పేజీలు

29, మే 2018, మంగళవారం

వేరుశనగ గింజలు


వేరుశనగ గింజలు. ఆంగ్లం: Peanuts. హిందీ: Moong Phali.
వేరుశనగ పప్పుల్లో ప్రోటీన్, పాస్పరస్, నియాసిన్, బయోటిన్, థైమీన్, లతో పాటు 13 రకాల విటమిన్లు,
26 రకాల ఖనిజలవణాలు ఉన్నాయి. వీనిలోని రిజవెరాట్రాల్ గుండెజబ్బులు నుండి, క్యాన్సర్ల నుండి, అల్జీమర్స్
వ్యాధినుండి రక్షణ కల్పించి, నిత్యయవ్వనంతో ఉండేలా చేస్తుంది. రోజూ ఒక గుప్పెడు పల్లీలు తినటం ద్వారా పై
వ్యాదులు ధరిచేరకుండా చెయ్యవచ్చు. వారానికి ఒక ఔన్స్ పల్లీలు తిన్న మహిళల్లో గాల్ స్టోన్స్ ఏర్పడే ప్రమాదం
25% తగ్గినట్లు ఒక అధ్యయనం. వీనిలో అత్యధికంగా ఉన్న బీటాసిస్టేరాల్ శరీరంలో కణుతులు, కాన్సర్ గడ్డలు
ఏర్పడకుండా నిరోధిస్తుంది. బెల్లంతో కలిపి తింటే, ఋతుసమయాల్లో అధిక రక్తస్రావంతో బాధపడేవారికి మంచి
శక్తిని, రోగనిరోధకశక్తిని ఇస్తాయి. వీనిలో సమృద్ధిగా ఉండే ఓలిక్ యాసిడ్ (ఒమేగా-9) మెదడును చురుకుగా
ఉంచుతుంది. వీటిలోని నయసిన్ (B3) జ్ఞాపకశక్తిని వృద్ధిచేస్తుంది. గుండెకు మేలుచేసే మోనో అన్ శాచ్యురేటేడ్
క్రొవ్వులు,ఒలేయిక్ యాసిడ్ ఎక్కువ. ఇవి గర్భినులకు, పాలిచ్చేతల్లులకు కూడా ఎంతో మంచివి. పుట్టబోయే
పాపాయిలలో నాడీసంబంద వ్యాదులను నిరోదిస్తాయి. యాంటీ ఆక్షిడేంట్లు, బ్లాక్ బెర్రీ, స్ట్రాబెర్రీ, క్యారట్, బీట్రూట్
లలో కన్నా వేయించిన పల్లీలలో చాలా ఎక్కువ. వీనిలోని బయోటిన్ శిరోజాలు చివరలు చిట్లిపోకుండా,
రాలిపోకుండా రక్షణగా నిలుస్తుంది. వీటిలోని నియాసిన్ మరియు ఐరన్ జుట్టు రాలకుండా, నెరవకుండా
సహాయపడుతాయి. వీనిలోని ఆర్గినైన్ పురుషులలో బట్టతల రాకుండా పని చేస్తుంది. పని తీవ్రత, మానసిక
వత్తిడి వలన వెంట్రుకలు తెల్లబడే వారికి వేరుశనగలు మంచి ఆహారం. వీనిలోని ట్రిప్టోఫాన్ – సెరిటోనిన్ ను
విడుదల చెయ్యటం ద్వారా డిప్రెషన్ ను సమర్ధవంతంగా నిరోదించగలదు. ఒమేగా3 వెంట్రుకల కుదుళ్ళుబలంగా
ఉండేట్లు, జుట్టు వత్తుగా పెరిగేట్లు చేస్తాయి. C&E విటమిన్లు చర్మంమీద ముడతలు రాకుండా చూస్తాయి.
పల్లీలు ముక్కు నుంచి రక్తం కారటాన్నిఆపుతాయి.  Tip:  దీని పొట్టులో రిజవెరాట్రాల్ అధికంగా ఉంటుంది.  కనుక
వీనిని పొట్టు తీసివెయ్యకుండా తినటం మంచిది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి