పేజీలు

1, ఏప్రిల్ 2009, బుధవారం

పెన్గ్ సూయి అదృష్ట వస్తువులు-3

8. Mandarine Ducks:
దంపతుల మద్య ప్రేమానుబంధములను  పెంచటానికి  మేన్డరిన్ బాతులు  బాగా ఉపయోగపడతాయి.
వీనిని పడకగది నైరుతి మూల ఉంచాలి. వీనిని జంటగా మాత్రమె ఉంచాలి. వీనిలో ఒకటి మగది,
ఒకటి ఆడది తప్పక ఉండాలి. పెండ్లి కాని యువతి యువకులు వీనిని తమ పడక గదిలో
ఉంచితే వారికి త్వరగా వివాహం అవుతుంది. వీనిని 1 లేదా 3 గా ఉంచకూడదు.

9. ప్రయాణిస్తున్న ఓడ (Sailing Ship) :
వ్యాపారంలో అధిక టర్నోవర్, అధిక లాభం, సపలతలకు సహాయపడేది ఇది. దీనిని మీ
ఆపిసు లేదా ఇంట్లో ప్రదాన ద్వారం లోపల ఉంచాలి. ఓడ లోపలికి పయనిస్తునట్లుగా
ఉంచటం  చాలా ముఖ్యం. బయటకు ప్రయాణిస్తున్నట్లుగా ఉంచటం నష్టం.

10. చేపల తొట్టి (Fish Aquarium) :
ధనాదాయం కొరకు ఇంట్లో ఉంచుకోదగిన వస్తువులలో అత్యుత్తమమైనది  చేపలతొట్టి.
సాదారణంగా దీనిలో ఎనిమిది బంగారు రంగు చేపలు, ఒకటి నల్లని చేప ఉంచాలి.
దీనిని మీ ఇంటి హాలులో ఉత్తరం గోడకు దగ్గరగా ఉంచటం మంచిది. తూర్పు,
ఆగ్నేయం గోడలకు సమీపంలో కుడా ఉంచటం మంచిదే.  పడక గది, మరుగుదొడ్డి,
వంటగది  వంటి  వానిలో  ఉంచకండి. ధననష్టం కలుగుతుంది.
వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి