పేజీలు

27, జులై 2019, శనివారం

పొదీనా ఆకులు


పుదీనా              ఆంగ్లం:  Mint                         హిందీ:  పుదినా పత్తా
పుదీనా ఆకులలో  కాల్షియం, మెగ్నీషియం, కాపర్,  పోలేట్, పొటాషియం, మాంగనీస్, A, E, D విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి.   పుదీనాలోని రోజ్ మేరిక్ యాసిడ్ అనబడే యాంటీ ఆక్షిడేంట్,  ఋతువులు మారినప్పుడు వచ్చే అలర్జీలను తగ్గించడంలోనూ, దేహంలోని ఉడుకును నివారించడంలోను సమర్ధవంతంగా పనిచేస్తుంది. పుదీనా లోని మెంతాల్ అనే సుగంధద్రవ్యం, జలుబు వలన గొంతు, ముక్కులలో కఫం గట్టిపడి, బయటికి రాక కష్టం అయినప్పుడు, దానిని సునాయాసంగా వెడలగొట్టి, ముక్కు గొంతుల్లో చల్లని అనుభూతిని కలిగిస్తుంది.  పది ఆకులను బాగా కడిగి, ఒక గ్లాస్ నీటిలో 5 నిముషములు కాచి, వడకట్టి త్రాగవచ్చు. ఈ మెంతాల్ జీర్ణాశయంలోని అనేక హానికారక క్రిములను నిరోధించటమే కాక, గ్యాస్ట్రిక్ అల్సర్లు రాకుండా చేస్తుంది.  పుదీనాలోని పిప్పరమెంట్ అనే ద్రవ్యం జీర్ణాశయంలోని ఆమ్ల స్రావాలను ఉత్తేజితం చెయ్యటం ద్వారా , అరుగుదలను పెంచి, జీర్ణాశయంలో ఏర్పడే ఉబ్బరం, కడుపునొప్పి, వాయువు కూడటం, కడుపు మంటలను పూర్తిగా నివారిస్తుంది.  నిరాశా నిస్పృహలను, యాంగ్జైటీ ని, తగ్గించటంలోను, జ్ఞాపకశక్తిని పెంచటంలోను, ఈ పిప్పరమెంట్ చక్కగాపనిచేస్తుంది. పుదీనాలోని monoterpene అనే పైటో న్యూట్రియంట్ శరీరంలో పెరిగే అనేక కణుతులను నివారిచటమే కాక, అనేక రకాల క్యాన్సర్లను రాకుండా కట్టడి చేస్తుంది.  పుదీనాలోని salicylic acid మొటిమలను,  బ్లాక్ హెడ్స్ ను, తగ్గించటంలోను, కాళ్ళ పగుళ్ళను, నల్లమచ్చలను, మృతకణాలను, తొలగించటంలోను, పురుగులు కుట్టటంతో కలిగిన మంటలను నివారించటం లోను,  చక్కగా పనిచేస్తుంది.   పుదీనాలోని chlorhexidine అనే కాంపౌండ్ నోటిదుర్వాసనను, పళ్ళు పుచ్చిపోవటాన్ని నిరోధిస్తుంది.  దీనిలోని విటమిన్ A రేజీకటిని నిరోధించటమే కాక, కళ్ళ ఆరోగ్యాన్ని వృద్ధి చేస్తుంది.  దీనిలోని E, D, విటమిన్లు చర్మ సౌందర్యాన్ని పెంపొందిస్తాయి.  శరీర రంద్రాలలోని మలినాలను బయటకు నెడతాయి.   పుదీనా ఆకులు గర్భవతులకు వచ్చే వేవిళ్ళు, తలత్రిప్పులను చాలా బాగా తగ్గిస్తాయి.  వీని ఆకుల రసం బాలింతలలో చనుమొనలు పగిలి చేసిన నెప్పులను, తలలో కలిగే చుండ్రు, పేలు, దురదలను, తగ్గించటంలో బాగా పనిచేస్తాయి.  పుదీనా ఆకులు శరీరంలోని రక్త ప్రసరణను ఉత్తేజపరుస్తుంది. మేటబొలిజం పెంచుతుంది. తద్వారా అల్జీమెర్ వ్యాధిని, మధుమేహంలో గ్లూకోజ్ స్థాయులను తగ్గించుతాయి. రుతుసమయంలో వచ్చే cramps ను కూడా నివారిస్తాయి.   NB:  బాలెంతలు మితంగా వాడాలి. గర్భస్రావం అయ్యే స్త్రీలు వాడకూడదు.  చిన్నపిల్లలకు వద్దు.
*పుదీనా రక్తహీనతను సమర్ధవంతంగా తొలగించటమే కాక  కొత్త రక్త కణాలను అభివ్రుద్ధిచేస్తుంది. పుదీనా ఆకుల రసం మూడు స్పూన్లు  ఒక గ్లాస్ నీటిలో కలిపి ప్రతిరోజు ఉదయాన్నే తీసుకోవాలి.