పేజీలు

24, మే 2018, గురువారం

బార్లీ బియ్యం


బార్లీ బియ్యం. ఆంగ్లం: Barley . హిందీ: జౌ (Jow)
బార్లీ గింజలలోని కాల్షియం, పాస్పరస్, ఎముకలకు గట్టితనాన్ని, మెరుపును, మంచిఆరోగ్యాన్ని ఇస్తాయి.
నియాసిన్, విటమిన్ B కాంప్లెక్స్ రక్తనాళాలు పూడిపోకుండా చేసి, గుండెజబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
బీటా-గ్లూకాన్ అనే పీచు పదార్ధం దీనిలో చాలా ఎక్కువగా ఉండటమే కాక, ప్రోసెస్ చేసినా చెక్కు చెదరక
పోవటం ఒక విశేషం. ఇది చెడుకొలెస్టరాల్ తయారీని 17% తగ్గించటమే కాక, రక్తంలో చెక్కెర, ఇన్సులిన్
స్థాయులను తగ్గిస్తుంది. ఈ ఫైబర్ పెద్దప్రేవులు, కండరాలు, కాలేయంల కణాలకు అవసరమయ్యే ఆహారపు
తయారీకి సహకరిస్తుంది. మరియు మలవిసర్జనను సజావుగా జరిపి కోలన్ కాన్సర్, రక్త మొలలు, గుండె
జబ్బులు రాకుండా నిరోదిస్తుంది. దీనిలోని కరగని పీచు బైల్ యాసిడ్స్ తయారీని తగ్గించటం ద్వారా గాల్
బ్లాడర్లో స్టోన్స్ ను రానివ్వదు. దీనిలోని కాపర్ ఎముకలు, కీళ్ళు, రక్తనాళాలు, పెళుసుబారకుండా చేసి
ప్లెక్షిబిలిటీని కాపాడుతుంది. దీనిలోని అధిక మెగ్నీషియం గ్లూకోజ్, ఇన్సులిన్లను తయారుచేసే ఎంజైమ్లకు
సహకరించి మధుమేహం రాకుండా కాపాడుతుంది. దీనిలోని ఫాస్పరస్ కణాల మరియు నాడీవ్యవస్థ రూపురేకల్ని
నిర్మించి, నిర్వహిస్తుంది. దీనిలోని సెలీనియం, చర్మపు సాగేగుణాన్ని నిలిపి ఉంచి ముసలితనం త్వరగా
రాకుండా కాపాడటమే కాక వ్యాధుల వల్ల దెబ్బతిన్న కణాలను పునర్ నిర్మాణం చేస్తుంది. దీనిలోని లిగ్నాన్స్
అనే పైటోన్యూట్రియాంట్ గుండెజబ్బులు, కాన్సర్ లు రాకుండా నిరోదిస్తుంది. బార్లీ ఎండా కాలంలో దాహార్తిని
పోగొట్టి, శరీరానికి చల్లదనాన్ని కలిగిస్తుంది. బార్లీ మూత్రాన్ని జారీ చేయటం ద్వారా మూత్రనాళపు వ్యాధులను
తగ్గిస్తుంది. బార్లీ గర్భిణీలలో వేవిళ్ళు, మలబద్ధకం, మధుమేహం, తలత్రిప్పు, ఎనీమియా, గాల్ స్టోన్స్,
లాంటివి రాకుండా నిరోదించి, పిండాన్ని రక్షిస్తుంది. NB: గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్నవారు వాడవద్దు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి