పేజీలు

9, ఆగస్టు 2019, శుక్రవారం

లవంగము


లవంగం:                                    ఆంగ్లం:   Cloves                హిందీ:  Lavang    *
26 సుగంధద్రవ్యాలలో  అధిక మొత్తంలో ఫినోలిక్ యాసిడ్స్ కలిగిఉండి, అమితమైన  యాంటీ ఆక్షిడేంట్ ధర్మాలను ప్రదర్శించటంలో లవంగం ప్రధమ స్థానంలో ఉంది.  ఈ ఫినోలిక్ యాసిడ్స్ రక్తంలోని పోషకాలను శరీరకణాలకు చేరవేయటంలోను, కణాలలో శక్తిని ఉద్భవింపచేయటంలోనూ, ప్రముఖ పాత్ర పోషిస్తాయి.  లవంగాలలో సమృద్ధిగా ఉన్న మాంగనీసు మెదడు యొక్క పనితీరును వృద్ధి చేయటంలోనూ,  మరియు ఎముకల ద్రవ్యరాశి సాంద్రతను,  ధృడత్వాన్ని పెంచటంలోను ఉపయోగపడుతుంది.   అధిక మొత్తంలో ఉన్న పీచు పదార్ధం మలబద్దకాన్ని నివారిస్తుంది.  లవంగాలలో యూజినాల్ అనే అత్యంత శక్తివంతమైన  యాంటీ ఆక్షిడేంట్, C విటమిన్ తో కలిసి    ప్రీ రాడికల్స్ వలన కలిగే  oxidative stress  ను, సమర్ధవంతంగా నివారిస్తుంది.  యూజినాల్ క్యాన్సర్ కణుతులను, అనేక రకాల క్యాన్సరులను తగ్గించటంలోను, శరీరంలో కాన్సర్ కణాలను నాశనం చేయటంలోను బాగా పనిచేస్తుంది.  యూజినాల్  వాపు, మంట, గట్టిపడుట లాంటి కాలేయ వ్యాదులను నిరోధించి, కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచటమే కాక,  పెద్ద ప్రేవులలోని  పరాన్న జీవులను చంపుతుంది.  లవంగాలలోని nigericin  అనే కాంపౌండ్  రక్తంలోని షుగర్ ను వినియోగించుకునే సామర్ధ్యాన్ని శరీర కణాలలో పెంచటంలోను మరియు ఇన్సులిన్ స్రావాలను వృద్ధి పరచటంలోను సహాయపడుతుంది.  తద్వారా రక్తంలో సుగరు నిలవలను క్రమబద్దీ కరిస్తుంది.  polyphenols అనే యాంటీ  ఆక్షిడెంట్ అధికంగా కల 100 ఆహారపదార్ధాలలో  లవంగాలు ప్రధమ స్థానంలో ఉన్నాయి.  ఇవి మధుమేహం, అల్జీమెర్, మెదడు వ్యాధులు, గుండె సంబంద వ్యాధులు, జీర్ణ అవయవాల వ్యాధులు నివారణలో ప్రముఖంగా పనిచేస్తాయి.  ఈ వ్యాదులలో ఉడుకును, నొప్పులను తగ్గిస్తాయి. DNA లలో పరివర్తనలు (mutations) జరగకుండా రక్షిస్తాయి.  వీనిలోని K విటమిన్ రక్తం గడ్డకట్టునట్లు చేయటంలోనూ, C విటమిన్  రోగ నిరోధకశక్తిని వృద్ధి చేయటంలోనూ ఉపయోగపడతాయి.   వీనిలోని కాంపౌండ్స్  చిగుళ్లవ్యాధులను, విరేచనాలను, యీడ్పువ్యాధి (Cramps), గ్లాని ( fatigue) లను, కలిగించే విష క్రిములను నాశనం చేసి మంచి ఆరోగ్యాన్ని కలిగిస్తాయి.  లవంగాలు నోటి దుర్వాసనను, కడుపు ఉబ్బరాన్ని, గ్యాస్ ను, తగ్గించి  జీర్ణ స్రావాలను వృద్ధి చేస్థాయి.  గొంతునుండి  డుయోడినం వరకు జీర్ణ అవయవాలలో  మ్యూకస్ పొరను వృద్ధి చేయటం ద్వారా వానిలో అల్సర్  రాకుండా నిరోధిస్థాయి.  పిప్పిపన్ను నొప్పిని  తగ్గిస్తాయి.  గర్భవతులలో వచ్చే వేవిళ్ళు, వాంతులు, తలత్రిప్పులను నివారిస్తాయి.  జలుబు మరియు ఫ్లూ జ్వరము లందు గొంతులో కూడిన కఫంను తొలగిస్తాయి.  తెల్లకణాలను వృద్ధిచేస్తాయి.   వీటిలోని  ఫెనాల్ ఆహారం ద్వారా శరీరంలో ప్రవేశించే విషపదార్ధాలను తొలగించి, కణాల  విధ్వంసాన్ని అడ్డుకుంటాయి.  NB: గర్భిణులు, గాస్ట్రిక్ అల్సర్ ఉన్నవాళ్ళు వీనిని  బాగా తక్కువగా వాడాలి. చిన్న పిల్లలకు వాడరాదు.