పేజీలు

20, జనవరి 2019, ఆదివారం

దగ్గు (Cough)Home Remidies.

1. ఒక టీస్పూన్ అల్లం రసం, ఒక టీస్పూన్ తేనె కలిపి, రెండు పూటలా చప్పరించాలి.  ఇది గొంతులో నుసను                తగ్గిస్తుంది. తెమడను తొలగిస్తుంది.
2. ఒక టీస్పూన్  వాము పొడిని తమలపాకులో ఉంచి, నిద్రించే ముందు నమిలి తింటే పొడి దగ్గును రానీయదు.
3. తాజా నల్లద్రాక్ష పండ్లను రసము తీసి,  ఒక కప్పుకు కొద్దిగా తేనె చేర్చి త్రాగితే పొడిదగ్గు తగ్గిపోతుంది.
4. పొడిదగ్గుకు చిన్న అల్లం ముక్కను తరిగి, ఒక గ్లాస్ నీటిలో  5 నిముషాలు మరిగించి, వడకట్టి తేనె చేర్చి త్రాగాలి.
5. ఒక కప్పు పాలలో చిటికెడు పసుపు, ఒక స్పూన్ తేనె కలిపి త్రాగితే రాత్రులలో ఎక్కువగా వచ్చే దగ్గు తగ్గుతుంది.
6. valerian,Thyme లలో ఏదోఒకటి,  ఒక కప్పు నీటిలో మరిగించి, వడకట్టి త్రాగితే, పండుకుంటే పెరిగే దగ్గు రాదు.
7. రెండు స్పూన్ల తేనెను నేరుగా కాని, అయిదు చుక్కల నిమ్మరసం కలిపి గాని తీసుకుంటే మేలు చేస్తుంది.
8. ఒక అరటిపండులో రెండు టేబుల్ స్పూన్ల పెరుగు కలిపి రెండు పూటలా తింటే మంచి ఉపశమనం కలుగుతుంది.
9.అతిమధురం వేరు లేదా ఒక టీస్పూన్ మిరియాల పొడితో టీ కాచి, ఒక స్పూన్ తేనె చేర్చి మూడుసార్లు త్రాగాలి.
10.తాజా పైనాపిల్ ను రసం తీసి వడకట్టి, ఒక స్పూన్ తేనె చేర్చి రెండు పూటలు ఒక కప్పు మోతాదులో త్రాగాలి.
11. తులసిఆకు పేస్ట్, అల్లం రసం, తేనె, మూటిని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని బాగా కలిపిన తర్వాత ఆ
      మిశ్రమాన్ని ఉదయం, సాయంత్రం నిదానంగా చప్పరించాలి. 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి