పేజీలు

26, మే 2018, శనివారం

అవిసె గింజలు (Flax Seeds)


అవిసె గింజలు: ఆంగ్లం: Flax seeds , Linseed. హిందీ: Alsi
అవిసె గింజల్లో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, పీచు, లిగ్నాన్స్, ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ ఆమ్లాలు,
యాంటీ ఆక్షిడేంట్లు, Bవిటమిన్లు ( B1, B2, B3, B5, B6, B9) సమృద్ధిగా ఉంటాయి. కార్బోహైడ్రేట్లు చాలా
తక్కువ. చేపల తర్వాత ఒమేగా-3 వీనిలోనే అధికం. ఒమేగా-3 (ఆల్ఫాలినోలిక్ యాసిడ్) మధుమేహం రాకుండా
చెయ్యటమే కాక కీళ్ళనొప్పులు, ఆర్ధరైటిస్ వంటి వ్యాదులలో మేలు చేస్తుంది. వీనిలోని ఫ్యాటీ యాసిడ్స్ ఎమర్జన్సీగా
పనిచేసి డిప్రెషన్ ను కూడా సమర్దవంతముగా నివారిస్తాయి. వీటిలోని ఒమేగా ప్యాటి యాసిడ్స్ ధమనుల్లో రక్తం
గడ్డకట్టకుండా చూడటమేకాక, గుండెజబ్బులను, అనేక క్యాన్సర్ లను,నిరోధిస్తాయి. మరియు మొటిమలు,ఎలర్జీలు,
దురదలు లాంటి చర్మ వ్యాధులను నిరోదించి చర్మము మృదువుగాను, మంచి రంగుతో ఆరోగ్యవంతంగాను, ఉండేట్లు
పనిచేస్తాయి. వీనిలో అధికంగా ఉండే పీచు పేగుల్లోని విషపదార్ధాలను తొలగించి, ఆరోగ్యకరమైన బాక్టీరియా పెరిగేలా
చేస్తుంది, మలబద్దకాన్నితొలగిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారికి వీటిని మించిన ఆహారం లేదు. మానవ ఆహార
పదార్దాలలోనే అధిక మోతాదులో లిగ్నాన్స్ కలిగిఉన్న అవిసెలు మహిళల్లో హార్మోనుల అసమతుల్యతను సరిచేస్తాయి.
వీనిలోని మినరల్స్ జుట్టు పొడిబారటం, చిట్లటం, చుండ్రులను నిరోదించి, ఛిక్కని శిరోజాలను వృద్ధిచేస్తాయి. అవిసె
గింజలు హైపర్ టెన్షన్, కాలేయవ్యాధులను తగ్గిస్తాయి. శరీరంలో వేడిని పుట్టిస్తాయి. మెదడుకు శక్తిని పెంచుతాయి.
మెనోపాజ్ మహిళల్లో వేడిఆవిర్లను తగ్గిస్తాయి. ఎముకల పెళుసును తగ్గించి వాటి సాంద్రతను పెంచుతాయి.
Tip: వీటిని పిండి రూపంలో వాడితేనే ప్రయోజనం ఎక్కువ. ఒక స్పూన్ మోతాదు మించకుండా వాడాలి.
NB: అవిసె నూనెను అధికంగా వేడిచేసి వాడకూడదు. 100 గ్రాములలో పోషకాలు: పొటాషియం-813 mg.
మెగ్నీషియం-392 mg. కాల్షియం-255 mg. పీచు-27 g. E విటమిన్-20 mg. పోలేట్-87 mcg.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి