పేజీలు

5, జూన్ 2018, మంగళవారం

కరివేపాకు (Curry Leaf)


కరివేపాకు. Eng: Curry Leaf. Hindi: కరి పత్తా
కరివేపాకులోని ఫెనాల్స్, కార్బోజోల్ ఆల్కలాయిడ్స్ కలిసి లుకేమియా, ప్రోస్టేట్ కాన్సర్, పురీషనాళ కాన్సర్లను
నివారిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. వీనిలోని కార్బోజోల్ ఆల్కలాయిడ్స్ నీళ్ళవిరేచనాలను, ముఖ్యంగా
ఆముదము వలన కలిగే విరేచనాలను తగ్గిస్తాయి. మరియు రక్తపుగడ్డలు ఏర్పడకుండా చేస్తాయి. వీనిలోని A, B,
C, E, విటమిన్లు ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గించటంలోను, అంతర్గత అవయవాల మీద ఫ్రీరాడికల్స్ యొక్క దాడిని
నిరోదించటంలోను అమోఘంగా పనిచేస్తాయి. ఈ ఆకులలోని B6, A, C, విటమిన్లు శిరోజాల కుదుళ్ళను దృడంగా
చేస్తాయి. శిరోజాలు వత్తుగాను, పొడవుగాను, నల్లగాను, పెరిగేట్లు పోషణ చేస్తాయి. జుట్టు ఊడకుండా, చుండ్రు
రాకుండా, తెల్లబడకుండా రక్షిస్తాయి. వీనిలోని కెరోటినాయిడ్స్, విటమిన్ A, కంటిపాపను, కంటి పైపొరలను,
దృడపరిచి మెరయునట్లు గాను, కంటిచూపు దీర్ఘకాలం నిలిచేట్లుగాను చేస్తాయి. కరివేపాకులలో ఉన్న అనేక
కాంపౌండ్స్ కేమోతెరపి, రేడియోతెరపి వల్ల ఏర్పడే దుష్పలితాలను నివారిస్తాయి. అల్జీమర్ వ్యాధిని రానివ్వవు.
పురుగుల, పాముల విషలక్షణాలను తీసివేస్తాయి. ఈ ఆకులలోని Linolool అనే కాంపౌండ్, ఫ్రీరాడికల్స్ను,
బాక్టీరియాను, నాశనం చేస్తుంది. స్ట్రెస్ ను తగ్గించి, వ్యాకులతను, మానసిక కుంగుదలను పోగొడుతుంది. చెడు
కొలెస్టరాల్ ను, తగ్గించి మంచికొలెస్టరాల్ ను పెంచి, గుండెజబ్బులను నివారిస్తుంది. వీనిలోని మహానింబిసైడ్
అనే ఆల్కలాయిడ్ పుండ్లను, కోతలను, కురుపులను, కాలిన చిన్నగాయాలను సత్వరమే బాగుపరుస్తుంది.
ఇదే ఆల్కలాయిడ్ ఊబకాయాన్ని తగ్గిస్తుంది. కరివేపాకులో సమృద్ధిగా పోలిక్ యాసిడ్, ఇనుము ఉంటాయి.
ఫోలిక్ యాసిడ్ ఇనుమును వంటికి పట్టునట్లుచేసి రక్తహీనతను రానివ్వదు. కరివేపాకులోని కేమోపెరాల్,
C, A విటమిన్లు ముక్కు, గొంతు, ఛాతీలలో చేరిన మ్యూకస్ ను కరిగించి, బయటకు నేట్టివేస్తాయి. మరియు
కాలేయాన్ని ఎటువంటి వ్యాధుల బారినపడకుండా రక్షిస్థాయి. కరివేపాకులోని క్యాంఫెరాల్ అనే యాంటీ ఆక్సిడెంట్
అజీర్తిని పోగొట్టటమే కాక పొట్టలోని విషాలను, హానికర రసాయనాలను చక్కగా తొలగిస్తుంది. దీనిలోని పీచు
రక్తంలోని చెక్కర నిలవలను తగ్గిస్తుంది. వీనిలోని రసాయనాలు క్లోమంలోని ఇన్సులిన్ తయారుచేసే కణజాలాన్ని
ఉత్తేజపరిచి మధుమేహం రాకుండా చేస్తాయి.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి