పేజీలు

25, జనవరి 2019, శుక్రవారం

మధుమేహం - Home Remidies

మధుమేహం  - హోమ్ రెమిడీస్
1 ఒక టీస్పూన్ దాల్చినచెక్క పొడిని,  ఒక గ్లాస్ వేడినీటిలో కలిపి ప్రతిరోజు  ఉదయం పరగడుపున త్రాగాలి 
2 రాత్రి మూడు లేత మామిడిఆకులను ఒక గ్లాస్ నీటిలో ఉడికించి, మూతపెట్టి, ఉదయాన్నేవడకట్టి త్రాగాలి   
3 రెండు స్పూన్ల మెంతులను రాత్రి పెద్ద గ్లాస్ నీటిలో నానబెట్టి, ఉదయం వానిని నీటితో సహా పరగడుపున త్రాగాలి 
4 ఒక గ్లాస్ మజ్జిగలో రెండు స్పూన్ల కలబంద రసము కలిపి ఉదయం, సాయంత్రం తీసుకోవాలి  
5 రెండు స్పూన్ల పెద్ద ఉసిరికాయల రసమును,  ఒక కప్పు నీటిలో కలిపి  రెండు పూటలా తీసుకోవాలి 
6 లేత మామిడి ఆకులను కడిగి, నీడలో ఎండించి పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఒక టీస్పూన్ మోతాదులో 
ఒక గ్లాస్ నీటిలో కలిపి ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం త్రాగితే మంచి ఫలితం ఉంటుంది 
7 ఒక కాకరకాయను ముక్కలుగా కోసి,  చిటికెడు ఉప్పు, చిటికెడు మిరియాలపొడిని వేసి మిక్సీలో 
రసం తీసి వడకట్టి ఉదయం పరగడుపున ఒక గ్లాస్ నీరు కలిపి త్రాగాలి 
8 ఒక గుప్పెడు వేపాకులను శుభ్రపరిచి, రాత్రి ఒక గ్లాస్ నీటిలో నానబెట్టి, ఉదయం వాటిని వడకట్టి,
ఆ నీటిని ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే మేలు చేస్తుంది 
9 పది కరివేపాకులను కడిగి, ఒక గ్లాస్ నీటిలో వేసి అయిదు నిముషాలు మరిగించాలి. 
ఆ నీటిని వడకట్టి ప్రతిరోజూ టీలా ఉదయం పరగడుపున త్రాగాలి 
10 రెండు టీస్పూన్ల యాపిల్ సిడార్ వెనిగర్  తీసుకుని, 100 ml  నీటిలో కలిపి త్రాగాలి   

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి