పేజీలు

13, జులై 2018, శుక్రవారం

Health Tips - 1

                గర్భవతుల వాంతులు, వికారం  
> ఉదయాన్నే చిన్న అల్లం ముక్కను నమిలి మింగినా, ఒక కప్పు నీటిలో అల్లం ముక్క వేసి టీలా కాచి వేడిగా త్రాగినా
   వాంతులు నెమ్మదిస్తాయి.
> పది చుక్కలు నిమ్మరసం, అర స్పూన్ పంచదార, ఒక కప్పు నీటిలో కలపాలి. పావు స్పూన్ బేకింగ్ సోడా కలిపి
వెంటనే త్రాగితే వాంతులు,వికారం పోతాయి.
> రెండు యాలకి కాయలను నమిలి రసం మింగుతూ ఉంటే వికారం, వాంతులుతగ్గిపోతాయి. 
> రాత్రిపూట ఎండు ఖర్జూరాలను నీటిలో నానబెట్టి  మరుచటి రోజు  ఉదయాన్నే ఆ నీటిని త్రాగితే వేవిళ్ళు తగ్గుతాయి.
> ఉదయాన్నే మాదీఫలరసాయనం రెండు స్పూన్లు, నీళ్ళు కలిపి త్రాగితే వేవిళ్ళు పూర్తిగా తగ్గుతాయి.
                      బాలింతల క్షీరవృద్ధికి
> తమ ఆహారంలో క్యాబేజీని తరఛుగా తీసుకుంటే పాలిచ్చే తల్లులకు క్షీర వృద్ధి కలుగుతుంది.
> వామును కషాయం కాచి, రోజుకొకసారి  ఒక ఔన్స్ మోతాదు త్రాగితే చనుబాలు పెరుగుతాయి.  
> లవంగ చూర్ణంలో కొద్దిగా ఇంగువ పొడి కలిపి రెండు పూటలు తీసుకుంటే పాలు వృద్ధి అవుతాయి.
> బార్లీ గింజలు 5 గ్రాములు, పావు లీటరు పాలలో మెత్తగా ఉడికించి పంచదార చేర్చి త్రాగిన క్షీరవృద్ది.
> దోరగా ఉన్న బొప్పాయి కాయను కూర వండుకుని తింటే చనుబాలు వృద్ది అవుతాయి.
                     రక్తలేమి 
> ప్రతిరోజు రెండు పూటలా తేనె ఒక స్పూన్ తీసుకుంటే రక్తం వృద్ధి అవుతుంది.
> ప్రతిరోజు రెండు పూటలా పొదిన ఆకుల రసం మూడు స్పూన్లు తీసుకుంటే రక్తం వృద్ధి అవుతుంది.
> మునగాను తరచుగా వాడితే చక్కని రక్తం పడుతుంది. యవ్వనవంతులుగా ఉంచుతుంది.(గర్భిణీలు వాడరాదు)
> పాలకూరను ఆహారంగా తరచు వాడితే హిమోగ్లోబిన్, రక్తము వృద్ది చెందుతాయి.
                     కడుపు ఉబ్బరం, మంట  
> ఒక గ్లాస్ వేడినీటిలో ఒక నిమ్మకాయ రసం, చిటికెడు ఉప్పు వేసి, కలిపి త్రాగితే ఉబ్బరం తగ్గిపోతుంది.
> ఒక గ్లాస్ మజ్జిగలో ఒక స్పూన్ ధనియాలపొడి కలిపి త్రాగితే కడుపులో మంట తగ్గుతుంది.
> ఒక చిన్న అల్లం ముక్కను నమిలి రసం మింగిన కడుపులో మంట తగ్గుతుంది.
> చల్లటి పాలు ఒక గ్లాస్ తాగితే కడుపులో మంట, ఎసిడిటీ తగ్గిపోతాయి.
> ధనియాలు 1పాలు, గసాలు 1పాలు, పంచదార 2పాళ్ళు, కలిపి చూర్ణం చేసుకోవాలి.  ఈ చూర్ణం రెండు పూటలా
ఒక గ్లాస్ వేడినీటిలో కలిపి త్రాగితే, తలనొప్పి,తలతిరగటం పోతాయి.
> చిన్న అల్లము ముక్కను ఉప్పులో అద్ది, ప్రతిరోజు పరగడుపున తింటుంటే తలతిప్పు వ్యాధి తగ్గిపోతుంది.
> ఒక చిటికెడు కరివేపాకు చూర్ణం తేనెతో కలిపి పరగడుపున  తీసుకుంటే పైత్య సంబందమైన
 వికారం,  తలతిప్పు తగ్గుతాయి.
> టొమాటో, బీట్ రూట్, క్యారట్, ఆరెంజ్, జ్యూసులు సమంగా కలిపి ఒక ఔన్స్ మోతాదు ప్రతిరోజు ఉదయం
తీసుకుంటే మీ శరీరఛాయ పెరుగుతుంది. 
> ప్రతిరోజూ అర స్పూన్ మెంతులపోడిని తీసుకుంటే, ప్రసవానంతరం గర్భాశయాన్ని యదాస్థితికి తెస్తుంది.
పొట్టను తగ్గిస్తుంది.
> చిన్న ఇంగువ ముక్కను రోజూ తీసుకున్న గర్భాశయాన్ని, పొట్టను పూర్వస్థితికితెస్తుంది.
> జీలకర్రను నేతిలో వేయించి తగినంత ఉప్పు కలిపి రెండుపూటలా అన్నము  లేదా మజ్జిగతో చిటికెడు తింటే
 జీర్ణాశయ రోగాలు రావు. 
> వాము కషాయాన్ని తేనెతో రోజూ బాలింతలకు ఇస్తే గర్భాశయం కృశించుకుంటుంది. పాలు బాగా పడతాయి.
> స్నానానికి అరగంట ముందు, పసుపు కలిపిన కొబ్బరినూనె రాసినట్లయితే, చీరె కట్టిన చోట నల్లమచ్చలు పోతాయి.
> నీరుల్లిపాయను, క్యారట్ ను, గుండ్రంగా తరిగి, రోజూ తింటుంటే మీ స్వరం మధురంగా మారుతుంది.
> ఒక స్పూన్ వేప ఆకులపొడిని నీటిలో వేసుకుని స్నానం చేస్తే శరీరం నుండి దుర్గంధం రానివ్వదు.  చెమటను,
 చమటపొక్కులను, రానివ్వదు. 
> నీళ్ళ విరేచనాలు అవుతున్నప్పుడు, గసగసాలు, పంచదార ఒక్కొక్క స్పూన్ కలిపి మూడుపూటలు తింటే
కట్టుకుంటాయి.
> బెల్లం, జీలకర్ర సమంగా కలిపి నూరి, బటాణీగింజలంత గోలీలు చేసి మూడుపూటలా చప్పరిస్తే ఆకలిలేమి తగ్గుతుంది.
> కొతిమెర ఆకులతో టీ కాచి త్రాగినా, చెట్నీగా చేసుకుని తిన్నా, కండరాలు ముణగాలాగుకపొయ్యే వ్యాది
 (Cramps) నివారణ అవుతుంది. 
> Sore Throat: చిటికెడు ఉప్పు, రెండు చిటికెలు పసుపు వేసి కాచిన నీటితో రెండు పూటలా పుక్కిలించి ఉయ్యాలి.
> ఒక కప్పు పాలలో పావు స్పూన్ పసుపు వేసి కాచి, వేడిగా త్రాగితే గొంతువాపు తగ్గుతుంది.
> 5ml. తేనెను ఒక కప్పు వేడి నీటిలో కలిపి మూడు పూటలా త్రాగుతుంటే గొంతు వాపు, నొప్పి తగ్గుతాయి.
> ప్రతిరోజు ఉదయం దాల్చిన చెక్కను 3గ్రాముల మోతాదులో నమిలి తినుచుండిన మతిమరుపు తొలగిపోవును.
> మూడు పూటలు ఒక గ్లాస్ మజ్జిగ చొప్పున  త్రాగుచుండిన రక్త విరేచనాలు తగ్గిపోవును.
> అరికాళ్ళ మంటలు, తిమ్ముర్లు, నొప్పులు: నువ్వులనూనెను అరికాళ్ళకు బాగా మర్ధనచేస్తే తగ్గుతాయి.
> అల్లంరసంలో తేనె కలుపుకుని ఒక స్పూన్ మోతాదు త్రాగుతుంటే జలుబు, దగ్గు, కళ్ళేపడటం తగ్గుతాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి