పేజీలు

21, జూన్ 2018, గురువారం

జీడిపప్పు


జీడిపప్పు. ఆంగ్లం: Cashew nut. హిందీ: కాజు .
1. గుండెజబ్బులను నివారిస్తుంది: జీడిపప్పులో అధిక మొత్తంలో ఉండే మోనో అన్ శాచ్యురేటేడ్ ఫాట్స్ , రక్తంలోని ట్రై గ్లిజరైడ్స్ ను తగ్గించటం ద్వారా గుండెజబ్బులు రాకుండా చూస్తాయి. వీనిలో సమృద్ధిగా ఉన్న యాంటీ ఆక్షిడెంట్ లు కూడా గుండెజబ్బుల నివారణలో పనిచేస్తాయి అని పరిశోధనలు చెబుతున్నాయి. L arginine అవయవాలకు రక్తప్రసరణను పెంచి, విషాలను బయటకు నెట్టటం ద్వారా జీవక్రియను మెరుగుపరుస్తుంది. 2. మంచి ఆకారాన్ని, అందాన్ని ఇస్తాయి: వీనిలో సమృద్ధిగా ఉన్న కాపర్ ఫ్రీ రాడికల్స్ ను బయటకు నెట్టి ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. మరియు తరళమైన ఎముకల అభివృద్దికి, కీళ్ళలోని మృదులాస్థి అభివృద్దికి, తోడ్పడుతుంది. చర్మము, శిరోజాలకు చెందిన మెలానిన్ తయారీకి, రక్తనాళాల మృదుత్వానికి చక్కగా పనిచేస్తుంది. చర్మానికి సొగసునిచ్చే కొలాజన్, ఎలాస్తిన్ ల తయారీని ఉత్తేజపరుస్తుంది. ఎర్ర రక్తకణాల తయారీని పెంచుతుంది. పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, K విటమిన్లు కూడా ఎముకల ఆరోగ్యాన్ని పెంచుతాయి. 3. మధుమేహం: వీనిలోని మోనో అన్ శాచ్యురేటేడ్ క్రొవ్వులు, చెడ్డ కొలెస్టరాల్ ను తగ్గించి, మంచి కొలెస్టరాల్ ను పెంచుతాయి. వీనిలోని పీచుపదార్డం జీర్ణక్రియను వేగవంతం చేసి షుగర్ నిల్వలను క్రమపరుస్తుంది. ఎనాకార్దిక్ యాసిడ్, గ్లూకోజ్ నియంత్రణలోను, రవాణాలోను, ఉపయోగపడుతుంది. 4. దీనిలోని మెగ్నీషియం ఎముకల దృడ త్వానికి, ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది BPని, కండరాలు ముణగలాగుక పోవటాన్ని, మైగ్రైన్ను, నివారిస్తుంది. గాల్ బ్లాడర్లో రాళ్ళు, గుండెజబ్బులు రాకుండా సహాయపడుతుంది. మెగ్నీషియం, కాల్షియం పనిని నియంత్రించటం ద్వారా రక్తనాళాలు, కండరాలు ప్రశాంత స్థితిలో ఉండేట్లు చేస్తుంది. 5. టాకోపెరాల్స్ అనే యాంటీ ఆక్షిడేంట్ , ఫినోలెక్ కాంపౌండ్స్, DNAలు డామేజి కాకుండాను, కణాల మ్యుటేష న్ జరగకుండాను, కోలన్ ప్రోస్టేట్ కాలేయములకు కాన్సర్ రాకుండాను చేస్తాయి. 6. లుటైన్, జియాక్లాంధిన్ లు, కండ్లకు కేటరాక్టులు, గ్రుడ్డితనం రాకుండా చూస్తాయి. పోలిక్ యాసిడ్ గర్భిణీలకు మేలు చేస్తుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి