పేజీలు

22, మే 2018, మంగళవారం

బాదం గింజలు


బాదం గింజలు. ఆంగ్లం: Almonds. హిందీ: బాదాం.
బాదం గింజల్లో పొటాషియం, మెగ్నీషియం, మాంగనీసు, కాల్షియం,ఫాస్పరస్, రాగి, B & E విటమిన్లు, పోలేట్
పుష్కలంగా లభిస్తాయి. బాదం గింజల్లోని మోనోఅన్శాచ్యురేటేడ్ ప్యాటీ యాసిడ్స్, మరియు యాంటీ ఆక్సిడెంట్స్ గుండె
జబ్బులు రాకుండా అత్యుత్తమ రక్షణ నిస్తాయి.వీనిలోని E విటమిన్, మాంగనీస్, మెగ్నీషియం, ఆర్గినైన్ లాంటి
కీలక పోషకాలు చెడ్డ కొలెస్టరాల్ను తగ్గించడమే కాక నిలకడగా ఉంచుతాయి. మెదడుకు అత్యుత్తమ ఆహారంగా
చెప్పబడ్డ వీనిలోని రిబోఫ్లావిన్, ఎల్కార్నిటైన్ లు మెదడు లో సంభవించే చిత్త వైకల్యము, ఆల్జీమర్ వ్యాదులను
సమర్దవంతముగా నిరోధిస్తాయి. బాదంగింజలు గర్బిణులు తప్పక తీసుకోదగిన ఆహారం. వీనిలోని ఫోలిక్ యాసిడ్,
నవజాత శిశువులకు “బర్త్ డిఫెక్ట్స్” రాకుండా చేస్తుంది. ఇది పిండం పెరుగుదలకు, పిండం యొక్క ఆరోగ్యకర కణజాల
నిర్మాణానికి దోహద పడుతుంది. ప్రసవం తర్వాత తల్లికి పూర్వఆకృతి ఏర్పడటానికి సహాయ పడుతుంది. బాదంలోని
యాంటీ ఆక్సి డెంట్స్, విటమిన్ E లు చర్మాన్ని కాన్సర్ నుండి ఇతర చర్మ వ్యాదులనుండి రక్షిస్తాయి. చర్మం మీద
ముడతలు, బ్లాక్ హెడ్స్, కళ్ళక్రింద నల్లటి వలయాలు రానివ్వవు. బాదం గింజలకు బరువును తగ్గించటమే కాక
కండరాలను దృడంగా మార్చే శక్తి ఉంది. బలమైన ఎముకలను, దంతాలను కూడా నిర్మిస్తాయి. ఇందులోని జింక్ ఇతర
లవణాలు జుట్టు పొడిబారకుండా, తెల్లబడకుండా, చిట్లిపోకుండా,రాలిపోకుండా, ఎప్పటికి చుండ్రురాకుండా చేస్తాయి. బాదం
గింజ ల్లోని జింక్, విటమిన్ B12, ఒత్తిడిని తగ్గించి, భావోద్వేగాల్ని నియంత్రించుకునే సామర్ధ్యాన్ని పెంచుతాయి.
Tip: యాంటీ ఆక్సిడెంట్స్ బాదంగింజల పైపోలుసులోనే కేంద్రీకరించి వుంటాయి కనుక వానిని పోలుసుతోనే తినటం మంచిది.
వృక్షనామం:Prunus Dulcis.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి