పేజీలు

28, మే 2018, సోమవారం

ఆక్రోట్ (Walnut)


ఆక్రోట్. ఆంగ్లం: వాల్ నట్. హిందీ: ఆక్రోట్.
మెదడు ఆకారంలో ఉండే వాల్నట్లు జ్ఞాపకశక్తిని అభివృద్ధి పరచడంలో ముందు ఉంటాయి. మతిమరుపుకు చెక్ పెట్టి,
మెదడు పనితీరు చురుగ్గా ఉండేట్లు చేస్తాయి. దీనిలోని సిల్వర్ ఆయాన్లు మెదడు కణజాలానికి, మెదడు ఆరోగ్యానికి
అత్యంత అవసరం. గుండె ఆరోగ్యానికి మరియు ఎముకలకు మేలుచేసే ఆల్ఫిలినోలినిక్ యాసిడ్,ఒమేగా3 ప్యాటీ యాసిడ్,
గామా టోకోఫెరాల్, దీనిలో పుష్కలంగా ఉన్నాయి. ఇవి మంచి కొలెస్టరాల్ ను పెంచి, చెడు కొలెస్టరాల్ ను తగ్గించి,
గుండె నాళాల్లో అడ్డంకులు లేకుండా, గుండె జబ్బులు రాకుండా చూస్తాయి. ప్రతిరోజూ నాలుగు ఆక్రోటు పప్పుల్నితిన్న
మహిళల్లో బ్రెస్ట్ కాన్సర్ మరియు పిత్తాశయంలో రాళ్ళు పెరిగే ప్రమాదం 28శాతం తగ్గినట్లు తేలింది. ఆక్రోట్స్ చక్కటి
నిద్రను కలిగిస్తాయి. వీనిలోని ఫైబర్ ఊబకాయం రాకుండా చేస్తుంది. వీటిలోని పైటో స్టిరాల్స్, పాలిఫినాల్స్, క్యాన్సర్
కణుతుల ఎదుగుదలను అడ్డుకుంటాయి. దీనిలోని బయోటిన్ పదార్ధం జుట్టుకు చెందిన అన్నిసమస్యలను నివారించి,
శిరోజాలు పట్టు కుచ్చులా, పొడవుగా పెరిగేట్లు చేస్తుంది. దీనిలోని రాగి మరియు E విటమిన్, చర్మపు వృద్ధాప్య
లక్షణాలను, ముడతలను తగ్గించి, చర్మానికి సాగే గుణాన్ని, నిగారింపుని ఇస్తాయి. వాల్నట్ నూనెకు తీవ్రమైన
ఒత్తిడిని తక్షణం నివారించే గుణం ఉంది. శరీరంలోని ట్రై గ్లిజరైడ్లని నియంత్రించడానికి, రక్తప్రసరణ సాఫీగా జరగడానికి
సాయపడతాయి. వీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు జీవక్రియలను వేగవంతం చేసి, అల్జీమర్స్ వ్యాధిని నిరోధిస్తాయి.
డ్రై ఫ్రూట్స్ అన్నింటిలో వాల్ నట్స్ లోనే అత్యధిక యాంటీ ఆక్సిడెంట్ సుగుణాలున్నాయి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి