పేజీలు

31, డిసెంబర్ 2018, సోమవారం

వాము, ఓమము


వాము,  ఓమము               ఆంగ్లం:  Carom Seeds,  Thymol Seeds      హిందీ:  అజవాయిన్
1. వాము అజీర్తిని, అరుచిని తగ్గించటంలో అమోఘమైనది.  ఇది జీర్ణాశయంలోని స్రావాలను క్రమబద్దీకరించటం ద్వారా జీర్ణశక్తిని వృద్ది చేస్తుంది.  ఇది ప్రేగులలో గ్యాస్ ను, ఉబ్బరాన్ని తగ్గించి, బందించిన మలాన్ని సులభంగా జారీ చేస్తుంది.  పొత్తికడుపులో అత్యధికంగా వాయువు బంధించటం ద్వారా కలిగే  కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం లను వాము సునాయాసంగా తగ్గిస్తుంది. దీనికి ఒక టీస్పూన్ వామును, చిటెకెడు ఉప్పును కలిపి నూరి, ఒక గ్లాస్ వేడినీటితో తీసుకోవాలి. 2. కాలేయం లోని వాపు, మంటలను తగ్గించి, దాని ఆరోగ్యాన్ని చక్కపరుస్తుంది.  ప్రేగులలో ఏర్పడే బద్దీక్రిములను పెరగకుండా నిరోధించి, నిర్మూలిస్తుంది.  3.వాము గొంతు, ముక్కు, ఊపిరితిత్తులలోని  స్రావాలు గట్టిపడి బంధించినప్పుడు  వాటిని సమర్దవంతముగా తొలగించటమేకాక,  వానివలన నోటిలో ఏర్పడిన  దుర్వాసన, అరుచిలను దూరంచేస్తుంది.   4. వాము, బెల్లంలను కలిపి నూరి  రోజూ రెండు పూటలా  ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుంటే ఆస్తమాలో మంచి ఫలితం వుంటుంది.   5. మూత్రాశయంలో ఏర్పడిన  రాళ్ళను తొలగించటంలో వాము చక్కగా పనిచేస్తుంది.  వామును, తేనెను కలిపి తీసుకున్నట్లయితే కిడ్నీలలో రాళ్ళను కరిగించి మూత్రం ద్వారా వెడలకొడుతుంది.   6. వాములోని నయసిన్, త్తైమోల్ అనే కాంపౌండ్స్  గుండె చర్యలను ఉత్తేజపరిచి రక్త ప్రసరణను వృద్ధి చెయ్యటం ద్వారా  చెస్ట్ పెయిన్,  గుండె నొప్పులు రాకుండా చేస్థాయి.  వచ్చిన నొప్పులను కూడా సత్వరం తగ్గిస్తాయి.  దీనికోసం ఒక టీస్పూన్  వామును, ఒక టీస్పూన్ బెల్లాన్ని కలిపి నూరి చప్పరించాలి.   7. వాములోని  అన్ శాస్యురేటేడ్ ఫాట్స్, అధికంగా వున్న చెడ్డ కొలెస్టరాల్ LDL ను , తగ్గించటంలో అద్భుతంగా పనిచేస్తాయి.   వీనిలో ఎక్కువగా వుండే పీచుపదార్డం కొలెస్టరాల్ ను బయటకు పంపేందుకు సహకరిస్తుంది.  8. ఆర్ధరైటిస్ వ్యాధిలోని వాపులను, నొప్పులను సునాయాసంగా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తగ్గించటంలో వీనిలోని thymol చక్కగా పనిచేస్తుంది.  ఒక టీస్పూన్ వామును ఒక గ్లాస్ నీటిలో కలిపి తీసుకోవాలి.  9. ఋతుస్రావ సమయంలో మహిళల్లో సంబవించే  చిరచిర, భరించలేని ఈడ్పులు, కడుపునొప్పులను  అద్భుతంగా తగ్గిస్తుంది.  11. పెరుగులో వామును కలిపి రోజూ తీసుకుంటే  ఆల్కాహాల్ త్రాగే కోరికను తగ్గిస్తుంది.  12.  వీని పౌడర్ ను, గుడ్డలో మూటకట్టి వాసన చూస్తుంటే  ముక్కుదిబ్బడ  వెంటనే తొలగిపోతుంది.   13.  స్తీలలో స్తన్యాన్ని వృద్ధిచేస్తాయి.  పాలు పడని బాలింతలలో పాలు పడేట్లు చేస్తాయి.  14. పురుషులలో  శీఘ్రస్కలనాన్ని తగ్గిస్తాయి.   15. వెంట్రుకలు త్వరగా తెల్లబడటాన్ని నివారిస్తాయి.  NB:  ఇవి వేడి తత్వం కలవారి కండ్లకు హాని చేస్తాయి. కనుక మితంగా వాడాలి.  రోజుకు 2 నుండి 4 గ్రాములు  మించకుండా వాడుకోవాలి.

15, డిసెంబర్ 2018, శనివారం

తీసిపారెయ్యవద్దు - తింటేనేమేలు


యాపిల్:  సాధారణంగా మనం యాపిల్ పండ్లను తొక్కతీసి, పరిశుభ్రంగా తిన్నామని భావిస్తాం.   కానీ యాపిల్ తొక్కలో  12 రకాల  ట్రిటర్ పెనాయిడ్స్  ఉన్నాయని  కార్నెల్ యూనివర్సిటీ  అధ్యయనం. యాంటీ ఆక్సిడెంట్ లు, పాలీఫినాల్స్ గుజ్జులో కంటే 5 రెట్లు  తొక్కలో అధికంగా వున్నాయి.  ఇవి కాన్సర్లను రానివ్వవు. అల్జీమిర్  వ్యాదిని, నివారిస్తాయి.  చిగుళ్ళను, చర్మాన్ని, ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని రక్షిస్తాయి.  కనుక  యాపిల్స్ నుండి అధిక లాభం పొందేందుకు వానిని  ఉప్పు నీటిలో బాగా శుభ్రపరిచి  తోలుతో తినటమే మేలు.
పల్లీలు:  వేయించిన వేరుశనగగింజల పై పొట్టును చాలామంది  తీసివేసి తింటారు.  దీని పొట్టులో అధిక మోతాదు లో రిజవెరాట్రాల్ అనే యాంటీ ఆక్షిడెంట్ ఉంటుంది.    ఇది గుండెజబ్బులను, కాన్సర్లను రానివ్వదు.  వృద్దాప్యం రాకుండా నిలుపుదల చేస్తుంది. మతిమరపు, కీళ్లనోప్పులను నివారిస్తుంది
జామపండు:  అత్యధికంగా యాంటీ ఆక్షిడెంట్లను  కలిగిన పండ్లలో జామది అగ్రస్థానం.  దీని తోలులో యాంతోసియానిన్, రిజేవెరాట్రాల్ మరియు అనేక యాంటీ ఆక్షిడెంట్లు ఉంటాయి.  ఇవి కాన్సర్లను, హృద్రోగాలను, నివారించటమే కాక మంచి ఆరోగ్యాన్ని కలగచేస్తాయి. కనుక జామను తోలుతోనే తినాలి.
నల్లద్రాక్ష:  సహజంగా నల్లద్రాక్ష తోలును మనం ఊసివేస్తాం.  దానితో మనం ద్రాక్షలోని 25% యాంటీ ఆక్షిడెంట్లను కోల్పోవటం జరుగుతుంది. తద్వారా కొలెస్టరాల్, గుండెజబ్బులను నిరోదించలేము.
నిమ్మ, నారింజ:  వీని తోక్కలలో  మోనో టేర్పాన్స్ అనే నూనెలు  చర్మ,కాలేయ, గర్భాశయ, ఊపిరితిత్తుల కాన్సర్లను నిరోధిస్తాయి.  కనుక వీనిని  పొడి రూపంలో  సలాడ్స్ లోను, టీ లోను చేర్చుకోవటం మంచిది.
పుచ్చకాయ:  దీనిలోని తెల్లని తోలు భాగంలో  వ్యాధి నిరోదకశక్తిని పెంచే  సిట్రులిన్, అమినోయాసిడ్స్, విటమిన్లు అధికంగా వుంటాయి.  రక్తహీనత నివారించే  ఇనుము, కాల్షియం, మెగ్నీషియం కూడా అధికం.  కనుక ఈ తెల్లని భాగాన్ని వదులుకోకూడదు.
కివి:  దీని తొక్క లోపలివైపు ప్లవనాయిడ్ లు, అనేక యాంటీ ఆక్షిడేంట్లు ఉంటాయి.  ప్లవనాయిడ్లు శరీరంలోని ప్రీరాడికల్స్ ను, తొలగించటంలో అమోఘమైనవి. కనుక దీని పై తోలును అతిపలుచగా మాత్రమె తొలగించాలి.
క్యారెట్:   దీని చర్మంలో సగానికి పైగా ఫినోలెక్ కాంపౌండ్స్, అనేక పైటో న్యూట్రియాంట్స్ లభిస్తాయి.  కనుక వీనిని ఎల్లప్పుడు చర్మంతోనే తినడం మంచిది.  తినేముందు ఉప్పునీటిలో శుభ్రపరుచుకుంటే చాలు.
బీరకాయ, దోసకాయ, కీర దోసకాయలను అతి తక్కువగా తోలు తీసి తినటం ఆరోగ్యం. బీరకాయ తోలులో ఫైబర్, పోషకాలు అధికం.  దోసకాయ తోలులో A విటమిన్, బీటా కేరాటిన్, ఎక్కువగా ఉంటాయి.  కీరా పై చర్మంలో విటమిన్ K, పొటాషియం, యాంటీ ఆక్షిడెంట్ లు, చాలా అధికం.
చిలగడదుంప:  దీని చర్మంలో ఇనుము, జింక్, విటమిన్ E అధికంగా ఉంటాయి. ఇనుము రక్తహీనతను రానివ్వదు. జింక్ మరియు విటమిన్ E వ్యాధి నిరోధకశక్తిని పెంచుతాయి.  కనుక వీనిని ఎల్లప్పుడు చర్మంతోనే తినటం చాలా మంచిది.

28, ఆగస్టు 2018, మంగళవారం

సూర్యుడు (Sun) అశుభ ఫలితాలు, రెమిడీలు

    సూర్యుడు అశుభగ్రహంగా యిచ్చే ఫలితాలు                 ఆచరించవలసిన రెమిడీస్
తండ్రికి అనారోగ్యం, తండ్రి సోదరులకు బాధలు. తూర్పు ముఖద్వారం గల ఇంటిలో నివశించండి.
తండ్రితో శతృత్వం, తండ్రి ఆస్తులు రాకపోవటం. తండ్రికి సేవచేసి ఆశీర్వాదము తప్పక పొందండి.
ఉద్యోగమునందు పై అధికారుల వలన బాధలు. చీకటి వ్యాపారాలకు, లంచాలకు దూరంగా ఉండండి.
ముసలితనంలో అనవసరపు మాటలు మాట్లాడుట. ఆదివారం మద్యం, మాంసాహారం తీసుకోవద్దు.
వయసులో జీవనము నందు కష్టములు, బాధలు. కోతులకు బెల్లము, వేయించిన శనగపప్పు పెట్టండి.
వ్యాపారములో నష్టములు, కుటుంబంలో చిక్కులు. ఆదివారం గోదుమరవ్వ లడ్లు పిల్లలకు పంచండి.
మనసు సరిగా ఉండకపోవుట, అతిభయము. ఎడమచేతి ఉంగరపు వ్రేలికి కెంపు ధరించండి.
అధిక ప్రయాణములు, వానిలో అలసట. గోదుమలు, బెల్లం, రేగుపళ్ళు, క్యారట్ దానం చెయ్యండి.
రాత్రి కంటే పగలు బాధలు ఎక్కువగా ఉండుట.  బెల్లం తిని, నీరు త్రాగి బయలుదేరితే అన్నీవిజయం.
కండ్లు సరిగా కన్పించక పోవుట, నేత్రరోగాలు. తలమీద తెల్లని టోపీ లేదా తలపాగా ధరించండి.
వయసు కన్నా ముసలివారిగా కన్పించుట. సూర్యునికి అర్ఘ్యం ఇవ్వండి, ఆదిత్యహృదయం చదవండి.
విద్యయందు ఆటంకములు, ఉద్యోగము పోవుట. గవర్నమెంట్ ఉద్యోగులను తప్పక గౌరవించండి.
ఎక్కువ కారం తినుటవలన అనారోగ్యము. రంద్రం కలిగిన రాగి నాణెం ప్రవహించే నీటిలో వెయ్యండి.
బిపి, గుండెజబ్బులు, విరేచనములు, క్షయవ్యాధి. తల్లి, నాయనమ్మల ఆశీర్వాదములను తీసుకోండి.
ప్రభుత్వము ద్వారా, అధికారుల ద్వారా బాధలు. గోదుమరవ్వ పొంగలి,  బెల్లం పాయసము తినండి.
సంతానంతో బాధలు, తూర్పుదిశనుండి కష్టములు. గ్రుడ్డివారికి బోజనము పెట్టించండి.
               *పై ఫలితాలు కన్పించినప్పుడు, రెమిడీలలో మీకు వీలయినవి చేసి నివారణ పొందవచ్చు.

27, ఆగస్టు 2018, సోమవారం

చంద్రుడు (Moon) అశుభ ఫలితాలు, రెమిడీలు

    చంద్రుడు అశుభగ్రహంగా యిచ్చే ఫలితాలు             ఆచరించవలసిన రెమిడీలు     
మంచిని, చెడును నిర్ణయించుకొన లేకపోవుట. కుడిచేతి ఉంగరపు వ్రేలికి వెండిలో ముత్యం ధరించండి.
మనస్సునందు చంచలత్వము, నిరుత్సాహము. తెల్లని వస్త్రాలు, వెండి ఆభరణాలు ధరించండి.
అబద్దాలు ఆడటం, గొప్పలు చెప్పుకోవటం. వెండి గ్లాసుతో  పాలు లేదా నీరు త్రాగుతూ ఉండండి.
పరిస్థితులను  తట్టుకొనలేకపోవుట,   జనఘోష. ఎరుపురంగు కర్చీఫ్ ఎల్లప్పుడు జేబులో ఉంచండి.
బుద్దిహీనత, మతిమరుపు, మనస్సుకు ఆటుపోట్లు. బియ్యం, పాలు, పెరుగు, నెయ్యి దానం చెయ్యండి. 
ఈర్ష్య, బందువిరోధం, స్త్రీ వలన అనేక బాధలు. సోమవారం పేదలకు దద్ధోజనం పంచిపెట్టండి.
తల్లికి గండము, అనారోగ్యము, తల్లితో తగవులు. అమ్మమ్మ, అత్త, నాయనమ్మ, దీవెనలు పొందండి.
ఆహారము లేకపోవుట, ఉన్ననూ తినలేకపోవుట. తల్లికి  సేవచేసి తరచుగా ఆశీర్వాదం తీసుకోండి.
నరదృష్టి వలన, రహస్య శత్రువులు వలన బాధలు. గుటికెడు నీరు త్రాగి, ముఖ్యమైన పనులు చెయ్యండి. 
విద్యలో ఆటంకాలు, వ్యాపారంలో నష్టములు. ఇంటిలో బియ్యం, వెండి ఎల్లప్పుడూ ఉంచుకోండి.
కుటుంబమునందు బాధ, అసౌఖ్యము, అపశ్రుతి. సోమవారం బియ్యంతో పాయసం వండి తినండి.
కలుషిత నీరు, ఆహారముల వలన వ్యాధులు. తల్లిద్వారా వెండి, ముత్యాలు తీసుకొని దాచుకోండి.
పాండురోగము, ఉబ్బురోగము, సుఖవ్యాధులు. మర్రిచెట్టుకు లేదా తుమ్మచెట్టుకు నీరు పొయ్యండి.
తెల్ల రక్తకణములు ఎక్కువగుట, కామెర్లు,  పీనాస. మంచం కోళ్ళకు వెండి మేకులు కొట్టించండి.
గర్భదోషములు, సౌందర్యము తగ్గుట. శివుని పూజించండి.  నదీజలంలో స్నానం చెయ్యండి.
నిద్ర, ధాతుపుష్టి, కామసుఖం, తక్కువగుట. వెండి రేకులు పొదిగిన పాలకోవా తినండి.
ఇంటి ఆగ్నేయదిశలో వాస్తు దోషములు.

26, ఆగస్టు 2018, ఆదివారం

గురువు (Jupiter) అశుభ ఫలితాలు, రెమిడీలు


    అశుభ గ్రహంగాగురువు యిచ్చే ఫలితాలు               ఆచరించవలసిన రెమిడీలు
పెద్ద ప్రయత్నాలు, సంకల్పాలు చేయలేని అసమర్ధత. బంగారపు గొలుసు మెడలో ఎల్లప్పుడు ధరించండి.
పెద్దలను, సాంప్రదాయాలను విశ్వసించననే పొగరు. పసుపు రంగు కర్చీఫ్ దగ్గర ఉంచుకోండి.
ఇతరులు వీరిని సరిగా అర్ధము చేసుకోనకపోవుట. కాకులకు అన్నము లేదా రొట్టెలు వేయండి.
తీపి వస్తువులు తినుటవలన  అనారోగ్యము. శనగలు, బెల్లం, పసుపు పండ్లు పంచండి.
తల వెంట్రుకలు తెల్లబడుట, తల సంబంధ వ్యాధులు. రావిచెట్టు నాటండి లేదా రావికి  నీరుపోయ్యండి.
పప్పులు, పిండులు అరగకపోవుట, కడుపులో గ్యాస్. గురువారం వండిన శనగలు పేదలకు పంచండి.
స్త్రీలకు భర్తవలన బాధలు, గర్భాశయ వ్యాధులు. ముక్కు ఎల్లప్పుడు శుభ్రంగా ఉంచుకోండి.
వయస్సున బీద ఇంటివారితో వివాహము జరుగుట. అతిధులను, గురువులను తప్పక గౌరవించండి.
గురువులతోను, మిత్రులతోను బేదములు కలుగుట. పౌర్ణమిరోజు సత్యనారాయణవ్రతం చెయ్యండి.
ధనము, జ్ఞాన విజ్ఞాన లక్షణములు తక్కువగుట. దేవాలయానికి వెళ్లి పూజాస్తలము శుభ్రం చెయ్యండి.
గృహములు ఎక్కువగా మారుతూ ఉండటము. పసుపుపచ్చ పూలమొక్కలు పెంచండి.
బందువుల వలన ఎక్కువ ఖర్చులు అగుట. ఎవరినుండి ఏవిధమైన దానము తీసుకోకండి.
వృద్దాప్యంలో సంతానముతో గొడవలు జరుగుట. ఇతరులు వాడిన దుస్తులు మీరు వాడకండి.
నమ్మినవారు మోసము చేయుట. ధనలేమి. నెయ్యి, శనగపప్పు, పుస్తకాలు దానం ఇవ్వండి.
మంచి పనులకు ఆటంకములు కలుగుట. బంగారపు నగలు పసుపు గుడ్డలో చుట్టి దాయండి.
విద్యాబ్యాసము కొరకు ఎక్కువగా తిరుగుట. దుర్గాదేవి పూజ చెయ్యండి. గరుడపురాణం చదవండి.
గృహం ఉత్తరదిశలో వాస్తు దోషములు కలుగుట. కుంకుమపువ్వు పరమాణ్ణంలో వేసి తినండి.
దైవానుగ్రహము కలుగకపోవుట. కుడిచేతికి పసుపురంగు దారం ధరించండి.

25, ఆగస్టు 2018, శనివారం

రాహువు (Rahu) అశుభ ఫలితాలు, రెమిడీలు

   రాహువు అశుభగ్రహంగా యిచ్చే ఫలితాలు            ఆచరించవలసిన రెమిడీలు  
వైద్యులకు అంతుచిక్కని అనారోగ్యాలు. ఆవాలు, బీడీలు, చుట్టలు, సిగరెట్లు దానం చెయ్యండి.
దొంగల వలన, అధికారుల వలన భయం. జొన్నపిండి ఉండలు చేపలకు ఆహారంగా వెయ్యండి.
లాటరీలు, రేసులు, త్రాగుడుకు ధనవ్యయం.  4 పీచుతో ఉన్న కొబ్బరికాయలు నదిలో వదలండి.
క్రిమికీటకాదుల వలన, క్షుద్రపూజల వలన, బాధలు. ఎలాంటి ఆయుధాలు మీవద్ద, ఇంటిలో ఉంచవద్దు.
దూరదేశములందు, ఆ ప్రయాణాలలో కష్టములు. అత్తవారితో మంచి సంబందాలు కలిగివుండండి.
నీచవృత్తి వలన జీవనం, సుఖంలేని కళత్రం. అవినీతి మార్గాలలో ధన సంపాదన చేయకండి.
వదినలతో, బావలతో, ముస్లింలతో, వివాదాలు. చిన్నవెండి గోలీలు ఎల్లప్పుడు జేబులో ఉంచుకోండి.
భ్రమలు కలుగుట, భూతప్రేత పిశాచ బాధలు. మొదలుపెట్టిన పనిని ఎప్పుడూ మద్యలో వదలకండి.
అత్తింటి వారివలన అనేక బాధలు కలుగుట. సరస్వతిని, దుర్గాదేవిని పూజ చెయ్యటం మంచిది.
రాత్రులలో చెడుప్రబావాలు అధికంగా కలుగుట.  బార్లీగింజలు, పాత నాణేలు, నదిలో వెయ్యండి. 
రహస్య శత్రువుల వలన కష్టములు. అమ్మమ్మ, తాతయ్యలను ప్రేమగా చూడండి.
సంతానము వలన అనేక బాధలు. ఇంటిలో కరెంటువస్తువులు కండిషన్ లో ఉంచండి.
సౌఖ్యంలేని భోజనం, మానసిక వ్యాధులు. సమిష్టి కుటుంబంలో మాత్రమె ఉండండి.
నైరుతిలో వాస్తు దోషములు కలుగుట. ఇతరులనుండి స్టీల్, కరెంట్ వస్తువులు తీసుకోవద్దు.
పై అధికారి పగబట్టుటతో ఇబ్బందులు. పుగాకు, సిగరెట్లను జీవితంలో వాడవద్దు.

24, ఆగస్టు 2018, శుక్రవారం

బుధుడు (Mercury) అశుభ ఫలితాలు, రెమిడీలు

   బుధుడు అశుభగ్రహంగా యిచ్చే ఫలితాలు                 ఆచరించవలసిన రెమిడీలు 
సోమరితనము, వ్యర్ధముగా కాలం గడుపుట . రంద్రంకల రాగినాణెం ప్రవహించే నదిలో వేయండి.
విద్యయందు ఆటంకములు, శ్రద్ధాలోపము. బుధవారం పచ్చ పెసలు, నెయ్యి, దానం చెయ్యండి.
మనోబాధ, పిచ్చిగా ప్రవర్తించుట. మతిమరుపు. ఆకుపచ్చబట్టలు, గాజులు, కన్యలకు ఇవ్వండి. 
వ్యాపారములో, క్రయవిక్రయాలలో, నష్టము. పటికతో దంతములు శుభ్రంగా తోముకోండి.
అనాలోచితముగా చేసిన సంతకాలతో నష్టములు. గణపతి లేదా దుర్గాదేవిని పూజించండి.
మధ్యవర్తిత్వము వలన వ్యవహారములలో బాధలు.  వృద్దులకు లేదా ఆవులకు సపర్యలు చెయ్యండి.
అజ్ఞానంతో పనులు,  అనవసర వాగ్వాదములు. కూతురు,చెల్లెలు,పిన్ని,మరదలుతో ప్రేమగా ఉండండి.
మలబద్దకము,అనిద్ర, పైత్య శ్లేష్మ చర్మ వ్యాదులు. ఎవరినీ నిందించకండి. ఇచ్చినమాట నిలబెట్టుకొండి.
ఋణ వృద్ది, రోగవృద్ది, శత్రు వృద్ది, నమ్మకద్రోహం. నానబెట్టిన పెసలు బుధవారం పక్షులకు వేయండి.
పిట్స్, ఊపిరితిత్తుల వ్యాధులు,  థైరాయిడ్ వ్యాధి. తోలు బెల్ట్ ధరించండి. కోడిగ్రుడ్లు తినటం మానండి.  
మేనమామలకు కష్టములు. నిందలు కలుగుట. పసుపుపచ్చ గుమ్మడికాయ గుడిలో ఇవ్వండి.
భగవంతుని పూజింపకుండుట, నమ్మకుండుట. మేక లేదా చిలుకను పెంచుకోండి.
ఉత్తర, ఈశాన్య దిశలలో వాస్తు దోషములు. గ్రుడ్డివారికి బోజనము పెట్టించండి.
నరముల బలహీనత, మానసిక వ్యాధులు.  ముక్కుపుడక ధరించండి. తీర్ధయాత్రలు చెయ్యండి.
పుస్తకములకు అధిక ఖర్చుచేయుట. దుర్గా సప్తశతి పారాయణ చెయ్యండి.

23, ఆగస్టు 2018, గురువారం

అశుభగ్రహంగా శుక్రుడు (Venus) యిచ్చే ఫలితాలు, రెమిడీలు

   శుక్రుడు అశుభ గ్రహంగా యిచ్చే ఫలితాలు             ఆచరించవలసిన రెమిడీలు 
వివాహ శుభకార్యములందు ఆటంకములు. తెల్లని ఇస్త్రీ బట్టలు, ముత్యం ఉంగరం ధరించండి.
జీవిత బాగస్వామితో తగువులు, ఎడబాటు. తెల్లని బట్టలు,పెరుగు, నెయ్యి, దానం చెయ్యండి.
అత్తమామల మూలకముగా తగవులు. 200 గ్రాముల ఆవు నెయ్యి దేవాలయంలో ఇవ్వండి.
స్త్రీలతో శాపములు, స్త్రీల మూలకంగా విరోదాలు. ఉల్లిగడ్డలు ఎల్లప్పుడు ఇంటిలో ఉంచుకోండి.
భార్యాపిల్లలకు పీడ, జీవనమునందు ఆటంకాలు. సుగంద ద్రవ్యాలు, క్రీములు, సెంట్లు, వాడండి.
బంగారు నగలు అమ్ముట, తాకట్టు పెట్టుట. ఇతరుల బట్టలు, చిరిగిన కాలిన బట్టలు ధరించవద్దు.
కీళ్లవాతం, కిడ్నీ, మూత్రవ్యాదులు, మధుమేహం. బాదంపప్పు వేసిన పౌష్టిక ఆహారం తినండి.
భార్యతో సౌఖ్యము లేకుండుట, వీర్యనష్టము. తల్లిదండ్రుల ఆశీర్వాదం తరఛు తీసుకోండి.
యవ్వనమున జీవన బాధలు, స్థాన నాశనము. తెల్లనిపూలతో సరస్వతి పూజ పౌర్ణమిరోజు చెయ్యండి.
వస్త్ర, ఆభరణ,సెంట్లు,ఫాన్సీ వ్యాపారాల్లో నష్టము. కంచుపాత్రను శుక్రవారం రోజు దానం చెయ్యండి.
శత్రువృద్ది, ఋణవృద్ది, విద్యయందు ఆటంకాలు.  స్త్రీలను ఆదరించండి. ఎప్పుడూ అవమానించకండి 
మనస్సు భగవంతుని మీద నిలుపలేకపోవుట.  శుక్రవారం ఉపవాసం లేదా మౌనం పాటించండి.
స్త్రీ సంతానము ఎక్కువగా కలుగుట. ఇంటి ఆవరణలో కొంత మట్టి తడిగా ఉంచండి.
సమయానికి ఆహారము లబించకపోవుట. పాలల్లో బంగారంవేసి మరిగించి పాలు త్రాగండి. 
తూర్పు, ఆగ్నేయ దిక్కులలో వాస్తు దోషములు.

22, ఆగస్టు 2018, బుధవారం

కేతువు (Kethu) అశుభ ఫలితాలు, రెమిడీలు

     కేతువు అశుభగ్రహంగా యిచ్చే ఫలితాలు              ఆచరించవలసిన రెమిడీలు  
కుటుంబంతో కలసి ఉండలేకపోవటం. పసుపుపచ్చని చందనము బొట్టుగా ధరించండి.
ఇతరులలో గుర్తింపు, మర్యాద లేకపోవటం. బంగారపు పోగులు లేదా గొలుసు ధరించండి.
మనసులో మాట బయటకు చెప్పలేకపోవటం. గోదుమలు,బెల్లం, శనగపప్పు, పూజారికి ఇవ్వండి.
పాండిత్యము, నిజాయితీ ఉన్నా పైకిరాకుండుట. అరటిపళ్ళు, కుంకుమ దేవాలయంలో ఇవ్వండి.
ఉన్నత పదవులు, గౌరవాలు పొందలేకపోవుట. కుక్కకు అన్నం గాని రొట్టేగాని తినిపించండి.
జీవితంలో ఎటువంటి రాణింపు లేకపోవటం. తెలుపు నలుపు దుప్పటి లేదా నువ్వులు పంచండి.
ఎప్పుడూ ఏదోఒక చింత కలిగి ఉండటం. బంగారు రేకులు పొదిగిన మిఠాయి తినండి.
అన్నింటిపై వైరాగ్యము కలుగుతుండుట. ఇనప పెట్టె, లాకర్లు ఎప్పుడూ ఖాళీగా ఉంచకండి.
నిధులయందు అత్యాస కలిగియుండుట. నీతివంతమైన వ్యక్త్జిత్వము ఎల్లప్పుడు కలిగివుండండి.
భార్యాభర్తలకు అన్యోన్యత లోపించుట. భార్యను ఎట్టి పరిస్థితులలోను అవమానపరచకండి. 
2,3 రోజులు ఆహారము లభించకపోవుట. 48 వయస్సు వరకు ఇంటి నిర్మాణం చేయకండి.
గృహములు, వాహనములు నష్టపోవుట. కొడుకులను, మనవళ్ళను ప్రేమగా చూడండి.
అమ్మమ్మ, నాయనమ్మలకు  బాధలు. అల్లుళ్ళను, మేనల్లుడిని, మర్యాదగా ఆదరించండి.
రాత్రుళ్ళు వేళతప్పి ఇంటికి చేరుట. చేపనూనె, కుంకుమ పూవులను తినండి.
పూనకం, కోమా, మానసిక అస్థిమితము కలుగుట. గణపతిని వినాయక చవితికి పూజించండి.
మసూచి, స్పోటకం, చర్మవ్యాధులు కలుగుట. నలుపు,తెలుపు నువ్వులు నదిలో వేయండి.
తక్కువ స్థాయి వారినుండి కష్టములు. 9 లోపు ఆడపిల్లలకు పుల్లని పదార్ధాలు పంచండి.
మద్యము, మాంసములకు అలవాటు పడుట. ఉలవలు,ఖర్జూరాలు, దానం చేస్తూవుండండి.
వాయవ్యదిశలో వాస్తుదోషములు ఉండుట.

21, ఆగస్టు 2018, మంగళవారం

అశుభ శని గ్రహం ( Saturn ) యిచ్చే ఫలితాలు, రెమిడీలు

      శని అశుభ గ్రహంగా యిచ్చే ఫలితాలు            ఆచరించవలసిన రెమిడీలు 
శరీరము కృశించుట, పనిచేయలేకపోవుట. శనివారం నల్లద్రాక్ష, నల్ల బట్టలు, దానం చెయ్యండి.
నరములు, ఎముకల వ్యాదులు, నడవలేకపోవుట.  బెల్లంతో కలిపిన నల్లనువ్వులు కాకులకు వెయ్యండి.
రక్తహీనత,పక్షవాతం, దీర్ఘరోగములు. సారాయి, నువ్వులనూనె ఉచితంగా పంచండి.
భార్యాభర్తల మద్య విభేదములు, విడిపోవుట. పదిమంది గ్రుడ్డివారికి భోజనం పెట్టించండి. 
కుటుంబములో తగవులు, బందునష్టము. పేదవారికి నల్ల దుప్పట్లు, చెప్పులు కొనిపెట్టండి.
తక్కువజాతి లేదా తక్కువహోదా వారివలన బాధలు.  ఉదయాన్నే నువ్వులనూనె వంటికి మర్ధ్హించండి.
పోలీసులు వలన, దొంగలు వలన బాధలు. కూలీలకు, కార్మికులకు బాదంగింజలు పంచండి.
ఉద్యోగ భంగము, స్థానచలనము, సోమరితనము. నల్లని గేదెకు మేతపెట్టి, నీరు పోయండి.
గనులు,నూనెలు,ప్రింటింగ్, వ్యాపారాలలో నష్టము. ఆవనూనెలో కాల్చిన రొట్టెలు కుక్కలకు పెట్టండి.
నీచవృత్తి వలన జీవనము. విషప్రయోగములు  నువ్వులనూనె పూరీలు బిచ్చగాళ్ళకు పంచండి.
తిరుగుబాటు దోరణి. అహంకారము. స్టీలు ఉంగరం మద్యవ్రేలుకు ధరించండి.
యాక్షిడెంట్లలో ఎముకలు విరుగుట. అధికశ్రమ. ఇంద్రనీలం ఎడమచేతి మద్యవ్రేలుకు ధరించండి.
తప్పుడు అంచనాలతో జీవితం తారుమారు. మాంసాహారం, సారాయి పూర్తిగా మానివేయండి.
పడమర దిశ యందు వాస్తుదోషములు. వృద్దుల ఆశీర్వాదం పొందండి.
భార్యవలన బాధలు. ఆహారము లబించకుండుట. నల్లచీమలకు రాత్రిపూట నూకలు చల్లండి.
        * పై పలితములు గమనించినవారు,  రెమిడీలలో వారికి వీలయినవి ఆచరించి నివారణ పొందండి.

20, ఆగస్టు 2018, సోమవారం

కుజుడు (Mars) అశుభ పలితాలు, రెమిడీలు

     కుజుడు అశుభ గ్రహంగా యిచ్చేఫలితాలు                   ఆచరించవలచిన రెమిడీలు  
అన్నదమ్ములతో, బంధుమిత్రులతో విరోధములు  పగడం ఉంగరం లేదా పగడం దండ ధరించండి  
దారాపుత్రుల విచారము, కుటుంబకలహాలు  ఎరుపురంగు దస్తీ ఎల్లప్పుడు దగ్గర ఉంచుకోండి 
తరచుగా గడ్డలు,కురుపులు,వడదెబ్బ,రక్తదర్శనము  గట్టి వెండి గోళీని జేబులో ఉంచుకోండి 
స్త్రీలకు గర్భస్రావము, సంతానం కలుగుటకు ఆటంకాలు  మసూరిపప్పు దానం చెయ్యండి 
స్త్రీలకు బహిష్టుదోషములు, గర్భదోషములు  ఏ వస్తువు ఇతరులనుండి ఉచితంగా తీసుకోకండి 
జ్వరము, రక్త పిత్త దోషములు, దంతరోగములు  తీపి రొట్టెలు తయారుచేసి కోతులకు తినిపించండి 
రోగబాధలు, శత్రుబాధలు, అగ్నిభీతి, ఆయుధభీతి   గోదుమలు,బెల్లం పిల్లలకు మధ్యాహ్నం పంచండి  
వివాహానికి ఆటంకాలు, వాహన ప్రమాదములు   మరుగుతున్ప పాలు పొంగిపోకుండా చూసుకోండి 
భార్యాభర్తల ఎడబాటు, భార్యకు గండం, అనారోగ్యము  మంగళవారం ఆంజనేయుడికి సిందూరం ఎక్కించండి  
నిలకడకలిగిన ఆదాయం, ధనం లేకపోవుట  అన్నదమ్ములతో పోట్లాడకండి. సహకరించండి.
విద్య,వ్యాపారం,ఉద్యోగం, పనులందు కష్టనష్టములు  మంగళవారం ఉపవాసం చెయ్యండి
అధిక అప్పులవలన, కోర్టు కేసులవలన బాధలు  హనుమాన్ చాలీసా చదవండి 
భూసంబంద చరాస్థి దావాలు, జప్తులు, కోర్టుకేసులు తేనె లేదా సిందూరం కొద్దిగా నదిలో వెయ్యండి 
ఇంటికి దక్షిణదిశ వాస్తుదోషముల వలన బాధలు  రాగి చెంబులో నీరు ఉదయాన్నే త్రాగండి 
మాంసము, మత్తు పానీయములందు అధిక ఆసక్తి  వేపమొక్క నాటి పెంచండి 
మితిమీరిన ఖర్చులు, ఋణదాతల నుండి వత్తిడి     
      * పై ఫలితాలు కన్పించినప్పుడు, రెమిడీలలో మీకు వీలయినవి ఆచరించి నివారణ పొందవచ్చు.

25, జులై 2018, బుధవారం

ధనియాలు


ధనియాలు:         ఆంగ్లం:   Coriander seeds          హిందీ:  Dhania
గుండెజబ్బులు:  ధనియాలు చెడ్డ కొలెస్టరాల్ (LDL)ను తగ్గించి, మంచి  కొలెస్టరాల్ (HDL)ను పెంచుతుంది.  దీనిలోని ఒలేయిక్ యాసిడ్, లినోలిక్ యాసిడ్, యాస్కార్బిక్ యాసిడ్, స్టీరిక్ యాసిడ్ లు, చెడ్డ కొలెస్టరాల్ ను తగ్గించటంలో అత్యంత శక్తివంతమైనవి.  గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. 
మధుమేహం:  ధనియాలు క్లోమగ్రందులను ఉత్తేజితం చెయ్యటం ద్వారా ఇన్సులిన్ స్రావాన్ని వృద్దిచేసి, తద్వారా రక్తంలోని చక్కెర నిల్వలను నియంత్రిస్థాయి.  
ఎముకలు,కీళ్ళు:   A, C, K, విటమిన్లు, రిబోఫ్లావిన్, నైసిన్, పోలిక్ యాసిడ్, కాల్షియం, లాంటి యాంటీ ఆక్షిడేంట్లు ఎముకలు పెళుసుబారకుండా దృడంగా ఉండేట్లుగా చేస్తాయి. కీళ్ళను ఆరోగ్యంగా ఉంచుతాయి.  దీనిలోని Linoleic acid, Cineole అనే  యాంటీ ఆక్షిడేంట్లు కీళ్ళవాతంలోని వాపులు, మంటలను సంపూర్తిగ తగ్గిస్తాయి.                                                
జీర్ణాశయ వ్యాదులు:  వీనిలో సమృద్దిగా ఉన్న Borneol, Linalool, జీర్ణక్రియను వృద్దిచేస్తాయి. నీళ్ళ విరేచనాలను నిరోదిస్తాయి. వీనిలోని Cineol, Alpha-Pinene, Limonene లాంటి కాంపౌండ్స్, జీర్ణవాహిక, జీర్ణాశయముల ఆరోగ్యాన్ని చక్కగా రక్షిస్తాయి. Dodecanal అనే కాంపౌండ్  కలుషిత నీరు, ఆహారం ద్వారా వచ్చే అన్నివ్యాదులను ప్రారదోలగలిగిన శక్తిగలిగినవి. కడుపు ఉబ్బరాన్ని, కడుపులో గ్యాస్ ను తొలగిస్తాయి.  తలత్రిప్పు, వికారం, వాంతులను కూడా సమర్దవంతంగా తగ్గిస్తాయి.
కండ్ల ఆరోగ్యం:  వీనిలోని యాంటీ ఆక్షిడేంట్లు కండ్ల పుసులు, కండ్లు అంటుకోవటం, కండ్లు ఎర్రబారటం, కండ్ల కలకలు, రాకుండాచేసి, కండ్లు ఆరోగ్యంగా ఉండేట్లు చేస్తాయి. కంటిచూపును పెంచుతాయి.
చర్మ సౌందర్యం:  మొటిమలు, బ్లాక్ హెడ్స్ రాకుండా చేస్తుంది. వచ్చినవాటిని మలినాలను బయటకునెట్టి త్వరగా మాన్పుతుంది. చర్మం పొడిబారకుండాను, మెరుపు తగ్గకుండాను, ఉంచుతుంది. ఎగ్జిమ, దురదలు, మంటలు, త్వరగా తగ్గునట్లు చేస్తుంది. స్పోటకం లో వచ్చే దురదలు, మంటలను చక్కగా తగ్గిస్తుంది. కొలాజేన్ ను వృద్దిచేసి చర్మం యొక్క సాగే గుణాన్ని నిలిపిఉంచి, చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది.
Anemia:  వీనిలో సమృద్దిగా ఉన్న ఇనుము, హిమోగ్లోబిన్ ను, కొత్త రక్తకణాలను వృద్దిచేసి రక్తహీనత రాకుండా చేస్తాయి. అధిక ఋతు స్రావాన్ని కలగకుండా నిరోదిస్తాయి. ఋతు సమయంలో వచ్చే కడుపునొప్పిని తగ్గిస్తాయి. సమస్త శరీరకణాలలో శక్తిని పెంచుతాయి.
వ్యాధి నిరోధకం:  నోటిలోని పుండ్లను, ఫంగస్ ను, తగ్గిస్తాయి. గొంతు వాపును, మంటను నివారిస్తాయి.  థైరాయిడ్ ను, థైరాయిడ్ లో వచ్చే బాధలను తగ్గిస్తాయి.  శిరోజాల కుదుళ్ళను బలపరిచి, వెంట్రుకలు రాలిపోవటాన్ని నివారిస్తాయి. కాలేయం ఆరోగ్యాన్ని సరిచేసి, మంచి ఆకలిని పుట్టిస్తాయి. శరీరకణాలలోకి, మెదడులోకి చేరిన విషాలను సమర్దవంతముగా బయటికి నెట్టివేస్తాయి.  వీనిలోని Linolool  యాంగ్జైటీ ని సత్వరమే తగ్గిస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. మూత్రనాళవ్యాదులలో మంటలను ఇవి తగ్గిస్తాయి.  కాన్సర్ వ్యాధిలో వచ్చే బాధలను చక్కగా తగ్గిస్తాయి.
ధనియాలలో పొటాషియం, ఇనుము, మాంగనీస్, కాల్షియం, జెరానియల్, విటమిన్లు A, B, C, K లు, కరిగే పీచు, సమృద్దిగా వుంటాయి. Tip: ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ ధనియాలను ముందురోజు రాత్రి నానబెట్టి ఉదయాన్ని వడకట్టి త్రాగవచ్చు.  ఒక స్పూన్ ధనియాలను ఒక గ్లాస్ నీటిలో టీ లాగ కాచి త్రాగవచ్చు.

దాల్చినచెక్క, (Chinnamon)


దాల్చినచెక్క:           ఆంగ్లం:   Cinnamon             హిందీ:  Dhalchini
1.       దాల్సినచెక్క 41 రకాల యాంటీ ఆక్షిడెంట్లు కలిగిన సుగంద ద్రవ్యంగా పేరెన్నికగన్నది.  యాంటీ ఆక్షిడెంట్ల క్రియాశీలతను సరిపోల్చగా 26 సుగంద ద్రవ్యాలలో  దాల్చినచెక్క ప్రదమ స్థానంలో ఉంది. దీనిలోని యాంటీ ఆక్షిడేంట్లు;  ప్రీ రాడికల్స్ మరియు ఆక్షిడేటివ్ స్ట్రెస్ల వలన శరీరంలో సంభవించగల ఎన్నో వ్యాదులను సునాయాసంగా నిరోధిస్తాయి.
2.       తాప నిరోధకశక్తి కలిగిన 7రకాల ప్లవనాయిడ్లు కలిగిన దాల్చినచెక్క గుండెజబ్బులను, కాన్సర్ ను, అల్జీమర్ వ్యాదులను నివారించడంలో అమోఘమైన శక్తి కలది. మరియు కీళ్ళజబ్బులలో, ఋతు సమయపు నొప్పులలో, ఎలార్జీల నొప్పులలో బాగా ఉపయోగపడుతుంది.
3.       దాల్చినచెక్కను  గుండెకు మంచి మిత్రునిగా చెప్పవచ్చు.  ఇది  అధికంగా ఉన్న చెడ్డ కొలెస్టరాల్(LDL)ను, అధికంగా ఉన్న ట్రై గ్లిజరైడ్ ను, అధిక రక్తపోటును తగ్గించటమే కాక, మంచి కొలెస్టరాల్(HDL) స్థాయులను నిలిపి ఉంచుతుంది.  రక్త స్రావాలు జరిగే సమయాలలో  సత్వరమే రక్తం గడ్డకట్టేట్లు చేస్తుంది. రక్తప్రసరణ సక్రమంగా అన్ని కణాలకు జరుగునట్లు చేసి, కణాల పునర్ నిర్మాణశక్తిని పెంచుతుంది.  గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
4.       దాల్చినచెక్క రక్తంలోని చక్కెరస్థాయులను నియమించటమే కాక, ఇన్సులిన్ హార్మోన్ స్రావాన్ని ఉత్తేజపరుస్తుంది. అంతేకాక రక్తంలోకి గ్లూకోజ్ ను అనుమతించే ఎంజైములను కట్టడిచేసి, మధుమేహంలో ఎంతో మేలు చేస్తుంది.
5.        అల్జీమర్, పార్కిన్సన్ వ్యాదులు తగ్గించటంలో దీనిలోని యాంటీ ఆక్సిడెంట్ లు పనిచెయ్యటమే కాక మెదడుయొక్క కణజాలాన్ని శక్తివంతం చేస్తుంది. యంగ్జైటీ, డిప్రెషన్ లను తగ్గిస్తుంది. దాల్చినచెక్క వాసన మరియు దానిలోని పొటాషియం మెదడు యొక్క కేంద్రీకరణ శక్తిని, ఆలోచనాశక్తిని వృద్ది చేస్తాయి.
6.       దీనిలోని Cinnamaldehyde అనే యాంటీ ఆక్షిడెంట్ కాన్సర్ కణాల అభివృద్దిని నిరోదించటమే కాక, ఆ కణాలు స్వయంగా ఆత్మాహుతి చేసుకునేలా వత్తిడి చేస్తుంది.  DNA లకు ఎటువంటి నష్టం కలుగకుండా చూస్తుంది.
7.       ఇది నోటిదుర్వాసనను, దంతవ్యాదులను, పిప్పిపళ్ళను, నోటికురుపులను నివారిస్తుంది. గొంతులోను, జీర్ణవాహికలోను పెరిగే  ఈస్ట్ ఎదుగుదలను నివారిస్తుంది. జీర్ణక్రియను వృద్దిచేసి, కడుపు ఉబ్బరాన్ని తొలగిస్తుంది. ప్రయాణంలో వచ్చే వికారాన్ని, వాంతులను తగ్గిస్తుంది. ఎక్కువగా వ్యాయామం చెయ్యటం వలన వచ్చిన వాపులను, నొప్పులను తగ్గిస్తుంది.
8.       దీనిలోని మెగ్నీషియం, కాల్షియం  ఎముకల దృడత్వాన్ని పెంచుతాయి
NB: లివరువ్యాదులు ఉన్నవారు, గర్భిణీలు  వాడరాదు.   మోతాదు రోజుకు పావు నుండి ఒక టీ స్పూన్ వాడుకోవచ్చు.  నెలమించి వాడకుండా ఉండటం మంచిది.

13, జులై 2018, శుక్రవారం

Health Tips - 1

                గర్భవతుల వాంతులు, వికారం  
> ఉదయాన్నే చిన్న అల్లం ముక్కను నమిలి మింగినా, ఒక కప్పు నీటిలో అల్లం ముక్క వేసి టీలా కాచి వేడిగా త్రాగినా
   వాంతులు నెమ్మదిస్తాయి.
> పది చుక్కలు నిమ్మరసం, అర స్పూన్ పంచదార, ఒక కప్పు నీటిలో కలపాలి. పావు స్పూన్ బేకింగ్ సోడా కలిపి
వెంటనే త్రాగితే వాంతులు,వికారం పోతాయి.
> రెండు యాలకి కాయలను నమిలి రసం మింగుతూ ఉంటే వికారం, వాంతులుతగ్గిపోతాయి. 
> రాత్రిపూట ఎండు ఖర్జూరాలను నీటిలో నానబెట్టి  మరుచటి రోజు  ఉదయాన్నే ఆ నీటిని త్రాగితే వేవిళ్ళు తగ్గుతాయి.
> ఉదయాన్నే మాదీఫలరసాయనం రెండు స్పూన్లు, నీళ్ళు కలిపి త్రాగితే వేవిళ్ళు పూర్తిగా తగ్గుతాయి.
                      బాలింతల క్షీరవృద్ధికి
> తమ ఆహారంలో క్యాబేజీని తరఛుగా తీసుకుంటే పాలిచ్చే తల్లులకు క్షీర వృద్ధి కలుగుతుంది.
> వామును కషాయం కాచి, రోజుకొకసారి  ఒక ఔన్స్ మోతాదు త్రాగితే చనుబాలు పెరుగుతాయి.  
> లవంగ చూర్ణంలో కొద్దిగా ఇంగువ పొడి కలిపి రెండు పూటలు తీసుకుంటే పాలు వృద్ధి అవుతాయి.
> బార్లీ గింజలు 5 గ్రాములు, పావు లీటరు పాలలో మెత్తగా ఉడికించి పంచదార చేర్చి త్రాగిన క్షీరవృద్ది.
> దోరగా ఉన్న బొప్పాయి కాయను కూర వండుకుని తింటే చనుబాలు వృద్ది అవుతాయి.
                     రక్తలేమి 
> ప్రతిరోజు రెండు పూటలా తేనె ఒక స్పూన్ తీసుకుంటే రక్తం వృద్ధి అవుతుంది.
> ప్రతిరోజు రెండు పూటలా పొదిన ఆకుల రసం మూడు స్పూన్లు తీసుకుంటే రక్తం వృద్ధి అవుతుంది.
> మునగాను తరచుగా వాడితే చక్కని రక్తం పడుతుంది. యవ్వనవంతులుగా ఉంచుతుంది.(గర్భిణీలు వాడరాదు)
> పాలకూరను ఆహారంగా తరచు వాడితే హిమోగ్లోబిన్, రక్తము వృద్ది చెందుతాయి.
                     కడుపు ఉబ్బరం, మంట  
> ఒక గ్లాస్ వేడినీటిలో ఒక నిమ్మకాయ రసం, చిటికెడు ఉప్పు వేసి, కలిపి త్రాగితే ఉబ్బరం తగ్గిపోతుంది.
> ఒక గ్లాస్ మజ్జిగలో ఒక స్పూన్ ధనియాలపొడి కలిపి త్రాగితే కడుపులో మంట తగ్గుతుంది.
> ఒక చిన్న అల్లం ముక్కను నమిలి రసం మింగిన కడుపులో మంట తగ్గుతుంది.
> చల్లటి పాలు ఒక గ్లాస్ తాగితే కడుపులో మంట, ఎసిడిటీ తగ్గిపోతాయి.
> ధనియాలు 1పాలు, గసాలు 1పాలు, పంచదార 2పాళ్ళు, కలిపి చూర్ణం చేసుకోవాలి.  ఈ చూర్ణం రెండు పూటలా
ఒక గ్లాస్ వేడినీటిలో కలిపి త్రాగితే, తలనొప్పి,తలతిరగటం పోతాయి.
> చిన్న అల్లము ముక్కను ఉప్పులో అద్ది, ప్రతిరోజు పరగడుపున తింటుంటే తలతిప్పు వ్యాధి తగ్గిపోతుంది.
> ఒక చిటికెడు కరివేపాకు చూర్ణం తేనెతో కలిపి పరగడుపున  తీసుకుంటే పైత్య సంబందమైన
 వికారం,  తలతిప్పు తగ్గుతాయి.
> టొమాటో, బీట్ రూట్, క్యారట్, ఆరెంజ్, జ్యూసులు సమంగా కలిపి ఒక ఔన్స్ మోతాదు ప్రతిరోజు ఉదయం
తీసుకుంటే మీ శరీరఛాయ పెరుగుతుంది. 
> ప్రతిరోజూ అర స్పూన్ మెంతులపోడిని తీసుకుంటే, ప్రసవానంతరం గర్భాశయాన్ని యదాస్థితికి తెస్తుంది.
పొట్టను తగ్గిస్తుంది.
> చిన్న ఇంగువ ముక్కను రోజూ తీసుకున్న గర్భాశయాన్ని, పొట్టను పూర్వస్థితికితెస్తుంది.
> జీలకర్రను నేతిలో వేయించి తగినంత ఉప్పు కలిపి రెండుపూటలా అన్నము  లేదా మజ్జిగతో చిటికెడు తింటే
 జీర్ణాశయ రోగాలు రావు. 
> వాము కషాయాన్ని తేనెతో రోజూ బాలింతలకు ఇస్తే గర్భాశయం కృశించుకుంటుంది. పాలు బాగా పడతాయి.
> స్నానానికి అరగంట ముందు, పసుపు కలిపిన కొబ్బరినూనె రాసినట్లయితే, చీరె కట్టిన చోట నల్లమచ్చలు పోతాయి.
> నీరుల్లిపాయను, క్యారట్ ను, గుండ్రంగా తరిగి, రోజూ తింటుంటే మీ స్వరం మధురంగా మారుతుంది.
> ఒక స్పూన్ వేప ఆకులపొడిని నీటిలో వేసుకుని స్నానం చేస్తే శరీరం నుండి దుర్గంధం రానివ్వదు.  చెమటను,
 చమటపొక్కులను, రానివ్వదు. 
> నీళ్ళ విరేచనాలు అవుతున్నప్పుడు, గసగసాలు, పంచదార ఒక్కొక్క స్పూన్ కలిపి మూడుపూటలు తింటే
కట్టుకుంటాయి.
> బెల్లం, జీలకర్ర సమంగా కలిపి నూరి, బటాణీగింజలంత గోలీలు చేసి మూడుపూటలా చప్పరిస్తే ఆకలిలేమి తగ్గుతుంది.
> కొతిమెర ఆకులతో టీ కాచి త్రాగినా, చెట్నీగా చేసుకుని తిన్నా, కండరాలు ముణగాలాగుకపొయ్యే వ్యాది
 (Cramps) నివారణ అవుతుంది. 
> Sore Throat: చిటికెడు ఉప్పు, రెండు చిటికెలు పసుపు వేసి కాచిన నీటితో రెండు పూటలా పుక్కిలించి ఉయ్యాలి.
> ఒక కప్పు పాలలో పావు స్పూన్ పసుపు వేసి కాచి, వేడిగా త్రాగితే గొంతువాపు తగ్గుతుంది.
> 5ml. తేనెను ఒక కప్పు వేడి నీటిలో కలిపి మూడు పూటలా త్రాగుతుంటే గొంతు వాపు, నొప్పి తగ్గుతాయి.
> ప్రతిరోజు ఉదయం దాల్చిన చెక్కను 3గ్రాముల మోతాదులో నమిలి తినుచుండిన మతిమరుపు తొలగిపోవును.
> మూడు పూటలు ఒక గ్లాస్ మజ్జిగ చొప్పున  త్రాగుచుండిన రక్త విరేచనాలు తగ్గిపోవును.
> అరికాళ్ళ మంటలు, తిమ్ముర్లు, నొప్పులు: నువ్వులనూనెను అరికాళ్ళకు బాగా మర్ధనచేస్తే తగ్గుతాయి.
> అల్లంరసంలో తేనె కలుపుకుని ఒక స్పూన్ మోతాదు త్రాగుతుంటే జలుబు, దగ్గు, కళ్ళేపడటం తగ్గుతాయి.