విటమిన్
|
మరోపేరు
|
లోపంతో వచ్చే
వ్యాధి
|
సమృద్ధిగా లబించే ఆహారం
|
B1
|
Thiamine
|
బెరిబెరి
|
బచ్చలి, వేరుశనగగింజలు, పెరుగు, బీన్స్,
|
|
|
|
ముడిబియ్యం, కొర్రలు, నట్స్,
|
B2
|
Riboflavin
|
నోరు, పెదవులు,
|
చిలగడదుంప, పుట్టగొడుగుల, చీజ్,
|
|
|
ఎరుపు, పగుళ్ళు
|
బాదం, నువ్వులు, సజ్జలు, ఆకుకూరలు
|
B3
|
Niacin
|
పెల్లెగ్ర
|
మాంసం, ఈస్ట్, మస్రూం, పల్లీలు, లివరు,
|
|
|
|
అండుకొర్రలు, చేపలు, పంది మాంసము
|
B4
|
Adenine
|
కండరాల బలహీనత
|
లవంగాలు, జీలకర్ర, అల్లం, టొమాటోలు,
|
|
|
|
స్ట్రాబెర్రీ, మంచి తేనె,
|
B5
|
Pantothenic Acid
|
కాళ్ళు మంటలు ,
|
మాంసము, ఆకుకూరలు,పుట్టగొడుగులు,
|
|
|
కురుపులు, పుండ్లు
|
లివర్, కోడిగ్రుడ్లు,
|
B6
|
Pyridoxine
|
రక్తహీనత
|
బొప్పాయి, సోయాబీన్, చిక్కుళ్ళు,
|
|
|
|
కమలాలు, చిరుధాన్యాలు, ఈస్ట్,
|
B7
|
Biotin
|
జీర్ణాశయవ్యాదులు,
|
బచ్చలి, బ్రకోలి, చిలగడదుంప, సోయాబీన్
|
|
|
ఎగ్జిమా
|
గ్రుడ్డు పచ్చసొన, మాంసం, లివరు, ఈస్ట్
|
B8
|
Inositol
|
హార్మోన్ అసమతులన
|
పల్లీలు, అరటి,ద్రాక్ష, ఈస్ట్, మాంసము,
|
|
|
|
క్యాబేజీ, సోయాబీన్, నిమ్మపండ్లు,నట్స్,
|
B9
|
Folic Acid
|
డిఎన్ఏ లోపాలు
|
బ్రకోలి, బీట్రూట్, యాస్పరాగస్, అవకాడో,
|
|
|
|
బొప్పాయి, సోయాబీన్, కమలాలు,అరటి
|
B10
|
PABA
|
చర్మకణాలు పై
|
పెరుగు,బచ్చలి, పుట్టగొడుగులు,తవుడు,
|
|
|
ఫ్రీరాడికల్స్ దాడి
|
సన్ ప్లవర్ గింజలు, గోదుమ మొలకలు,
|
B11
|
Salicylic Acid
|
డిఎన్ఏ,
RNA లలో
|
కలే, బచ్చలి, క్యాబేజీ, బంగాళదుంప,
|
|
|
లోపాలు, ఆకలిలేమి,
|
చేపలు, గ్రుడ్లు, కమలాలు
|
B12
|
Cobalamine
|
నరాల బలహీనత
|
మాంసం, పన్నీరు, పంది మాంసం, బీఫ్,
|
|
|
|
కోడిమాంసం, లివరు, చేపలు, గ్రుడ్లు
|
B13
|
Orotic Acid
|
స్క్లెరోసిస్
|
ఆవుపాలు, క్యారట్, బీట్రూట్, ముల్లంగి,
|
|
|
|
లివరు, దుంపకూరలు
|
B14
|
Betaine
|
రక్తహీనత
|
ఈస్ట్, వైన్, కొర్రలు, సామలు, బచ్చలి,
|
|
|
|
బీట్రూట్, చిలగడదుంప, పుట్టగొడుగులు
|
B15
|
Pangamic Acid
|
గుండెజబ్బులు
|
మొక్కజొన్నలు, ఈస్ట్, ఎప్రికాట్ గింజలు
|
|
|
|
ఎర్రగుమ్మడి, బీఫ్, ముడిబియ్యము
|
B17
|
Amygdalin
|
క్యాన్సర్
|
బ్రకోలి, పార్సలె, అవిసె గింజలు, అరికెలు,
|
|
|
|
బార్లీ , కొర్రలు, బాదం గింజలు, జీడిపప్పు
|
10, జనవరి 2019, గురువారం
B Vitamin
31, డిసెంబర్ 2018, సోమవారం
వాము, ఓమము
వాము, ఓమము ఆంగ్లం: Carom Seeds,
Thymol Seeds హిందీ: అజవాయిన్
1. వాము అజీర్తిని, అరుచిని
తగ్గించటంలో అమోఘమైనది. ఇది జీర్ణాశయంలోని
స్రావాలను క్రమబద్దీకరించటం ద్వారా జీర్ణశక్తిని వృద్ది చేస్తుంది. ఇది ప్రేగులలో గ్యాస్ ను, ఉబ్బరాన్ని తగ్గించి,
బందించిన మలాన్ని సులభంగా జారీ చేస్తుంది.
పొత్తికడుపులో అత్యధికంగా వాయువు బంధించటం ద్వారా కలిగే కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం లను వాము
సునాయాసంగా తగ్గిస్తుంది. దీనికి ఒక టీస్పూన్ వామును, చిటెకెడు ఉప్పును కలిపి
నూరి, ఒక గ్లాస్ వేడినీటితో తీసుకోవాలి. 2. కాలేయం లోని వాపు, మంటలను తగ్గించి,
దాని ఆరోగ్యాన్ని చక్కపరుస్తుంది.
ప్రేగులలో ఏర్పడే బద్దీక్రిములను పెరగకుండా నిరోధించి,
నిర్మూలిస్తుంది. 3.వాము గొంతు, ముక్కు,
ఊపిరితిత్తులలోని స్రావాలు గట్టిపడి బంధించినప్పుడు వాటిని సమర్దవంతముగా తొలగించటమేకాక, వానివలన నోటిలో ఏర్పడిన దుర్వాసన, అరుచిలను దూరంచేస్తుంది. 4. వాము, బెల్లంలను కలిపి నూరి రోజూ రెండు పూటలా ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుంటే ఆస్తమాలో మంచి
ఫలితం వుంటుంది. 5. మూత్రాశయంలో ఏర్పడిన రాళ్ళను తొలగించటంలో వాము చక్కగా పనిచేస్తుంది.
వామును, తేనెను కలిపి తీసుకున్నట్లయితే
కిడ్నీలలో రాళ్ళను కరిగించి మూత్రం ద్వారా వెడలకొడుతుంది. 6. వాములోని
నయసిన్, త్తైమోల్ అనే కాంపౌండ్స్ గుండె
చర్యలను ఉత్తేజపరిచి రక్త ప్రసరణను వృద్ధి చెయ్యటం ద్వారా చెస్ట్ పెయిన్, గుండె నొప్పులు రాకుండా చేస్థాయి. వచ్చిన నొప్పులను కూడా సత్వరం
తగ్గిస్తాయి. దీనికోసం ఒక టీస్పూన్ వామును, ఒక టీస్పూన్ బెల్లాన్ని కలిపి నూరి
చప్పరించాలి. 7. వాములోని అన్ శాస్యురేటేడ్ ఫాట్స్, అధికంగా వున్న చెడ్డ
కొలెస్టరాల్ LDL ను , తగ్గించటంలో అద్భుతంగా పనిచేస్తాయి. వీనిలో ఎక్కువగా వుండే పీచుపదార్డం
కొలెస్టరాల్ ను బయటకు పంపేందుకు సహకరిస్తుంది.
8. ఆర్ధరైటిస్ వ్యాధిలోని వాపులను, నొప్పులను సునాయాసంగా, ఎటువంటి సైడ్
ఎఫెక్ట్స్ లేకుండా తగ్గించటంలో వీనిలోని thymol చక్కగా పనిచేస్తుంది. ఒక టీస్పూన్ వామును ఒక గ్లాస్ నీటిలో కలిపి
తీసుకోవాలి. 9. ఋతుస్రావ సమయంలో మహిళల్లో
సంబవించే చిరచిర, భరించలేని ఈడ్పులు, కడుపునొప్పులను అద్భుతంగా తగ్గిస్తుంది. 11. పెరుగులో వామును కలిపి రోజూ తీసుకుంటే ఆల్కాహాల్ త్రాగే కోరికను తగ్గిస్తుంది. 12. వీని
పౌడర్ ను, గుడ్డలో మూటకట్టి వాసన చూస్తుంటే
ముక్కుదిబ్బడ వెంటనే
తొలగిపోతుంది. 13. స్తీలలో స్తన్యాన్ని వృద్ధిచేస్తాయి. పాలు పడని బాలింతలలో పాలు పడేట్లు చేస్తాయి. 14. పురుషులలో
శీఘ్రస్కలనాన్ని తగ్గిస్తాయి. 15.
వెంట్రుకలు త్వరగా తెల్లబడటాన్ని నివారిస్తాయి.
NB: ఇవి వేడి తత్వం కలవారి కండ్లకు
హాని చేస్తాయి. కనుక మితంగా వాడాలి. రోజుకు
2 నుండి 4 గ్రాములు మించకుండా వాడుకోవాలి.
లేబుళ్లు:
ఆహారమే ఔషధం,
ఓమము,
వాము,
Ajwain,
caromseeds
15, డిసెంబర్ 2018, శనివారం
తీసిపారెయ్యవద్దు - తింటేనేమేలు
యాపిల్: సాధారణంగా మనం
యాపిల్ పండ్లను తొక్కతీసి, పరిశుభ్రంగా తిన్నామని భావిస్తాం. కానీ యాపిల్ తొక్కలో 12 రకాల
ట్రిటర్ పెనాయిడ్స్ ఉన్నాయని కార్నెల్ యూనివర్సిటీ అధ్యయనం. యాంటీ ఆక్సిడెంట్ లు, పాలీఫినాల్స్
గుజ్జులో కంటే 5 రెట్లు తొక్కలో అధికంగా
వున్నాయి. ఇవి కాన్సర్లను రానివ్వవు. అల్జీమిర్ వ్యాదిని, నివారిస్తాయి. చిగుళ్ళను, చర్మాన్ని, ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని
రక్షిస్తాయి. కనుక యాపిల్స్ నుండి అధిక లాభం పొందేందుకు
వానిని ఉప్పు నీటిలో బాగా శుభ్రపరిచి తోలుతో తినటమే మేలు.
పల్లీలు: వేయించిన
వేరుశనగగింజల పై పొట్టును చాలామంది తీసివేసి
తింటారు. దీని పొట్టులో అధిక మోతాదు లో
రిజవెరాట్రాల్ అనే యాంటీ ఆక్షిడెంట్ ఉంటుంది.
ఇది గుండెజబ్బులను, కాన్సర్లను రానివ్వదు.
వృద్దాప్యం రాకుండా నిలుపుదల చేస్తుంది. మతిమరపు, కీళ్లనోప్పులను
నివారిస్తుంది
జామపండు: అత్యధికంగా యాంటీ
ఆక్షిడెంట్లను కలిగిన పండ్లలో జామది
అగ్రస్థానం. దీని తోలులో యాంతోసియానిన్,
రిజేవెరాట్రాల్ మరియు అనేక యాంటీ ఆక్షిడెంట్లు ఉంటాయి. ఇవి కాన్సర్లను, హృద్రోగాలను, నివారించటమే కాక
మంచి ఆరోగ్యాన్ని కలగచేస్తాయి. కనుక జామను తోలుతోనే తినాలి.
నల్లద్రాక్ష: సహజంగా
నల్లద్రాక్ష తోలును మనం ఊసివేస్తాం.
దానితో మనం ద్రాక్షలోని 25% యాంటీ ఆక్షిడెంట్లను కోల్పోవటం జరుగుతుంది.
తద్వారా కొలెస్టరాల్, గుండెజబ్బులను నిరోదించలేము.
నిమ్మ, నారింజ: వీని
తోక్కలలో మోనో టేర్పాన్స్ అనే నూనెలు చర్మ,కాలేయ, గర్భాశయ, ఊపిరితిత్తుల కాన్సర్లను
నిరోధిస్తాయి. కనుక వీనిని పొడి రూపంలో
సలాడ్స్ లోను, టీ లోను చేర్చుకోవటం మంచిది.
పుచ్చకాయ: దీనిలోని తెల్లని
తోలు భాగంలో వ్యాధి నిరోదకశక్తిని
పెంచే సిట్రులిన్, అమినోయాసిడ్స్,
విటమిన్లు అధికంగా వుంటాయి. రక్తహీనత
నివారించే ఇనుము, కాల్షియం, మెగ్నీషియం
కూడా అధికం. కనుక ఈ తెల్లని భాగాన్ని
వదులుకోకూడదు.
కివి: దీని తొక్క
లోపలివైపు ప్లవనాయిడ్ లు, అనేక యాంటీ ఆక్షిడేంట్లు ఉంటాయి. ప్లవనాయిడ్లు శరీరంలోని ప్రీరాడికల్స్ ను,
తొలగించటంలో అమోఘమైనవి. కనుక దీని పై తోలును అతిపలుచగా మాత్రమె తొలగించాలి.
క్యారెట్: దీని చర్మంలో
సగానికి పైగా ఫినోలెక్ కాంపౌండ్స్, అనేక పైటో న్యూట్రియాంట్స్ లభిస్తాయి. కనుక వీనిని ఎల్లప్పుడు చర్మంతోనే తినడం
మంచిది. తినేముందు ఉప్పునీటిలో
శుభ్రపరుచుకుంటే చాలు.
బీరకాయ, దోసకాయ, కీర దోసకాయలను అతి తక్కువగా తోలు తీసి తినటం
ఆరోగ్యం. బీరకాయ తోలులో ఫైబర్, పోషకాలు అధికం.
దోసకాయ తోలులో A విటమిన్, బీటా కేరాటిన్, ఎక్కువగా ఉంటాయి. కీరా పై చర్మంలో విటమిన్ K, పొటాషియం, యాంటీ
ఆక్షిడెంట్ లు, చాలా అధికం.
చిలగడదుంప: దీని చర్మంలో
ఇనుము, జింక్, విటమిన్ E అధికంగా ఉంటాయి. ఇనుము రక్తహీనతను రానివ్వదు. జింక్ మరియు
విటమిన్ E వ్యాధి నిరోధకశక్తిని పెంచుతాయి.
కనుక వీనిని ఎల్లప్పుడు చర్మంతోనే తినటం చాలా మంచిది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)