పేజీలు

30, మే 2018, బుధవారం

గుమ్మడి గింజలు


గుమ్మడి గింజలు. ఆంగ్లం: Pumpkin Seeds. హిందీ: Kaddu Beej.
గుమ్మడి గింజల్లో మాంగనీస్, ఫాస్పరస్, పొటాషియం, మెగ్నీషియం, క్రొవ్వు, ఒమేగా-3, E,K,A, విటమిన్లు,
పైటో స్టెరాల్స్, జింక్, పైటో న్యూట్రియాంట్స్, ఐరన్, లభిస్తాయి. దీనిలో పుష్కలంగా వుండే ఒలేయిక్ యాసిడ్
(ఒమేగా-9) చెడ్డ కొలెస్టరాల్ LDLను తగ్గించి, మంచి కొలెస్టరాల్ HDL ను పెచుతుంది. దీని లోని ట్రిప్టోఫాన్ అనే
ఎమినోయాసిడ్ సెరిటోనిన్, నియాసిన్ లుగా మార్పుచెందుతుంది. సెరిటోనిన్ మంచినిద్రను, మానసిక ప్రశాంతతను
కలిగింఛి, డిప్రెషన్ ను తొలగించే న్యూరోకెమికల్. నియసిన్ కొలెస్టరాల్ స్థాయులను నియంత్రిస్తుంది. దీనిలో అత్యదిక
మోతాదులో ఉన్న E విటమిన్ ప్రీరాడికల్స్ ను సమర్దవంతముగా నిరోదించి చర్మాన్ని, శరీరాన్ని రక్షిస్తుంది. దీనిలోని
గ్లుటామేట్, గామాఎమినో బుటెరిక్ యాసిడ్ సంయోగంతో మానసిక మరియు నరాల వ్యగ్రతలను నివారిస్తుంది. దీనిలోని
B కాంప్లెక్స్ విటమిన్లు శరీర కణజాలం యొక్క క్రియలను సజావుగా నడుపుతాయి. దీనిలోని జింక్ తలలో చుండ్రును
ఎప్పటికి రానివ్వకుండా చెయ్యటమే కాక, జుట్టును పోడిబారనివ్వదు. అంతేకాక జింక్ ఎముక పుష్టిని, పంచేంద్రియాల
గ్రహణ శక్తులను, కంటి ఆరోగ్యాన్ని వృద్ధిచేస్తుంది. దీనిలోని క్లోరోఫిల్ జీర్ణాశయంలోను, రక్తంలోను క్షారస్థితి ని పెంపొం
దించటం ద్వారా శరీరంలోని అన్ని మలినాలను తొలగిస్తుంది. మన ఆహార పదార్ధాలలో క్షారస్తితిని కలిగించగలిగే ఏకైక
పదార్దం ఇది. వీటిలోని పైటోన్యూట్రియంట్స్ మదుమేహరోగులలో కిడ్నీలలోరాళ్ళు, మరియు ప్రోస్టేట్ కాన్సర్ రాకుండా
సమర్ధవంతంగా నిరోధిస్తాయి అని ఒక పరిశోధన. దీనిలోని మెగ్నీషియం తలనొప్పి, నిద్రలేమి, నిస్సత్తువ, అశాంతి
మలబద్దకం, గుండెజబ్బులను, నివారిస్తుంది. థైరాయిడ్ రాకుండా గుమ్మడి విత్తులు రక్షిస్తాయి. జీర్ణాశయము,
ప్రేగులలోని పరాన్నజీవులను, సూక్ష్మక్రిములను, తొలగిస్థాయి. 100 గ్రాముల గుమ్మడి గింజల్లో మాంగనీస్-
4543 mg. కాపర్-1343 mg. ఫాస్ఫరస్ –1233 mg. పొటాషియం –809 mg. మెగ్నీషియం – 592 mg.
ఫైబర్ – 6 g. కాల్షియం – 46 mg. E విటమిన్–35mg. పోలేట్–58mcg. లబిస్తాయి.

2 కామెంట్‌లు: