పేజీలు

2, జూన్ 2018, శనివారం

సోయాచిక్కుడు (Soyabean)


సోయా చిక్కుడు.
వృక్ష సంబంధ ప్రోటీన్ లభించే ఆహారపదార్ధాలలో సోయాబీన్ ప్రధమంలో ఉంటుంది. దీని కారణంగానే సోయాబీన్
మటన్ కు ప్రత్యామ్నాయంగా చెప్పబడుతూవుంది. ఈ సోయా ప్రోటీన్ గుండెజబ్బులను నివారించటంలో అందెవేసిన
చెయ్యి. మనం తినగలిగిన ఆహారపదార్ధాలలో ఐసోఫ్లావిన్స్ (Isoflavones) కలిగివున్న ఏకైక పదార్ధం సోయాబీన్.
Genistein, diadzein, glycitein అనే మూడు పైటోఈస్ట్రోజేన్ల కలగలుపు ఇది. Isoflavones కాన్సర్
లను, కొలెస్టరాల్, ఆస్టియోపొరోసిస్, మెనోఫాజ్ బాధలను, సమర్ధవంతంగా తగ్గిస్తుంది. దీనిలోని ఒమేగా-3 మరియు
ఒమేగా-6 ఫ్యాటీయాసిడ్స్ రక్తనాళాల గోడలను దృడంగాను, ప్లెగ్జిబుల్ గాను, ఉంచి రక్తపుగడ్డలు, రక్తస్రావాలు ఏర్పడ
కుండా చేసి గుండెజబ్బుల నుండి పూర్తిగా రక్షిస్తుంది. సోయాబీన్ పాలు నరాల సత్తువకు, కండరాల బలానికి అద్భుత
మైన టానిక్ లా పనిచేస్తుంది. కండరాల దిజార్దర్ను పోగొడుతుంది. మానసికంగా ఉద్రేకపడేవారికి, డిప్రెషన్ కు గురయ్యే
వారికి, మతిమరుపు వచ్చిన వారికి, సోయాలోని లెసితిన్ అద్భుతంగా పనిచేస్తుంది. దీనిలోని పైటోఈస్త్రోజేన్స్, విటమిన్
E వయోబారం వలన వచ్చే ముడతలు, నల్లమచ్చలు, కాంతి విహీనతలను నివారించి యవ్వనాన్ని నిలిపి ఉంచుతాయి.
దీనిలోని ఐరన్, జింక్ లు రక్తనాళాలను పెద్దవిగాచేసి అన్ని అవయవాలకు రక్తప్రసరణ ధారాళంగా జరిగేట్లు చూస్తాయి.
వినికిడి శక్తిని పెంచుతాయి. దీనిలో సమృద్ధిగాఉన్న పోలేట్ సెరిటోనిన్ తయారీని అధికంచేసి డిప్రెషన్ ను తొలగించి,
చలాకితనాన్నివృద్ధి చేస్తుంది. దీనిలో సమృద్ధిగా వున్న పొటాషియం BP నియంత్రణలో బాగా పనిచేస్తుంది
ఆరోగ్యవంతమైన శిరోజాల కుదుళ్ళకు వీనిలోని లైసీన్ ఆమ్లం ఉపకరిస్తుంది దీనిలోని పైటిక్ యాసిడ్ అనే యాంటీ
ఆక్షిడెంట్ కాన్సర్, గడ్డలు,మధుమేహం రాకుండా చూస్తుంది. దీనిలోని ఫైబర్ పొట్ట ఉబ్బరింపును, మలబద్ధకాన్ని
పోగొట్టటంలో సాటిలేనిది. దీనిలో 8 రకాల ఏమినోయాసిడ్స్, విటమిన్ B1, ప్రోటీన్, ఫాట్, కాల్షియం, ఫోలేట్,
విటమిన్ C చాలా ఎక్కువగా ఉంటాయి. NB: సోయాబీన్ పచ్చిగా వాడేప్పుడు అజీర్తిని కలిగిస్తుంది, కనుక
మితంగా వాడాలి. వేడిచేసి గింజల పై పొట్టును తీసివేసి వాడాలి. పిండిని రోజుకు 25 గ్రాములు మించకుండా వాడవచ్చు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి