పేజీలు

4, జూన్ 2018, సోమవారం

మునగ ఆకు (Drumstick Leaves)


మునగ ఆకు. Eng : Moringa, Drumstick leaves. Hindi : సాహిజెన్ పత్తా
300 పైగా వ్యాదులలో మందుగా వాడబడే మునగాకుది ఆకు కూరలలో ఒక విశిష్టస్థానం. ఒకే పదార్ధంలో 90
శక్తివంతమైన పోషకాలు, లవణాల, ఉండటం చాలా అరుదు. అందువలననే ఇది సూపర్ పుడ్ గా అభివర్ణించ
బడుతుంది. మునగాకులోని క్లోరోజెనిక్ యాసిడ్ సమర్ధవంతంగా చెడుకొలెస్టరాల్ ను తగ్గించి, మంచికొలెస్టరాల్ ను
పెంచి, రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఆవిధంగా గుండెజబ్బులను రానివ్వదు. మునగాకులోని క్వెర్సిటిన్,
క్లోరోజెనిక్ యాసిడ్ అనే శక్తివంతమైన యాంటీఆక్షిడేంట్ లు, విటమిన్ C, బీటాకెరటీన్ లతో కలసి కాన్సర్
కారకాలైన కార్సినోజేన్స్ లను సంపూర్ణంగా నిరోధిస్తాయి. క్యారట్ లో కన్నా10 రెట్లు ఎక్కువగా మునగాకులో
ఉన్న A విటమిన్ గ్రుడ్డితనాన్ని, రేజీకటిని, రానివ్వకుండా చేసి, కంటిచూపును పెంచుతుంది. దీనిలోని బీటా
కెరటీన్ సూర్యకిరణాల నుండి చర్మాన్నిరక్షించి, వృద్ధాప్యలక్షణాలను కనపడకుండా చేస్తుంది. మునగాకులో C
విటమిన్ కమలాపండులో కంటే 7రెట్లు, A విటమిన్ క్యారట్ లో కంటే 10 రెట్లు, కాల్షియం పాలలో కంటే 17
రెట్లు, పొటాషియం అరటిపండులో కంటే 15 రెట్లు, ఇనుము పాలకూరలో కంటే 25 రెట్లు వుంటాయి.
దీనిలోని పైటోస్టెరాల్స్ అనే కాంపౌండ్స్, ఈస్త్రోజేన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచటం ద్వారా బాలింతలలో అధిక
పాల తయారీని ప్రేరేపిస్తుంది. దీనిలోని ఐరన్ ఎర్రకణాల తయారీని వృద్ధిచేసి, ఏనీమియా వ్యాధిని సమూలంగా
నివారిస్తుంది. ఈవ్యాధిలో ఐరన్ టాబ్లెట్స్ బదులు మునగఆకును వాడటం మంచిది. దీనిలోని లినోలెక్ యాసిడ్,
లినోలెనిక్ యాసిడ్, ఒలేయిక్ యాసిడ్లు కొలెస్టరాల్ ను అమోఘంగా కంట్రోల్ చేస్తాయి. దీనిలో ఉండే జింక్
వీర్యకణాల వృద్ధికి, DNA మరియు RNA సంయోగానికి ఉపయోగపడుతుంది. దీనిలోని A, E, B విటమిన్లు,
జింక్ తో కలిసి వెంట్రుకలు రాలటం, చిట్లటం, తెల్లబడటం, చుండ్రు పట్టటంలను నిరోధించి, శిరోజాలు వత్తుగా,
నల్లగా, పొడవుగా,మెరయునట్లుగా చేస్తాయి. Lysine అనే ఏమినోయాసిడ్ శరీరానికి కాల్షియంను గ్రహించే
శక్తిని ఇచ్చి, కొలాజేన్, హార్మోన్లు, ఎంజైమ్స్ తయారీకి సహకరిస్తుంది. Valine అనే ఏమినోయాసిడ్
చురుకైన బుద్ధికుచలతను, మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. Leucine అనే ఏమినోయాసిడ్ శారీరక
శక్తిని, జాకరూకతను పెంచే ఎంజైమ్స్, ప్రోటీన్లను తయారుచేస్తుంది. Threonine అనే ఏమినోయాసిడ్
జీర్ణకోశము, చిన్నప్రేవుల శోషణశక్తిని వృద్ధిచేసి, జీవక్రియ సవ్యంగా నడపటంద్వారా, కాలేయంలో క్రొవ్వును
పేరుకోనివ్వదు. Isoleucine అనే ఏమినోయాసిడ్ శరీరంలో ప్రోటీన్, బయోకెమికల్ కాంపౌండ్ల ఉత్పత్తి
చూస్తుంది. Trytohyan అనే ఏమినోయాసిడ్ వ్యాకులత, డిప్రెషన్, నిద్రలేమి, మైగ్రేన్ లను తొలగిస్తుంది.
కొలెస్టరాల్ ను నియంత్రించి గుండెలోను, ధమనులలోను ఈడ్పులు రాకుండా చూస్తుంది. Metheorine అనే
ఏమినోయాసిడ్ సల్ఫర్ ను వినియోగించి చర్మం, గోళ్ళు, శిరోజాలకు చెందిన అన్నిసమస్యలను దూరం చేస్తుంది.
లివర్ లో లేసితిన్ ఉత్పత్తిద్వారా, కొలెస్టరాల్ స్థాయులను తక్కువగా ఉండేట్లు చేస్తుంది. Phenylalaine
అనే ఏమినోయాసిడ్ మెదడు, నాడీకణాల మద్య సమాచారాన్ని చేరవేసే క్రియకు అవసరంఅయ్యే కెమికల్స్
తయారీని నిర్వహిస్తూ జ్ఞాపకశక్తిని వృద్ధి చేస్తుంది. మునగాకులోని కాల్షియం ఎముకలను దృడంగాను,
ఆరోగ్యంగాను, జీవవంతంగాను తీర్సిదిద్దుతుంది. మెదడును రక్షింఛి, జ్ఞాపకశక్తిని వృద్ధి చేస్తుంది. మునగ
ఆకులు కాలేయంలోను, రక్తంలోనూ చేరిన విషాలను తొలగిస్తాయి. మూత్రాశయంలో రాళ్ళను కరిగిస్తాయి.
థైరాయిడ్ ను, అల్సర్లను, కీల్లజబ్బులను తగ్గిస్తాయి. ఇవి ఎయిడ్స్ వ్యాదిగ్రస్తులకు చాలా మంచిది.
100 గ్రాముల మునగ ఆకులలో విటమిన్ E 448 mg. విటమిన్ C 220 mg. విటమిన్ B3 0.8 mg.
B1 విటమిన్ 0.06 mg. B2 విటమిన్ 0.05 mg. కాల్షియం 440 mg. పొటాషియం 259 mg.
ఫాస్ఫరస్ 70 mg. మెగ్నీషియం 42 mg. ఇనుము 0.85 mg. వుంటాయి. Tip: తాజా లేత ఆకులను
కూరగాను, పప్పుగాను, 70 గ్రాములు రోజుకు వాడటం మంచిది. పూలను ఎండించి టీ వలె కాసుకుని
త్రాగవచ్చు. ఆకులు నీడన ఎండించి పౌడరు రూపంలో వాడవచ్చు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి