పేజీలు

25, మే 2018, శుక్రవారం

అత్తిపండు (Fig)


అత్తిపండు: ఆంగ్లం: Fig హిందీ: Anjeer వృక్ష నామం : Ficus Carrica
వీటిలో పొటాషియం(680 mg) ఎక్కువ, సోడియం(10 mg) తక్కువ కనుక అధిక రక్తపోటు తో భాధపడే వారికి
ఇది పర్ఫెక్ట్ ఫ్రూట్. దీనిలోని ఫినాల్ మరియు ఒమేగా-6 ప్యాటీ ఆమ్లాలు గుండె జబ్బులు రాకుండా నిరోదిస్థాయి.
కాల్షియం పీచు రూపంలో ఉండేది అత్తి పండులో మాత్రమె! కాల్షియం.ఎముకల వృద్ధికి, పుష్టికి దోహదం చేస్తుంది.
వీనిలోని ల్యుటేయేలిన్ అనే ప్లవనాయిడ్ రొమ్ము క్యాన్సర్, కోలన్ కేన్సర్, బ్రెయిన్ కాన్సర్, కాలేయ కాన్సర్, చర్మ
కాన్సర్ ల నివారణకి గణనీయంగా పనిచేస్తుంది. అత్తిపండ్లు హైపర్టెన్షన్ ను కంట్రోల్ చేస్తాయి. శారీరక, మానసిక,
లైంగిక బలహీనతలను తగ్గిస్తాయి. దీనిలోని పెక్టిన్ అనే సెల్యులోజ్ కొలెస్టరాల్ ను తగ్గిస్తుంది, మలబద్ధకాన్ని తొలగిస్తుంది.
ఇందులోని జిగురు గొంతులోని నొప్పిని, పుండ్లను తగ్గిస్తుంది. గొంతు నొప్పికి వీనిని నీటిలో నానబెట్టి తేనెతో కలిపి
తీసుకోవాలి. శ్వాసమార్గంలో కఫం పేరుకు పోయి గాలి పీల్చడం కష్టం అయినవారు వీనిని వాడితే కఫం తెగి శ్వాస
దారాళంగా ఆడుతుంది. ఇందులోని ట్రిప్టోఫాన్ హాయిగా నిద్ర పట్టేలా చేస్తుంది. ఏ వ్యాధితో బాధపడుతున్నా వీనిని తీసు
కుంటే శరీరానికి అవసరమైన శక్తిని వేగంగా పొందుతారు. పాలతో కలిపి తీసు కుంటే రక్తం బాగా పట్టేట్లు చేయడ మేకాక,
గర్భిణీలకు గర్భస్రావం జరగ నివ్వదు. వీని గింజలు పురుషుల్లో శుక్రకణాలసంఖ్యను, సంతాన సామర్ధ్యాన్ని పెంచుతాయి.
పురుషులు మూడు పండ్లను వెన్నతో కలిపి తీసుకుంటే వీటి శక్తి ఇనుమడిస్తుంది. దీని ఆకులు ట్రై గ్లిజరైడ్స్ స్థాయిని,
ఇన్సులిన్ మోతాదును తగ్గించడంలో పని చేస్తాయి. NB: మూత్రపిండ సమస్యలు ఉన్న వారు వీనిని తినరాదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి