పేజీలు

31, మే 2018, గురువారం

పాలకూర


పాలకూర. ఆంగ్లం: Spinach . హిందీ: Palak .
పాలకూరలోని ఆల్ఫాలిపోయిక్ యాసిడ్ అనే యాంటీ ఆక్షిడేంట్ రక్తంలోని గ్లూకోజ్ స్థాయులను తగ్గించి, ఇన్సులిన్
స్రావాన్ని పెంచడంద్వారా మధుమేహాన్ని దూరంచేస్తుంది. మధుమేహరోగులలో నరాల వ్యగ్రతను కూడా నివారిస్తుంది.
దీనిలోఉండే ల్యుటీన్ అనే పోషకం చర్మానికి కావలచిన తేమను అందించటమే కాక ధమనులనుండి కొలెస్టరాల్ ను
తొలగించి, గుండెపోటు రాకుండా చూస్తుంది. దీనిలో అత్యధికంగా ఉండే ల్యుటీన్, జియోకాంతిన్ లు కేటరాక్ట్ మరియు
ముసలితనంలో వచ్చే మాక్యులర్ డీజనరేటివ్ వ్యాదులు కళ్ళకు రాకుండా కాపాడుతాయి. దీనిలోని క్లోరోఫిల్ మరియు
కెమోఫెరాల్ అనే యాంటీఆక్సిడెంట్, కాన్సర్ కారకాలైన కార్సినోజెన్స్ లను నిర్వీర్యం చెయ్యటం ద్వారా కాన్సర్ రాకుండా
చేస్థాయి. దీనిలో సమృద్ధిగా ఉన్న పొటాషియం కండరాలను వృద్ధి చేస్తుంది, క్రాంప్స్ రాకుండా నివారిస్తుంది, అధిక
రక్తపోటును సమర్ధవంతంగా నియంత్రిస్తుంది. పొటాషియం మెదడుకు రక్తప్రసరణను పెంచటం ద్వారా మెదడు ఆరోగ్యానికి,
చురుకుదనానికి, మరియు అల్జీమర్ వ్యాధి నిరోదానికి కుడా చక్కగా పనిచేస్తుంది. దీనిలోని యాంటీ ఆక్సి డెంట్స్
పొటాషియంతో కలిసి మానసిక కేంద్రీకరణ శక్తిని, గ్రాహ్యతను, పనితీరును, వృద్ధి చేస్తాయి. ఇనుము ఎర్రరక్తకణాలను
తయారు చేస్తూ, జుట్టు రాలకుండా రక్షిస్తుంది. చర్మం అందానికి, ఆరోగ్యానికి పాలకూరను మించింది లేదు. దీంట్లోని
A విటమిన్ చర్మం, శిరోజాలు, ఇతరకణాల రూపురేకలను, తరళత్వాన్ని వృద్దిచేసి, సొగసు నిస్తాయి. C విటమిన్
మొటిమలు, ముడతలు, లేకుండా చర్మము మృదువుగా మెరిచేట్లు చేస్థాయి. సమృద్ధిగా ఉన్న విటమిన్ K
శరీరానికి కాల్షియం వంటపట్టునట్లు చేసి ఎముకలను ఆరోగ్యంగా ఉంచటమేకాక, ఎముకలు విరిగే ప్రమాదం లేకుండా
చేస్తుంది. దీనిలోని B కాంప్లెక్స్ విటమిన్లు గర్భిణీలలో న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ రాకుండా చూస్తాయి. గుండె, నరాలు,
కండరాలు ఆరోగ్యంగా పనిచేసేటట్లు దీనిలోని మెగ్నీషియం చూస్తుంది. పాలకూరకు కండరాలను దృడంగా మార్చే శక్తి
ఉంది. దీనిలోని బీటా కెరటేన్ ఆస్మా రాకుండా రక్షించటమే కాక, A విటమిన్ తయారీకి సహాయపడుతుంది. ఫైబర్
మలబద్దకం రాకుండా నివారిస్తాయి. 100 గ్రాముల పాలకూర లో 194 మైక్రోగ్రాముల పోలేట్ లభిస్తుంది. పోలేట్
హైపర్ టెన్షన్, అల్జీమర్ వ్యాధులను పూర్తిగా నిరోధిస్తుంది. NB: రక్తం పలుచన చేసే మందులు వాడేవారు,
కిడ్నీ వ్యాదులు, గాల్ బ్లాడర్ వ్యాదులు కలవారు పాలకూరను వాడరాదు.

1 కామెంట్‌: