పేజీలు

23, మే 2018, బుధవారం

వెన్నపండు (Avacado)


వెన్నపండు. ఆంగ్లం: Avacado, Alligator Pear, హిందీ: మక్కన్ ఫల్
చూడ్డానికి గర్భాశయంలా కనిపించే ఈ పండు 14 వేల పోటోలిటిక్ రసాయనాల సమ్మేళనం.
గర్భం పొందదలిచినవారు, గర్భిణీలు తప్పక తినవలచిన పండు వెన్నపండు. దీనిలో పుష్కలంగా
పొటాషియం, కరిగే పీచు, పోలేట్ (B9), విటమిన్లు C, K, E ఉంటాయి. పెరిడాక్షిన్ (B6),
పాంటోథేనిక్ యాసిడ్(B5), రిభోప్లావిన్ (B2), నియాసిన్ (B3), లతోపాటు 18 రకాల అమైనో
యాసిడ్స్ ఉంటాయి. 30 గ్రాముల అన్శాచ్యురేటేడ్ ఫాట్, 4 గ్రాముల శాచ్యు రేటేడ్ ఫాట్,
కెరోటినాయిడ్స్ లభిస్తాయి. దీనిలోని పోలేట్ గర్భిణి స్త్రీలలో డిప్రెషన్, నిద్రలేమి, రక్తహీనత, రాకుండా
చెయ్యటమే కాక, జన్మించే బిడ్డకు ‘న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్’ రానివ్వదు. దీనిలోని ఒలేయిక్ యాసిడ్,
మోనోశాచ్యు రేటేడ్ ప్యాట్లు, చెడు కొలెస్టరాల్ ను తగ్గించి, మంచి కొలెస్టరాల్ ను పెంచి గుండె జబ్బులను
రానివ్వవు. దీనిలోని లుటీన్, జియాక్లాంధిన్ లు కళ్ళకు అంధత్వము, శుక్లాలు రాకుండా చేసి, మంచి
ఆరోగ్యాన్ని కలుగజేస్తాయి. దీనిలోని B6 గర్భిణీల్లో వచ్చే వికారాన్ని తగ్గిస్తుంది. దీనిలోని కోలైన్ బిడ్డల
మెదడును, నరాల వ్యవస్థను అభివృద్ధి చేస్తుంది. దీనిలోని పొటాషియం కాళ్ళనరాలు ముణగలాగుక
పోవటాన్ని తగ్గిస్తుంది. దీనిలోని ఒమెగా-3, అల్జీమర్ వ్యాధిని త్రిప్పికొడుతుంది. ఈపండు నోటి దుర్వాసనను,
నాలుక మీద పాచి పట్టటాన్ని తొలగిస్తుంది. తల్లిలో తయారయ్యే పాలను ఆరోగ్యవంతంగా తీర్చి దిద్దుతుంది.
జీర్ణాశయంలోను, చిన్నప్రేవుల లోను, మంట రాకుండా చేస్తుంది. ఈ పండు పోషక శక్తిని ఇవ్వటమే కాక,
ఇతర పదార్దాలలోని పోషకాలు వంటపట్టునట్లు చేసే అమోఘశక్తి 5 రెట్లు కలిగి వుంది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి