతుంది.
> ఒక స్పూన్ వేప ఆకులపొడిని నీటిలో వేసుకుని స్నానం చేస్తే శరీరం నుండి దుర్గంధం రానివ్వదు.  చెమటను,
 చమటపొక్కులను, రానివ్వదు. 
> నీళ్ళ విరేచనాలు అవుతున్నప్పుడు, గసగసాలు, పంచదార ఒక్కొక్క స్పూన్ కలిపి మూడుపూటలు తింటే
కట్టుకుంటాయి.
> బెల్లం, జీలకర్ర సమంగా కలిపి నూరి, బటాణీగింజలంత గోలీలు చేసి మూడుపూటలా చప్పరిస్తే ఆకలిలేమి తగ్గుతుంది.
> కొతిమెర ఆకులతో టీ కాచి త్రాగినా, చెట్నీగా చేసుకుని తిన్నా, కండరాలు ముణగాలాగుకపొయ్యే వ్యాది
 (Cramps) నివారణ అవుతుంది. 
> Sore Throat: చిటికెడు ఉప్పు, రెండు చిటికెలు పసుపు వేసి కాచిన నీటితో రెండు పూటలా పుక్కిలించి ఉయ్యాలి.
> ఒక కప్పు పాలలో పావు స్పూన్ పసుపు వేసి కాచి, వేడిగా త్రాగితే గొంతువాపు తగ్గుతుంది.
> 5ml. తేనెను ఒక కప్పు వేడి నీటిలో కలిపి మూడు పూటలా త్రాగుతుంటే గొంతు వాపు, నొప్పి తగ్గుతాయి.
> ప్రతిరోజు ఉదయం దాల్చిన చెక్కను 3గ్రాముల మోతాదులో నమిలి తినుచుండిన మతిమరుపు తొలగిపోవును.
> మూడు పూటలు ఒక గ్లాస్ మజ్జిగ చొప్పున  త్రాగుచుండిన రక్త విరేచనాలు తగ్గిపోవును.
> అరికాళ్ళ మంటలు, తిమ్ముర్లు, నొప్పులు: నువ్వులనూనెను అరికాళ్ళకు బాగా మర్ధనచేస్తే తగ్గుతాయి.
> అల్లంరసంలో తేనె కలుపుకుని ఒక స్పూన్ మోతాదు త్రాగుతుంటే జలుబు, దగ్గు, కళ్ళేపడటం తగ్గుతాయి.

10, జులై 2018, మంగళవారం

వేదకాలంలో కాలగణన

                 హిందూ కాలగణన
కనురెప్ప వేటు కాలం  ఒక తృటి
100 తృటిలు  ఒక తత్పర
30 తత్పరలు ఒక నిమేష  
30 నిమేషలు  ఒక కాష్ఠ
30 కాష్టలు  ఒక కల 
30 కలలు  ఒక ముహూర్తం 
3 0 ముహూర్తములు  ఒక అహోరాత్రము 
15 అహోరాత్రములు  ఒక పక్షము 
2  పక్షములు   ఒక మాసము 
2 మాసాలు  ఒక ఋతువు
3 ఋతువులు ఒక ఆయనం 
2 ఆయనములు  ఒక సంవత్సరం 
360 సంవత్సరాలు  ఒక దేవ అహోరాత్రం 
360 దేవ అహోరాత్రాలు  ఒక దేవ సంవత్సరం 
12000 దేవ వత్సరాలు  ఒక చతుర్యుగం 
71 చతుర్యుగములు  ఒక మన్వంతరం 
14మన్వంతరాలు ఒక కల్పం 
2 కల్పములు  ఒక బ్రహ్మరాత్రం 
360 బ్రహ్మరాత్రములు  ఒక బ్రహ్మసంవత్సరం 
                  బృహత్ సంఖ్యలు 
ఏకము  1
దశకము  1 + 1 సున్నా 
శతము 1 + 2 సున్నాలు 
సహస్రము  1 + 3 సున్నాలు 
దశ సహస్రము  1 + 4 సున్నాలు 
లక్ష  1 + 5 సున్నాలు 
నియతము  1 + 6 సున్నాలు 
కోటి  1 + 7 సున్నాలు 
అర్బుదము  1 + 8 సున్నాలు 
వృందము 1 + 9 సున్నాలు 
ఖర్యము  1 + 10 సున్నాలు 
నిఖర్యము  1 + 11 సున్నాలు 
శంఖము  1 + 12 సున్నాలు 
పద్మము  1 + 13 సున్నాలు 
సాగరము  1 + 14 సున్నాలు 
అంత్యము  1 + 15 సున్నాలు 
మద్యము  1 + 16 సున్నాలు 
పరార్ద్యము  1 + 17 సున్నాలు