పేజీలు

27, మే 2018, ఆదివారం

వెల్లుల్లి (Garlic)


వెల్లుల్లి. ఆంగ్లం: Garlic . హిందీ: లశున్.
విటమిన్-సి, B6, మాంగనీస్, పొటాషియం దీనిలో సమృద్ధిగా దొరుకుతాయి. వెల్లుల్లిలోని తియోసల్ఫినైట్ కాంపౌండ్స్
యాంటీ బయాటిక్స్ కన్నా వందరెట్లు శక్తివంతమైనవి. ఇవి ఎల్లిసిన్ (allisin)గా మారటం ద్వారా రక్తనాళాలను
వ్యాకోశింపజేసి చేసి రక్తప్రసరణను సులభం చేస్తుంది. రక్తం రక్తనాళాలలో గడ్డకట్టకుండా చూస్తుంది. చెడు కొలెస్టరాల్
తయారీని తగ్గించడమే కాదు, రోగనిరోధకశక్తిని పెంచుతుంది. రోజుకి నాలుగు గబ్బాలు పచ్చిగా తిన్నట్లయితే కాన్సర్,
మధుమేహం, గుండెజబ్బులు రాకుండా కాపాడుతుంది. దీనిలోని యాంటీ ఆక్షిడేంట్స్, ప్రీరాడికల్స్ ను బయటకునెట్టి,
చర్మము ముడతలు పడకుండా, ముసలితనం త్వరగా రాకుండా చేస్తుంది. తీసుకున్న ఆహారం వంటికి పట్టునట్లు చేసి
శరీరానికి మంచి ఆకృతిని కలగచేస్తుంది. దీనిలోని కాల్షియం, విటమిన్ K, ఎముకలను దృడంగా తయారు చేస్తాయి.
దీనిలోని కుకుర్బిటాసియన్స్, లిగ్నాన్స్ గుండెజబ్బులను, కాన్సర్ కణాల తయారీని అడ్డుకుంటాయి. దీనిలోని B1,B5,
B7 విటమిన్లు మానసిక వత్తిడిని నివారిస్తాయి. దీనిలోని ఫిసెటిన్ అనే ఫ్లవనాయిడ్ జ్ఞాపకశక్తిని, నేర్చుకునే శక్తిని,
పెంచుతుంది. మెదడుకు సమాచారాన్ని చేరవేసే నరాల ఆరోగ్యాన్ని కాపాడటంలో, మెదడులో కణాల విధ్వంసాన్ని
అడ్డుకోవటంలో, వెల్లుల్లి అందె వేసిన చేయి. అల్జీమర్ వ్యాధి వచ్చే ముప్పును తగ్గిస్తుంది. నోటి దుర్వాసన కలిగించే
క్రిములను నాశనం చేస్తుంది. ఆరోగ్యకర తెల్లకణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది. దీనిని ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్ అంటారు.
ఇవి ఊబకాయాన్ని తగ్గిస్తాయి. Tip: మూడు గబ్బాలను నలగగొట్టి పది నిముషాల తర్వాత టీ స్పూన్ తేనెతో
పరగడుపున తీసుకుంటే మంచిది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి