పేజీలు

31, డిసెంబర్ 2018, సోమవారం

వాము, ఓమము


వాము,  ఓమము               ఆంగ్లం:  Carom Seeds,  Thymol Seeds      హిందీ:  అజవాయిన్
1. వాము అజీర్తిని, అరుచిని తగ్గించటంలో అమోఘమైనది.  ఇది జీర్ణాశయంలోని స్రావాలను క్రమబద్దీకరించటం ద్వారా జీర్ణశక్తిని వృద్ది చేస్తుంది.  ఇది ప్రేగులలో గ్యాస్ ను, ఉబ్బరాన్ని తగ్గించి, బందించిన మలాన్ని సులభంగా జారీ చేస్తుంది.  పొత్తికడుపులో అత్యధికంగా వాయువు బంధించటం ద్వారా కలిగే  కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం లను వాము సునాయాసంగా తగ్గిస్తుంది. దీనికి ఒక టీస్పూన్ వామును, చిటెకెడు ఉప్పును కలిపి నూరి, ఒక గ్లాస్ వేడినీటితో తీసుకోవాలి. 2. కాలేయం లోని వాపు, మంటలను తగ్గించి, దాని ఆరోగ్యాన్ని చక్కపరుస్తుంది.  ప్రేగులలో ఏర్పడే బద్దీక్రిములను పెరగకుండా నిరోధించి, నిర్మూలిస్తుంది.  3.వాము గొంతు, ముక్కు, ఊపిరితిత్తులలోని  స్రావాలు గట్టిపడి బంధించినప్పుడు  వాటిని సమర్దవంతముగా తొలగించటమేకాక,  వానివలన నోటిలో ఏర్పడిన  దుర్వాసన, అరుచిలను దూరంచేస్తుంది.   4. వాము, బెల్లంలను కలిపి నూరి  రోజూ రెండు పూటలా  ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుంటే ఆస్తమాలో మంచి ఫలితం వుంటుంది.   5. మూత్రాశయంలో ఏర్పడిన  రాళ్ళను తొలగించటంలో వాము చక్కగా పనిచేస్తుంది.  వామును, తేనెను కలిపి తీసుకున్నట్లయితే కిడ్నీలలో రాళ్ళను కరిగించి మూత్రం ద్వారా వెడలకొడుతుంది.   6. వాములోని నయసిన్, త్తైమోల్ అనే కాంపౌండ్స్  గుండె చర్యలను ఉత్తేజపరిచి రక్త ప్రసరణను వృద్ధి చెయ్యటం ద్వారా  చెస్ట్ పెయిన్,  గుండె నొప్పులు రాకుండా చేస్థాయి.  వచ్చిన నొప్పులను కూడా సత్వరం తగ్గిస్తాయి.  దీనికోసం ఒక టీస్పూన్  వామును, ఒక టీస్పూన్ బెల్లాన్ని కలిపి నూరి చప్పరించాలి.   7. వాములోని  అన్ శాస్యురేటేడ్ ఫాట్స్, అధికంగా వున్న చెడ్డ కొలెస్టరాల్ LDL ను , తగ్గించటంలో అద్భుతంగా పనిచేస్తాయి.   వీనిలో ఎక్కువగా వుండే పీచుపదార్డం కొలెస్టరాల్ ను బయటకు పంపేందుకు సహకరిస్తుంది.  8. ఆర్ధరైటిస్ వ్యాధిలోని వాపులను, నొప్పులను సునాయాసంగా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తగ్గించటంలో వీనిలోని thymol చక్కగా పనిచేస్తుంది.  ఒక టీస్పూన్ వామును ఒక గ్లాస్ నీటిలో కలిపి తీసుకోవాలి.  9. ఋతుస్రావ సమయంలో మహిళల్లో సంబవించే  చిరచిర, భరించలేని ఈడ్పులు, కడుపునొప్పులను  అద్భుతంగా తగ్గిస్తుంది.  11. పెరుగులో వామును కలిపి రోజూ తీసుకుంటే  ఆల్కాహాల్ త్రాగే కోరికను తగ్గిస్తుంది.  12.  వీని పౌడర్ ను, గుడ్డలో మూటకట్టి వాసన చూస్తుంటే  ముక్కుదిబ్బడ  వెంటనే తొలగిపోతుంది.   13.  స్తీలలో స్తన్యాన్ని వృద్ధిచేస్తాయి.  పాలు పడని బాలింతలలో పాలు పడేట్లు చేస్తాయి.  14. పురుషులలో  శీఘ్రస్కలనాన్ని తగ్గిస్తాయి.   15. వెంట్రుకలు త్వరగా తెల్లబడటాన్ని నివారిస్తాయి.  NB:  ఇవి వేడి తత్వం కలవారి కండ్లకు హాని చేస్తాయి. కనుక మితంగా వాడాలి.  రోజుకు 2 నుండి 4 గ్రాములు  మించకుండా వాడుకోవాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి