పేజీలు

1, ఏప్రిల్ 2009, బుధవారం

పెంగ్సుయి అదృష్ట వస్తువులు-4

11. వెదురు మొక్కలు ( Bamboo ) :
వెదురు దీర్ఘాయువుకు, ఐశ్వర్యానికి, ఆటుపోటులను తట్టుకుని నిలబడే శక్తికి చిహ్నం . మీ ఇంటి బయటి స్తలంలో ఆగ్నేయ మూలలో కొలదిగా వెదురు మొక్కలు పెంచటం మీకు అదృష్టాన్ని తెచ్చి పెడుతుంది. అన్ని విపత్కర పరిస్థితుల నుండి తట్టుకునే శక్తిని ఇస్తుంది. మూడుమొక్కలు సంతోషానికి,  అయిదు సంపదకు,  ఆరు మొక్కలు ఆరోగ్యానికి, మంచిది.   మీ ఇంటి హాలులో తూర్పు, ఆగ్నేయ దిక్కులలో - గాజు బౌలులో పెరిగే వెదురు మొక్కలను లేదా చిత్రపటంను కుడా ఉంచుకోవటం అదృష్టమే.

12. గ్లోబు (Globe) :
దీనిని హాలు లేదా చదువుకునే గది ఈశాన్య భాగంలో ఉంచినచో విద్యార్ధులు
తెలివితేటలను, విద్యలో ఉన్నత స్థానాలను పొందేందుకు సహాయపడుతుంది.
దీనిని వాయవ్య మూల ఉంచిన యెడల అత్యధిక వ్యాపార లాభం, వ్యాపార
వృద్ధి కలిగిస్తుంది.  విదేశీ ప్రయాణ యోగమును  కూడా కలిగిస్తుంది.
అయితే దీనిని రొజూ 3 సార్లు గుండ్రంగా తిప్పాలి.

13. విద్యా స్తూపం ( Pagoda) :
ఇంటిలోని హాలులో దీనిని ఉంచినట్లయితే దుష్ట శక్తుల నుండి, అన్ని రకాల
అనారోగ్యాల నుండి రక్షణ కల్పించటంలో అద్వితీయమైనది. దీనిని
వ్యాపార స్తలంలో మీ వెనుక ఉంచుకుంటే వ్యాపారంలో పోటీదారుల నుండి,
కుతన్త్రముల నుండి, వ్యాపార నష్టముల నుండి రక్షణ కల్పిస్తుంది. పిల్లలు
చదువుకునే గదిలో ఈశాన్యంలో ఉంచడం వలన విద్యలో అభివృద్ధిని, పరీక్షలలో
అదృష్టాన్ని కలిగిస్తుంది.

14. దాల్పిన్ (Dolphin) :
రెండు డాల్పిన్ చేపలు పైకి ఎగురుతున్నట్లున్న  బొమ్మ లేదా పటము అదృష్టాన్ని,
వృత్తి అవకాశాలను, వృత్తిలో విజయాన్ని కలిగిస్తుంది. దీనిని మీ ఇంటి
డ్రాయింగ్ రూము లో ఉత్తరపు గోడకు తగిలించాలి.

15. తాబేలు ( Turtle) :
చిన్న మెటల్ తాబేలు బొమ్మను,  చిన్న సిరామిక్ గిన్నెలో నీటితో ఉంచాలి.
ఆ గిన్నెను హాలులోని ఉత్తరం గోడ దగ్గరగా ఉంచాలి. దానిలోని నీటిని రొజూ
మార్చాలి. ఇది వృత్తిలో అభివృద్దిని, ఉద్యోగ విజయాలను, ఆరోగ్యాన్ని కలిగిస్తుంది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి