పేజీలు

15, జూన్ 2018, శుక్రవారం

బీటుదుంప (Beetroot)


బీట్ దుంప: Eng. Beet Root Hindi: చుకంధర్
01.బోరాన్ : బీట్రూట్ లో అధిక మొత్తంలో ఉండే బోరాన్ సెక్స్ హార్మోన్ల స్రావాన్ని పెంచుతుంది. మర్మాంగాల
క్రియాశీలతను పెంచుతుంది. విటమిన్ D, కాల్షియంలు, శరీరంనుండి నష్టపోకుండా చూస్తుంది.
02.బీటేన్ (Betaine): ఇది వ్యాకులతను (depression)తొలగిస్తుంది. మనసును ప్రశాంతంగా ఉంచుతుంది.
కాలేయము మరియు పిత్తాశయములను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎన్నో వ్యాధులను నిరోధిస్తుంది.
03. పొటాషియం : 325mg/100 g. ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. గుండె
కొట్టుకోవటాన్ని క్రమబద్ధీకరిస్తుంది. నరాలవ్యాధులను, మానసిక వత్తిడిని, గుండెపోటును రాకుండా చేస్తుంది.
04. ట్రిప్టోఫాన్: ఈ అమినొయాసిడ్ మనసును ప్రశాంతంగాను, ఉల్లాసంగాను, ఉంచుతుంది. మంచి నిద్రను
కలిగిస్తుంది. ఆకలి సక్రమంగా ఉండేట్లు చూస్తుంది. 05. ఐరన్ : ఇనుము ఎర్ర రక్తకణాలను ఉత్పత్తి చేసి,
క్రియాశీలంగా ఉంచుతుంది. రక్తకణాలకు కావలసిన ఆక్షిజన్ ను, సరపరా చేస్తుంది. హిమోగ్లోబిన్ తయారీకి
సహాయపడుతుంది. ఇనుము, B విటమిన్ తో కలిసి శరీరకణజాలాన్ని సంఖ్యాపరంగాను, క్రియాపరంగాను,
అభివృద్ధి చేస్తాయి. రక్తహీనతను రానివ్వవు. 06. Nitrates: నైట్రేట్లు రక్తనాళాలను వ్యాకోశింప జేసి, రక్తప్రసరణ
అన్నిఅవయవాలకు నిరాఘాటంగా జరిగేట్లు చేసి, గుండెజబ్బులను రానివ్వదు. మర్మాంగాలకు రక్తప్రసరణను
పెంచుతుంది. ఆటగాళ్ళలో శారీరకశక్తిని, కౌశలాన్ని, ఆక్షిజన్ గ్రహించేశక్తిని పెంచుతుంది. అల్జీమర్ వ్యాధిని రానివ్వదు.
07. ఫోలేట్(B9): పిండం త్వరగా పెరగటానికి, ఆరోగ్యంగా ఉండటానికి, కణాలు సక్రియంగా ఉండటానికి ఉపయోగం.
08. విటమిన్ B6: ఇది రోగనిరోధకశక్తిని, ఆరోగ్యకర జీవక్రియను, హార్మోనుల స్థాయులను పరిరక్షిస్తుంది.
09. బీటాకెరటీన్: కండ్లఆరోగ్యాన్ని, అందాన్ని ,కాపాడుతుంది. వృద్ధాప్యంలో శుక్లాలను, గ్రుడ్డితనాన్ని రానివ్వదు.
10. మెగ్నీషియం : దృడమైన ఆరోగ్యకరమైన, ఎముకలను నిర్మిస్తుంది. గర్భధారణశక్తిని, శారీరకశక్తిని, పెంచుతుంది.
11. విటమిన్ C: రోగనిరోధకశక్తిని పెంచుతుంది. చర్మ సౌందర్యాన్ని, ఆరోగ్యాన్ని, చూస్తుంది. నేత్రముల ఆరోగ్యాన్ని
వ్రుద్ధిచేస్తుంది. వృద్ధాప్యలక్షణాలను రానివ్వదు. 12. Betacyanin: ఇది బీట్రూట్ కు, ఎర్రని రంగును కలిగిస్తుంది.
ఇది శరీరంలోని విషాలను సమర్ధవంతంగా బయటకు నెట్టివేస్తుంది. అనేకరకాల కాన్సర్లను నిరోధిస్తుంది.
13. Fiber: ఈ పీచుపదార్డం మలబద్ధకాన్ని, అధిక కొలెస్టరాల్ ను, మధుమేహాన్ని, క్రమబద్ధీకరిస్తుంది.
14. రాగి: ఇది కళ్ళు మరియు శిరోజాల రంగు ఏర్పడేందుకు, చర్మ సౌందర్యానికి, ఇనుము జీర్ణం అయ్యేందుకు,
మెదడు శక్తివంతంగా పనిచేసేందుకు, ఉపయోగపడుతుంది. 15. మాంగనీస్: ఎముకల పెరుగుదలకు, దృడత్వానికి,
కాల్షియంను, శరీరం గ్రహించేశక్తి పెరగటానికి ఉపయోగం. రక్తంలోని షుగర్ శాతాన్ని, కణాల జీవక్రియను, నియంత్రణలో
ఉంచుతుంది.ధైరాయిడ్ హార్మోన్ పనిని క్రమపరుస్తుంది. 16. ఆల్ఫాలిపోయిక్ యాసిడ్: ఈ యాంటీ ఆక్షిడేంట్ గ్లూకోజ్
నిలవలను తగ్గిచడం, ఇన్సులిన్ ఉత్పత్తి పెంచటం, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను నిరోధించటం ద్వారా మధుమేహాన్ని
నియంత్రిస్తుంది. 17. Choline: కోలైన్ అనే ఈ న్యూట్రియంట్ మంచినిద్ర, కండరాల కదలిక, నేర్చుకునే
జ్ఞాపకశక్తిని పెంచుతుంది. కణకవచాలను రక్షిస్తుంది. నాడీ తంత్రుల మద్య ప్రసారాలను చక్కబరుస్తుంది.
18. ఆగ్జాలిక్ యాసిడ్: ఇది శరీరంలో నిల్వవున్న కాల్షియంను, బయటకు నెట్టివేసి, తద్వారా కిడ్నీలలో రాళ్ళు,
ఆర్ధరైటిస్, కాన్సర్లు, గుండెజబ్బులు రాకుండా పనిచేస్తుంది. 19. Lutein: కంటిచూపును, కంటి ఆరోగ్యాన్ని
కాపాడుతుంది. NB: కిద్నీలలో రాళ్ళు ఉన్నవారు, లోబిపి ఉన్నవారు వాడరాదు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి