పేజీలు

14, జూన్ 2018, గురువారం

జామపండు (Guava)


జామపండు. ఆంగ్లం: Guava. హిందీ: అమరూద్.
యాంటీ ఆక్సిడెంట్స్ కలిగిన పండ్లలో జామపండుది అగ్రస్థానం. పోషకాలరీత్యాను, ఆరోగ్యంకలిగించే విషయంలోనూ,
యాపిల్ పండు కంటే జామపండు ఎంతో మంచిది. చవకగా దొరికే అధ్బుతఫలంగా దీనిని చెప్పవచ్చు. టొమాటోల
కంటే రెండురెట్ల లైకోపిన్, ఆరంజెస్ కంటే నాలుగు రెట్ల C విటమిన్, పైనాపిల్ కన్నా మూడు రెట్ల ప్రోటీన్, జామ
పండ్లలో వుంటుంది. దీనిలోని లైకోపిన్, క్వెర్సిటిన్, విటమిన్ C, శరీర కణజాలంలోని ఫ్రీరాడికల్స్ ను సమర్ధవంతంగా
తొలగించి, కాన్సర్ కణాలు అభివృద్ధి కాకుండా చూస్తాయి. ఇవి ప్రోస్టేట్, లంగ్స్, పాంక్రియాస్, రెక్టం, కోలన్ లకు
వచ్చే కాన్సర్ వ్యాదులను నిరోధిస్తాయి. ఆరంజ్ కన్నా నాలుగు రెట్లు ఉన్న C విటమిన్, వ్యాధినిరోధక శక్తిని బాగా
పెంచి, వ్యాధులబారిన పడకుండా శరీరాన్ని రక్షిస్తుంది. ఇది ప్లూవ్యాధిలోను, స్కర్వి వ్యాధిలోను, డెంగ్యూ జ్వరంలోను,
బాగా సహాయపడుతుంది. మరియు జలుబు, వైరల్ ఇన్ఫెక్షన్ లను నిరోధించటంలోను, శ్వాస అవయవాలనుండి
శ్లేష్మం తొలగించటం లోను సహాయపడుతుంది. రెటినాల్ అనే A విటమిన్, కంటిచూపు దీర్ఘకాలం ఉండేట్లు గాను,
కాటరాక్ట్, మాక్యులర్ డీజనరేషన్ వ్యాధులు రాకుండాను చేస్తుంది. జామలో త్వరగా కరిగిపోయే రకం పీచు అధికంగా
వుంటుంది. ఈ పీచు రక్తంలోని షుగర్ స్థాయులను చక్కగా నియంత్రిస్తుంది. మధుమేహాన్ని దూరం చెయ్యగల,
మధుమేహ రోగులు తినగల పండు జామ. జీర్ణ అవయవాలను శుధ్ధిచేసి, మలబద్ధకాన్ని నివారిస్తుంది. మరియు
నీళ్ళ విరేచనాలను, ఊబకాయాన్ని, తగ్గిస్తుంది. జామలోని పొటాషియం, సోడియంలు, ఎలక్త్రోలైట్ల నిష్పత్తిని సరిచేసి
రక్తపోటును క్రమబద్దీకరిస్థాయి. ట్రై గ్లిజరైడ్స్ ను, చెడ్డ కొలెస్టరాల్ ను,తగ్గించి, మంచి కొలెస్టరాల్ ను, పెంచటం ద్వారా,
హృదయసంబంధ వ్యాధులను రానివ్వవు. అంతేకాక పొటాషియం కండరాలను వృద్ధిచేసి, అధికంగా వున్నా క్రొవ్వును
కరిగిస్తుంది. దీనీలోని నయసిన్ B3, పెరిడాక్సిన్ B6, మెదడుకు రక్తప్రసరణను పెంచి, తద్వారా నరాల క్రియాశీలతను,
బుద్ధి కేంద్రీకరణ శక్తిని పెంచుతాయి. మెగ్నీషియం కండరాల మరియు నరాల నొప్పులను దూరంచేసి, మంచి శక్తిని,
ప్రశాంతతను కలిగిస్తుంది. ఫోలిక్ యాసిడ్ (B9) జన్మించే పిల్లల్లో నాడీ సంబంధ వ్యాధులు రాకుండా నిరోధించి, మంచి
ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. 100 గ్రాముల జామపండులో 496 మిల్లిగ్రాముల ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరాన్ని నిత్య
యవ్వనంగా ఉంచుతాయి క్రిస్టోజాంతిన్ అనే యాంటీ ఆక్షిడేంట్ కణజాలాన్ని ఫ్రీ రాడికల్స్ దాడినుండి రక్షిస్తుంది.
లుటిన్ అనే యాంటీ ఆక్షిడేంట్ శుక్లాలను, ముసలితనంలో వచ్చే మోక్యులర్ డీజనరేషన్ వ్యాధులను నివారిస్తుంది.
విటమిన్ A, C, కెరటిన్, లైకోపిన్ లు, చర్మం మీద ముడతలు, మచ్చలు, కురుపులు,ఎర్రని దద్దుర్లు, రానివ్వవు.
చర్మంయొక్క స్థితిస్తాపకశక్తిని నిలిపి ఉంచుతాయి. విటమిన్ K కండ్లచుట్టూ నల్లని వలయాలు రాకుండాను, ముఖ
చర్మం బిగుతుగా ఉండేట్లుగాను, చేస్తుంది. శరీరం పోషకాలు అన్నింటిని గ్రహించేట్లు మాంగనీస్ చూస్తుంది. రాగి
థైరాయిడ్ గ్రంధి చక్కగా పనిచేయుటకు సహాయం చేస్తుంది. జామపండు నోటిలోని క్రిములను చంపివేసి,
చిగుళ్ళవాపు, కురుపులు, దుర్వాసన, పంటి నొప్పులను పూర్తిగా నివారిస్తుంది.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి