పేజీలు

30, మార్చి 2009, సోమవారం

పెన్గ్ సుయి అదృష్ట వస్తువులు-2

5. డ్రాగన్ తల తాబేలు (Dragon headed aturtle):

బంగారు నాణేల మీద కూర్చొని ఉన్న డ్రాగన్ తల కలిగిన తాబేలు, దాని వీపు మీద మరోపిల్ల తాబేలుతో
ఉంటుంది. దీనిని మీ హాలులో తూర్పు లేదా ఎదిక్కున అయినా ఉంచుకోవచ్చు. ఆపీసులో అయితే మీ వెనుక ఉంచుకోవాలి. ఇది సంపద, పేరు ప్రఖ్యాతులు, స్నేహితులు, విద్య, పిల్లలు, మంచి వివాహ జీవితం, ఉద్యోగం, \
ఆరోగ్యం లాంటి ఎనిమిది లాభాలను తెచ్చే అదృష్ట వస్తువు.


6. ఫోనిక్స్ (Fhoenix):
ఇష్ట కార్య సిద్దికి, అవకాశాల వెల్లువను, వృత్తిలోను- సంపదలోను పెరుగుదలను, మీరు కోరుకుంటే
మీ ఇంట ఫోనిక్స్ చిత్రం లేదా పెయింటింగ్ ఉంచవలసిందే. దీనిని మీరు మీ ఇంట్లోని హాలులోని  దక్షిణపు
గోడ మీద ఉంచాలి. ఇది వివాహ అవకాశాలను, వ్యాపారంలో ముందు చూపును పెంచుతుంది.
అంతేకాక దెబ్బతిన్న వ్యాపారం, కుదరని వివాహం, విద్యల యందు మంచి అవకాశాలను ఇస్తుంది.


7. నీళ్ళ పవుంటేయిన్ (Water Fountain):
పెంగ్సుయి ప్రకారం నీళ్లు సిరిసంపదలకు చిహ్నం. మీ ఇంట్లోని హాలు లేదా డ్రాయింగ్ రూము లలో
ఉత్తరం గోడ దగ్గరిగా చిన్న నీళ్ళ పవుంటేయిన్ ఉంచండి. దీనివలన మీ భోగభాగ్యాలు వృద్ది
చెందుతాయి. ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి.
వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి