యాపిల్: సాధారణంగా మనం
యాపిల్ పండ్లను తొక్కతీసి, పరిశుభ్రంగా తిన్నామని భావిస్తాం. కానీ యాపిల్ తొక్కలో 12 రకాల
ట్రిటర్ పెనాయిడ్స్ ఉన్నాయని కార్నెల్ యూనివర్సిటీ అధ్యయనం. యాంటీ ఆక్సిడెంట్ లు, పాలీఫినాల్స్
గుజ్జులో కంటే 5 రెట్లు తొక్కలో అధికంగా
వున్నాయి. ఇవి కాన్సర్లను రానివ్వవు. అల్జీమిర్ వ్యాదిని, నివారిస్తాయి. చిగుళ్ళను, చర్మాన్ని, ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని
రక్షిస్తాయి. కనుక యాపిల్స్ నుండి అధిక లాభం పొందేందుకు
వానిని ఉప్పు నీటిలో బాగా శుభ్రపరిచి తోలుతో తినటమే మేలు.
పల్లీలు: వేయించిన
వేరుశనగగింజల పై పొట్టును చాలామంది తీసివేసి
తింటారు. దీని పొట్టులో అధిక మోతాదు లో
రిజవెరాట్రాల్ అనే యాంటీ ఆక్షిడెంట్ ఉంటుంది.
ఇది గుండెజబ్బులను, కాన్సర్లను రానివ్వదు.
వృద్దాప్యం రాకుండా నిలుపుదల చేస్తుంది. మతిమరపు, కీళ్లనోప్పులను
నివారిస్తుంది
జామపండు: అత్యధికంగా యాంటీ
ఆక్షిడెంట్లను కలిగిన పండ్లలో జామది
అగ్రస్థానం. దీని తోలులో యాంతోసియానిన్,
రిజేవెరాట్రాల్ మరియు అనేక యాంటీ ఆక్షిడెంట్లు ఉంటాయి. ఇవి కాన్సర్లను, హృద్రోగాలను, నివారించటమే కాక
మంచి ఆరోగ్యాన్ని కలగచేస్తాయి. కనుక జామను తోలుతోనే తినాలి.
నల్లద్రాక్ష: సహజంగా
నల్లద్రాక్ష తోలును మనం ఊసివేస్తాం.
దానితో మనం ద్రాక్షలోని 25% యాంటీ ఆక్షిడెంట్లను కోల్పోవటం జరుగుతుంది.
తద్వారా కొలెస్టరాల్, గుండెజబ్బులను నిరోదించలేము.
నిమ్మ, నారింజ: వీని
తోక్కలలో మోనో టేర్పాన్స్ అనే నూనెలు చర్మ,కాలేయ, గర్భాశయ, ఊపిరితిత్తుల కాన్సర్లను
నిరోధిస్తాయి. కనుక వీనిని పొడి రూపంలో
సలాడ్స్ లోను, టీ లోను చేర్చుకోవటం మంచిది.
పుచ్చకాయ: దీనిలోని తెల్లని
తోలు భాగంలో వ్యాధి నిరోదకశక్తిని
పెంచే సిట్రులిన్, అమినోయాసిడ్స్,
విటమిన్లు అధికంగా వుంటాయి. రక్తహీనత
నివారించే ఇనుము, కాల్షియం, మెగ్నీషియం
కూడా అధికం. కనుక ఈ తెల్లని భాగాన్ని
వదులుకోకూడదు.
కివి: దీని తొక్క
లోపలివైపు ప్లవనాయిడ్ లు, అనేక యాంటీ ఆక్షిడేంట్లు ఉంటాయి. ప్లవనాయిడ్లు శరీరంలోని ప్రీరాడికల్స్ ను,
తొలగించటంలో అమోఘమైనవి. కనుక దీని పై తోలును అతిపలుచగా మాత్రమె తొలగించాలి.
క్యారెట్: దీని చర్మంలో
సగానికి పైగా ఫినోలెక్ కాంపౌండ్స్, అనేక పైటో న్యూట్రియాంట్స్ లభిస్తాయి. కనుక వీనిని ఎల్లప్పుడు చర్మంతోనే తినడం
మంచిది. తినేముందు ఉప్పునీటిలో
శుభ్రపరుచుకుంటే చాలు.
బీరకాయ, దోసకాయ, కీర దోసకాయలను అతి తక్కువగా తోలు తీసి తినటం
ఆరోగ్యం. బీరకాయ తోలులో ఫైబర్, పోషకాలు అధికం.
దోసకాయ తోలులో A విటమిన్, బీటా కేరాటిన్, ఎక్కువగా ఉంటాయి. కీరా పై చర్మంలో విటమిన్ K, పొటాషియం, యాంటీ
ఆక్షిడెంట్ లు, చాలా అధికం.
చిలగడదుంప: దీని చర్మంలో
ఇనుము, జింక్, విటమిన్ E అధికంగా ఉంటాయి. ఇనుము రక్తహీనతను రానివ్వదు. జింక్ మరియు
విటమిన్ E వ్యాధి నిరోధకశక్తిని పెంచుతాయి.
కనుక వీనిని ఎల్లప్పుడు చర్మంతోనే తినటం చాలా మంచిది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి