పేజీలు

15, జనవరి 2019, మంగళవారం

గొంతు నొప్పి (Sore throat)


    Home Remidies.
1. ఒక గ్లాస్ వేడినీటిలో అర టీస్పూన్ కళ్ళు ఉప్పు కలిపి బాగా పుక్కిలించాలి. ఇది మంటను, చిరచిరను  తగ్గించి          గొంతును సరిచేస్తుంది.
2. ఒక గ్లాస్ వేడినీటిలో అర టీస్పూన్ బేకింగ్ సోడా, దానిలో సగం ఉప్పు కలిపి బాగా పుక్కిలించి ఉయ్యాలి. ఇది
    గొంతులోని క్రిములను నాశనం చేస్తుంది.
3. ఒక గ్లాస్ పాలలో అర టీస్పూన్ పసుపు కలిపి వేడిచేసి త్రాగాలి. గొంతు వాపు తగ్గుతుంది.
4. ఒక కప్పు నీటిలో చిటికెడు సోంపు గింజలు వేసి కాచి, వడకట్టి కొద్ది వేడిలో త్రాగాలి.  లేదా సొంపును చిటికెడు            నోటిలో వేసుకుని నమిలి రసం  మింగవచ్చు.
5. చికెన్ సూప్  తయారుచేసుకుని తగిన వేడిలో త్రాగాలి. బిగిచిన ముక్కులు తెరుసుకుంటాయి. గొంతు,                     ముక్కులలోని స్రావాలు బయటకు నెట్టబడతాయి.
6. దాల్చినచెక్క పొడి, యాలకులపొడి ఒక్కొక్క గ్రాము, చిటికెడు మిరియాలపొడి, ఒక స్పూన్ తేనెతో బాగా
     కలిపి మూడు పూటలా చప్పరించాలి.  గొంతు మృదువుగా మారుతుంది.
7. 15 తులసి ఆకులు  ఒక గ్లాస్ నీటిలో వేసి, 10 నిముషాలు మరిగించి వడకట్టి, ఒక స్పూన్  తేనె కలిపి త్రాగాలి.
8. రెండు వెల్లుల్లి రెబ్బలు నలిపి, చిటికెడు జీలకర్ర  కలిపి, టీలా కాచి వడకట్టి  త్రాగితే ఉపశమనం వస్తుంది.
9. అతిమధురం (Licorice), లేదా కేమోమిల్ల  వేసి టీ కాసుకుని, వడకట్టి తాగితే మంచి ఫలితం ఉంటుంది.
10. మంచి తేనెను  రాత్రి పడుకునే ముందు ఒక స్పూన్ త్రాగితే దగ్గు నెమ్మదించి, నిద్ర పడుతుంది.  

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి