పేజీలు

30, మార్చి 2009, సోమవారం

పెన్గ్ సూయి అదృష్ట వస్తువులు-1

1. నవ్వేబుద్ధుడు (Laughing Budha) :
అత్యంత అదృష్ట వస్తువుగా భావించే నవ్వుతున్న బుద్దుని ప్రతిమ ముఖద్వారానికి ఎదురుగా ఉంటే మీరు సంపద , ధనం, విజయం, ఖచితంగా లభిస్తాయని చెప్పగలము. ఇది ఆనందానికి, పురోభివృద్ధికి కూడా చిహ్నము. దీనిని ఇంటి ప్రదాన ద్వారం ఎదురుగా ఉన్న గోడకు దగ్గరగా ప్రదాన ద్వారం వైపు చూస్తూ ఉన్నట్లుగా , సుమారు ౩౦ అంగుళముల ఎత్తులో ప్రస్ఫుటంగా కన్పించేట్లుగా ఉంచాలి. అలా వీలు కాకపొతే  గుమ్మానికి అయిమూలగా చూచేట్లుగా ఉంచాలి. దీనిని బెడ్రూం , డైనింగ్ రూము , స్నానాల గదులలో ఉంచరాదు.

2..అదృష్టపు కప్ప  (Fortune Frog):
ధనాదాయాన్ని ఇవ్వగల అత్యంత అదృష్ట దాయకమైన వస్తువుగా దీనిని భావిస్తారు. దీనినే మూడు కాళ్ళ కప్ప
(Thee legged frog) అని కూడా అంటారు . దీనిని ప్రదాన ద్వారం లోపలి అంచున, ఏదో ఒక చోట ఇంటి లోపలి
వైపు చూస్తున్నట్లుగా ఉంచుకోవాలి. దీనిని ఎట్టి పరిస్థితులలోను వాకిలి ఎదురుగా కాని, నేలమీదకాని, వంటగది,
స్నానాలగది, మరుగుదొడ్డి, పడకగది లలో ఉంచరాదు. ఇది నోట్లో నాణె ముతో ఉంటుంది. ఇది అదృష్ట దేవతను
మన ఇంట్లోకి తీసుకవస్తుందని భావం. ఇది రాని అప్పులను, చెడిన సంబందాలను కుడా సరిచేస్తుంది.

3. చైనా నాణెములు:
మూడు చైనా నాణెములను ఎర్రటి రిబ్బనుతో కట్టి ఇంటి ప్రదాన ద్వారము లోపలివైపున డోరు హాన్దిలుకు వేలాడ
తీయ్యాలి. ఇవి మీ కుటుంబ సభ్యులందరికీ  పురోభివృద్దిని కలిగిస్తాయి. వీనిని డోరు బయట వైపున గాని, ఇతర
ద్వారాలుకు గాని కట్టరాదు. వీనిని పర్సులో గాని, వ్యాపార స్థలము నందు క్యాష్ బాక్సు లో గాని ఉంచుకోవటం
అదృష్టం. ఈ నాణేల మీద నాలుగు గురుతులు ఉన్న భాగం ఎప్పుడు పైకి కన్పించేటట్లు ఉంచటం మరువవద్దు.
ఇది చాలా ముఖ్యం.

4.గాలి గంటలు (Wind Chimes):
చెడు ' శక్తిని' తరిమికొట్టి, సద్భాగ్యమును వృద్ది చేసే ఉత్కృష్ట మైన సాదనం గాలి గంటలు. వీని నుండి వెలువడే
మదుర శబ్దములు కొన్ని వ్యాదులను తగ్గించి, మనుష్యులలో చైతన్యాన్ని వృద్ది చేస్తాయి. ఆరు గొట్టముల
విండ్ చిం మీ హాలులోని వాయవ్య మూల వ్రేలాడ దీస్తే మీకు స్నేహితులు  మరియు  వారి వలన సహాయము లభించటము అధికం అవుతుంది. ఏడు రాడ్స్ గల దానిని పడమర దిక్కున వ్రేలాడ తీస్తే మీ పిల్లలు తెలివి తేటలు పెరిగి పురోభివృద్ది చెందుతారు. ఎనిమిది రాడ్స్ గల దానిని ఈశాన్య మూల వ్రేలాడ తీస్తే మీ సంపద, సద్భాగ్యం , వృద్ది  చెందుతాయి. వీనిని మంచి లోహం, మంచి కొలతలు గల వానిని ఎన్నిక చేసుకోవాలి.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి