పేజీలు

1, ఫిబ్రవరి 2019, శుక్రవారం

అరటిపండు


అరటిపండు:     ఆంగ్లం:  బనాన      హిందీ:  కేల
సర్వసాదారణంగా మన దేశంలోని అన్ని ప్రాంతాలలో లభించే, అందరూ కొనగలిగే పండు అరటిపండు.  విస్థారంగా లభిస్తున్నందున దీనిని మనము తేలిక భావంతో చూస్తాము. కానీ దీనిలోని  పోషకాలు, విటమినులను సరిపోల్చితే  యాపిల్ పండు దీనిముందు బలాదూరే.  ఆరోగ్యం కోరుకునే ప్రతి ఒక్కరూ, ప్రతిరోజూ తినవలసిన, తినదగిన సూపర్ పండు ఇది.  యాపిల్ కంటే 5 రెట్ల A విటమిన్, 5 రెట్ల ఇనుము, 3 రెట్ల ఫాస్ఫరస్, 2 రెట్ల పిండి పదార్ధాలు,  మెరుగ్గా పొటాషియం, పీచు, మెగ్నీషియం, విటమిన్లు లభ్యం అవుతాయి. 1. అరటిపండులోని ట్రిప్టోటాన్ అనే అమినోయాసిడ్, విటమిన్ B తో కలిసి సెరిటోనిన్ ను తయారు చెయ్యటం ద్వారా, మానసిక కృంగుదలను  తొలగించి, ఆహ్లాదకర మనోస్థితిని కలిగిస్తుంది.  2. దీనిలో సమృద్ధిగా ఉన్న B6 విటమిన్ స్త్రీల బహిష్టు సమయంలో కలిగే కడుపునొప్పిని అద్భుతంగా తగ్గిస్తుందని పరిశోధనలు  చెబుతున్నాయి.  గర్భిణీలలో తరచుగా  సంభవించే వేవిళ్లను కూడా ఈ విటమిన్ నివారించగలుగుతుంది.  గుండెపోటుకు కారణమయ్యే homocysteine స్థాయిని తగ్గించటం ద్వారా, గుండె ఆరోగ్యాన్ని పెంచేందుకు కూడా B6 దోహదపడుతుంది.       3. జీర్ణాశయం, చిన్నప్రేవులలో  ఏర్పడే అల్సర్లను, శ్లేష్మాన్ని, తొలగించి, వానిని స్వస్థత పరచటంలో అరటి అందెవేసిన చెయ్యి.  అరటి వీనిలోని మంట, నొప్పి, చిరచిరలను నివారిచి, ఆ దెబ్బతిన్న భాగాలపై రక్షణకవచం ఏర్పరుస్తుంది. 4. అరటిలో సమృద్ధిగా ఉన్న పొటాషియం రక్తపోటును నియంత్రణ చేస్తుంది.  మెదడుకు అధిక ఆక్షిజన్ అందించటం ద్వారా మెదడు యొక్క పనితీరును మెరుగు  పరుచుతుంది.  పొటాషియం కిడ్నీలలో రాళ్ళు ఏర్పడకుండా నిరోదిస్తుంది. నాడీ తంత్రుల క్రియాశీలతను, స్పంధనాశక్తిని  వృద్ధి చేస్తుంది.  5. దీనిలోని ఇనుము హిమోగ్లోబిన్, ఎర్ర రక్తకణాలను వృద్ధిచేసి  అనీమియా రాకుండా చేస్తుంది. దీనిలోని choline అనే విటమిన్  పొట్ట భాగంలో పెరుకునే క్రొవ్వును కరిగిస్తుంది. 6. దీనిలోని మాంగనీస్ మరియు C విటమిన్ కలిసి శరీరంలో  కోలోజేన్ తయారీకి దోహదం చెయ్యటమే కాక,  ఫ్రీ రాడికల్స్ వలన కలిగే  కణవిధ్వసం జరగకుండా నిరోధిస్తాయి. Lutein,  Zeaxanthin, Albeit, లాంటి యాంటీ ఆక్షిడెంట్లు కూడా ఈ క్రియలో సాయపడతాయి. 7. అరటిలోని  కరిగే పీచు, కరగని పీచులు, రక్తంలోని షుగర్ శాతాన్ని నియంత్రించటమే కాక,  కొలెస్టరాల్ ను బయటకు నేట్టివేస్తాయి. దీనిలోని పెక్టిన్ అనే ఎంజైమ్ జీర్ణవాహిక, చిన్నప్రేవుల లోపలి  పొరను మృదువుగా మార్చి, ప్రేగులలోని విషపదార్ధములను బయటకు పంపుతుంది. 8. దీనిలోని మెగ్నీషియం  మెదడులోని నాడీతంత్రుల మద్య ప్రసారాలను వృద్ధి పరుస్తుంది.  ఎముకలకు  స్వరూపాన్ని, సాంద్రతనుకలిగించటంలో కూడా మెగ్నీషియం తోడ్పడుతుంది. 9. అరటిపండు తోలు లోపలి భాగంలో అధిక పోషకాలు  ఉన్నందున ,  పారవెయ్యకుండా ఆ భాగాన్ని తినటం మంచిది.  ఈ తోలు లోపలి భాగంతో రుద్దటం ద్వారా పులిపిర్లను, చర్మం నల్లబడటాన్ని, కీటకాలు కుట్టిన బాధలను తగ్గించుకోవచ్చు. 10.అరటి జీర్ణశక్తిని పెంచుతుంది. కీళ్ళ నొప్పులను తగ్గిస్తుంది. కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తుంది.  కూరఅరటికాయ ఉడికించి తిన్నా, రోజూ అరటిపండ్లు  తిన్నా, క్షయ వ్యాధి రోగుల ఆయుషు గణనీయంగా పెరుగుతుంది. డయోరియాను, అల్సర్లను తగ్గిస్తుంది. 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి